ETV Bharat / state

తాత్కాలిక మరమ్మతులకు తక్షణ సాయం అందించాలి : కేంద్రమంత్రిని కోరిన సీఎం రేవంత్‌రెడ్డి - CM Revanth Meet With Shivraj Singh - CM REVANTH MEET WITH SHIVRAJ SINGH

CM Revanth Met Union Minister Shivraj Singh : రాష్ట్రంలో నెలకొన్న వరద విపత్కర పరిస్థితులపై ఖమ్మంలో పర్యటించిన కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్​ చౌహాన్, అనంతరం సచివాలయానికి చేరుకున్నారు. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి సాధారంగా స్వాగతించి, కేంద్రమంత్రికి వరద విలయంపై వివరించారు. ఆయన వెంట మరో కేంద్రమంత్రి బండి సంజయ్, పలువురు రాష్ట్ర మంత్రులు ఉన్నారు.

Shivraj Singh Chauhan Inspect Flood Situation
CM Revanth Met Union Minister Shivraj Singh (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2024, 5:46 PM IST

Updated : Sep 6, 2024, 7:05 PM IST

Union Minister Shivraj Singh Chauhan Inspect Flood Situation in TG : వరద తాకిడితో అల్లాడిన ఖమ్మం, పాలేరు, మధిర ప్రాంతాల్లో పర్యటించిన కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్​ చౌహాన్ అనంతరం సచివాలయం చేరుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి సాధర స్వాగతం పలికి, శాలువాతో సత్కరించారు. వరద నష్టంపై సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి సమీక్షలో మరో కేంద్రమంత్రి బండి సంజయ్​ పాల్గొన్నారు. కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమై, వివిధ జిల్లాల్లో జరిగిన వరద నష్టాన్ని వివరించారు. రాష్ట్రంలో వరద నష్టం తీవ్రంగా ఉందని, తక్షణ సాయంతో పాటు శాశ్వత పునరుద్ధరణ పనులకు తగిన నిధులు కేటాయించాలని సీఎం కోరారు. సుమారు రూ.5,438 కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు ముఖ్యమంత్రి వివరించారు.

ఎన్డీఆర్ఎఫ్ నిధుల విడుదల విషయంలో మార్గదర్శకాలను సడలించాలని కేంద్ర మంత్రిని రేవంత్ రెడ్డి కోరారు. ఏపీకి ఎలాంటి సాయం చేస్తారో తెలంగాణకూ అదే స్థాయిలో చేయాలని, రెండు రాష్ట్రాలనూ ఒకే విధంగా చూడాలని సీఎం కోరారు. సచివాలయంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్​కు వరద ప్రభావం, నష్టాన్ని ముఖ్యమంత్రి, అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఫోటోలతో వివరించారు. పలు జిల్లాల్లో ఒక్కరోజే 40 సెంటిమీటర్ల వరకు వర్షం కురిసిందని, వరద ప్రభావిత జిల్లాల్లోని గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉందని సీఎం చెప్పారు. రోడ్లు, ఇళ్లు, బ్రిడ్జిలు పూర్తిగా దెబ్బతిన్నాయని రాకపోకలు స్తంభించాయని ముఖ్యమంత్రి కేంద్రమంత్రికి వివరించారు.

విపత్తుల సమయంలో ప్రజలకు సాయం చేయడంలో పార్టీలు, రాజకీయాలు ఉండవు : ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర పంట నష్టం జరిగిందన్న ఆయన, పొలాలన్నీ రాళ్లు, ఇసుక మేటలతో నిండిపోయాయని వివరించారు. తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు రూ.10 వేలు పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర మంత్రికి సీఎం చెప్పారు. విపత్తుల సమయంలో ప్రజలకు సాయమందించే విషయంలో పార్టీలు, రాజకీయాలు ఉండవని కేంద్ర మంత్రి శివరాజ్​సింగ్ చౌహాన్ తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎస్ శాంతికుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

నేనూ రైతునే - భావోద్వేగానికి గురైన అన్నదాతను హత్తుకొని ఓదార్చిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్‌ - Union Minister Shivraj on Floods

తెలుగు రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం రూ.3,300 కోట్ల ఆర్థిక సాయం - central govt announce flood relief

Last Updated : Sep 6, 2024, 7:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.