CM Revanth Reddy Comments On BRS : ఉద్యోగాల కోసం నిరుద్యోగులు అప్పట్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బాట పట్టారని కానీ గత ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 50 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని తెలిపారు. నిరుద్యోగులకు నియామక పత్రాలు అందించడం తనకు సంతృప్తిని ఇస్తుందన్నారు. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో 99 మంది ఏఎంవీఐలకు సీఎం ఉద్యోగ నియామకపత్రాలు అందజేశారు.
10 నెలల్లో ఏం కోల్పోయిందో ప్రజలు తెలుసుకున్నారని ఒక పెద్దాయన అంటున్నారని తెలంగాణ ఏం కోల్పోలేదని పెద్దాయన ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారని సీఎం రేవంత్ విమర్శించారు. గత ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్ ఒక్కటైనా కట్టిందా అని ప్రశ్నించారు. రెసిడెన్షియల్ స్కూల్ కట్టలేదు కానీ ఆయన మాత్రం 10 ఎకరాల్లో ఫామ్‌హౌస్ కట్టుకున్నారని అన్నారు. 2011లో రాష్ట్రంలో చివరిసారిగా గ్రూప్-1 నిర్వహించారని దాదాపు 13 ఏళ్లపాటు గ్రూప్-1 నిర్వహించలేదని తెలిపారు. ఎన్ని ఆటంకాలు పెట్టినా పట్టుబట్టి గ్రూప్-1 పరీక్షలు నిర్వహించానని త్వరలో గ్రూప్-1 నియామకపత్రాలు అందజేస్తాని తెలిపారు.
ఉద్యోగాల కోసం నిరుద్యోగులు అప్పట్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బాట పట్టారని కానీ గత ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 50 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని తెలిపారు. నిరుద్యోగులకు నియామక పత్రాలు అందించడం నాకు సంతృప్తిని ఇస్తుందన్నారు. ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో 99 మంది ఏఎంవీఐలకు సీఎం ఉద్యోగ నియామకపత్రాలు అందజేశారు.
"ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. డ్రగ్స్ తీసుకుంటూ దొరికినా మమ్మల్ని పట్టుకోవద్దని దబాయిస్తున్నారు. ఫామ్‌హౌస్‌లో కొందరు మద్యం సేవించి దీపావళి చేసుకుంటున్నారు. చిచ్చుబుడ్లకు బదులు సారాబుడ్లతో కొందరు దీపావళి జరుపుకుంటున్నారు." -సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy Comments On PM Modi : మైనారిటీ సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో 2 వర్గాలే ఉన్నాయి, ఒకటి మోదీ వర్గమని మరొకటి గాంధీ వర్గం అని అన్నారు. హిందూ ముస్లిం భాయి భాయి అన్నదే కాంగ్రెస్ విధానం. మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని తెలిపారు. వాళ్ల రిజర్వేషన్లను రద్దు చేసేందుకు మోదీ యత్నిస్తున్నారని మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిని ఓడించాలని అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఆయన దయతోనే సీఎం అయ్యాను - అవి పూర్తి చేయకపోతే నన్ను క్షమించరు : రేవంత్ రెడ్డి
"ప్రధాని అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే - మేం నిజాలు చెబుతూనే ఉంటాం"