ETV Bharat / state

'ఒక సంవత్సరం కడుపు కట్టుకుని అయినా రుణమాఫీ చేసి తీరుతాం - పంద్రాగస్టు తర్వాత సిద్దిపేటకు పట్టిన శని వదిలిపోతుంది' - cm Revanth counter to Harish Rao

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 26, 2024, 2:02 PM IST

Updated : Apr 26, 2024, 4:08 PM IST

CM Revanth VS Harish Rao : హరీశ్‌రావు రాజీనామా లేఖతో అమరవీరుల స్తూపం వద్దకు రావటంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. ఆయన చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామ లేఖ అంటున్నారని, కానీ స్పీకర్ ఫార్మాట్‌లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదని తెలిపారు. ఆగస్టు 15లోగా రూ. 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. అలాగే హరీశ్‌రావు రాజీనామా లేఖను సిద్ధంగా పెట్టుకోవాలని, ఆగస్టు 15న సిద్దిపేటకు పట్టిన శని వదులుతుందని అన్నారు.

cm Revanth counter to Harish Rao
cm Revanth counter to Harish Rao
'ఒక సంవత్సరం కడుపు కట్టుకుని అయినా రుణమాఫీ చేసి తీరుతాం - పంద్రాగస్టు తర్వాత సిద్దిపేటకు పట్టిన శని వదిలిపోతుంది'

Revanth Counter to Harish Rao : పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తామన్నసీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనపై బీఆర్ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన సవాల్‌ మాటల యుద్ధానికి దారితీసింది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని, చేయకుంటే రేవంత్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తారా? అని హరీశ్‌రావు ఇవాళ గన్‌పార్క్ వేదికగా మరోసారి సవాల్‌ విసిరారు.

CM Revanth Reddy VS Harish Rao : హరీశ్‌రావు సవాల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మోసం చేయాలనుకునే ప్రతిసారి హరీశ్‌కు అమరవీరుల స్తూపం గుర్తుకు వస్తుందని విమర్శించారు. ఇన్నాళ్లు ఎప్పుడైనా ఆయన అమరుల స్తూపం దగ్గరకు వెళ్లారా అని ప్రశ్నించారు. చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటున్నారని దుయ్యబట్టారు. రాజీనామ లేఖ అలా ఉండదని, తన మామ చెప్పిన సీస పద్యమంతా లేఖలో రాసుకొచ్చారని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా కార్యకర్తలతో జరిగిన సమావేశంలో సీఎం ఈ మేరకు మాట్లాడారు. స్పీకర్ ఫార్మాట్‌లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదని రేవంత్‌రెడ్డి అన్నారు. హరీశ్‌రావు తెలివి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికీ చెబుతున్నానని, ఆయన సవాల్‌ను ఖచ్చితంగా తాను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. పంద్రాగస్టులోగా రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. అలాగే హరీశ్‌రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని రేవంత్‌రెడ్డి సూచించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజునే సిద్దిపేటకు పట్టిన శని వదిలిపోతుందని అన్నారు.

హరీశ్​రావు సవాల్‌ను కచ్చితంగా స్వీకరిస్తున్నా. మాజీ మంత్రి హరీశ్ తెలివి ప్రదర్శిస్తున్నారు. రాజీనామా లేఖ అలా ఉండదు. స్పీకర్‌ ఫార్మాట్‌లో లేకుంటే రాజీనామా చెల్లదు. చాంతాడంత రాసి రాజీనామా లేఖ అంటారా? హరీశ్ తెలివి మోకాళ్లలో కాదు, అరికాళ్లలోకి జారినట్టుంది. మోసం చేయాలనుకున్న ప్రతిసారి హరీశ్​కు అమరవీరుల స్థూపం గుర్తొస్తుంది. రూ.2 లక్షలు రుణమాఫీ చేసి తీరుతా. హరీశ్ రాజీనామాకు సిద్ధంగా ఉండు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజే సిద్దిపేటకు పట్టిన శని వదిలిపోతుంది. - సీఎం రేవంత్ రెడ్డి

రిజర్వేషన్లు రద్దు చేయాలనేది బీజేపీ విధానమని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆనాడు బ్రిటీషర్లు సూరత్‌ చేరుకుని క్రమంగా దేశమంతా ఆక్రమించుకున్నారని, ఇప్పుడు కూడా సూరత్‌ వ్యాపారులు దేశాన్ని ఆక్రమిస్తున్నారని విమర్శించారు. బీజేపీ అంటే బ్రిటీష్‌ జనతా పార్టీ అని ఎద్దేవా చేసిన సీఎం, బ్రిటీష్‌ వాళ్ల వలే బీజేపీ వాళ్లకూ రిజర్వేషన్లు నచ్చవన్నారు. కార్పొరేట్‌ కంపెనీల కుట్రలో భాగంగా రిజర్వేషన్లు రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోందన్న ఆయన, ఇప్పటికే రూ.60 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ సంస్థలను మోదీ అమ్మేశారని పేర్కొన్నారు. 13 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే రెట్టింపు అప్పు మోదీ చేశారని దుయ్యబట్టారు.

కడుపు కట్టుకునైనా రుణమాఫీ : ఈ క్రమంలోనే తాను ఉంటే తమ కుట్రలు సాగవని కేసీఆర్‌, కేటీఆర్‌ భావిస్తున్నారని, వారి కుట్రలను ఎంపీ ఎన్నికల్లో మరోసారి తిప్పికొట్టాలన్నారు. కాంగ్రెస్‌ సైనికులు మరోసారి అవిశ్రాంతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పంద్రాగస్టు తర్వాత సిద్దిపేటకు హరీశ్‌రావు శని వదులుతుందన్న సీఎం, రైతుల రుణమాఫీకి రూ.30-40 వేల కోట్లు ఖర్చు చేసేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కాళేశ్వరంలో కేసీఆర్‌ కుటంబం తిన్న రూ.లక్ష కోట్ల కంటే రుణమాఫీ సొమ్ము ఎక్కువేమీ కాదని, ఒక సంవత్సరం కడుపు కట్టుకుని అయినా రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు.

నేను రాజీనామా పత్రంతో వచ్చా - రేవంత్ సాబ్ ఒట్టేద్దాం మీరూ రండి : హరీశ్‌రావు

Last Updated : Apr 26, 2024, 4:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.