ETV Bharat / state

ప్రభుత్వాన్ని పడగొడతామంటుంటే చూస్తూ ఊరుకోవాలా? - ఇప్పటి నుంచి నా రాజకీయం చూపిస్తా : సీఎం రేవంత్​ రెడ్డి - cm revanth reddy meet the media

CM Revanth in Meet the Media : కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్ఎస్, బీజేపీ నేతలు పదే పదే అంటున్నారని, వాళ్లు ప్రభుత్వాన్ని పడగొడుతుంటే చూస్తూ ఊరుకుంటామా? అని సీఎం రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల నగరా మోగిందని, ఈ రోజు తన రాజకీయం చూపిస్తానని పేర్కొన్నారు.

CM Revanth on Rythu Bharosa
CM Revanth in Meet the Media
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 17, 2024, 4:18 PM IST

ఈరోజు నుంచే రాజకీయం ప్రారంభించా: సీఎం రేవంత్​రెడ్డి

CM Revanth in Meet the Media : తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఫిరాయింపులకు పాల్పడలేదని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth) పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగిందని, ఇక నుంచి పార్టీ అధ్యక్షుడిగా తన పని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా బషీర్‌బాగ్‌ ప్రెస్​క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్‌ ది మీడియా కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్ఎస్, బీజేపీ నేతలు పదే పదే అంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు ప్రభుత్వాన్ని పడగొడుతుంటే చూస్తూ ఊరుకుంటామా? అని సీఎం హెచ్చరించారు. కుక్కకాటుకు చెప్పు దెబ్బ అని పెద్దలు చెప్పారని, కొట్టకుండా ఊరుకుంటామా? అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఎన్నికల నగారా మోగిందని, నేటి నుంచి తన రాజకీయాన్ని చూపిస్తానని రేవంత్​ రెడ్డి వెల్లడించారు.

CM Revanth on Rythu Bharosa : 'రైతు భరోసా గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు 5 ఎకరాలు ఉన్న రైతుల వరకూ రైతు బంధు (Rythu Bandhu) వారి ఖాతాల్లో పడింది. 62 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందింది. ఇకపై గుట్టలు, రోడ్లు, బంగళాలు, లే ఔట్లకు రైతు భరోసా ఇవ్వబోము. ఏ ప్రభుత్వ పథకం అందకపోయినా దరఖాస్తు చేసుకోవాలి. పరిశీలించి అందిస్తాం. రైతుబంధు దుర్వినియోగాన్ని ఆపుతాం. అర్హులందరికీ ఇస్తాం. దుబారా తగ్గించడమే సంపద సృష్టించడం. గత సర్కారు అడ్డగోలుగా జీఎస్టీ మినహాయింపులు ఇచ్చింది. కేంద్రం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేస్తాం. కేసీఆర్‌ జమానాలో నచ్చితే నజరానా - నచ్చకపోతే జరిమానా అన్నట్లుగా వ్యవహరించారు' అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణకు ప్రపంచంతోనే పోటీ : తమ పోటీ ఏపీ, కర్ణాటకతో కాదని, తమ పోటీ ప్రపంచంతోనేనని సీఎం రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు సమాన అవకాశాలు కల్పిస్తామన్నారు. దావోస్‌ పర్యటనతో రూ.వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇస్తున్నామన్న ఆయన, స్థూలంగా రూ.8 లక్షల కోట్ల రుణభారం తెలంగాణపై ఉందని చెప్పారు. రాష్ట్రం వచ్చిన మొదట్లో ఏడాదికి చెల్లించాల్సిన అప్పులు రూ.6 వేల కోట్లు ఉంటే, ఇప్పుడు రాష్ట్రం చెల్లించాల్సిన అప్పులు ఏడాదికి రూ.64 వేల కోట్లు ఉన్నాయని వివరించారు. రాష్ట్రాన్ని నడిపించడానికి ప్రతి నెల రూ.11 వేల కోట్లు కావాలని, కేంద్రంతో చిల్లర తగాదాలకు వెళ్లమని పునరుద్ఘాటించారు. గవర్నర్‌ వ్యవస్థతో కూడా వివాదాలు కోరుకోవడం లేదని సీఎం స్పష్టం చేశారు.

కవిత అరెస్టుతో పెద్దడ్రామాకు తెరలేపారు : సీఎం రేవంత్​రెడ్డి

పదవుల పంపకంలో సామాజిక న్యాయం పాటిస్తున్నాం. సామాజిక న్యాయం విషయంలో మమ్మల్ని వేలెత్తి చూపలేరు. గత సర్కారు రూ.వేల కోట్ల అక్రమాలకు పాల్పడింది. గత సర్కారు అక్రమాలపై విచారణకు ఆదేశించాం. పారదర్శకంగా విచారణ జరుగుతుంది. బాధ్యులపై చర్యలు తప్పవు. జీవోలు దాచి పెట్టే అవసరం లేదు. అన్నీ ప్రజల ముందు ఉంచుతాం. మేం ఎక్కువ విద్యుత్‌ ఇస్తున్నా, కొన్నిచోట్ల కోతలు జరుగుతున్నాయి. కొందరు కావాలనే వీఐపీల ప్రాంతాల్లో విద్యుత్‌ కోతలు చేయిస్తున్నారు. అక్కడక్కడ కొన్ని గంజాయి మొక్కలు ఈ పనులు చేస్తున్నాయి. - రేవంత్​ రెడ్డి, సీఎం

బీఆర్​ఎస్​కు మరో షాక్ - కాంగ్రెస్​ గూటికి ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్

'కేసీఆర్‌ ఆనవాళ్లు ఇంకా ఉన్నాయి - ఆయన నాటిన గంజాయి మొక్కలు వాసన వెదజల్లుతున్నాయి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.