Lok Sabha Elections 2024 : కేంద్రంలో యూపీఏ హయాంలో రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని, సీఎం రేవంత్ పేర్కొన్నారు. తాండూరుకు సాగునీరు ఇచ్చేందుకు వైఎస్‌ఆర్ ప్రభుత్వం కృషి చేసిందని ఆయన తెలపారు. తాండూరుకు నీరు ఇచ్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టిందని, కేసీఆర్ అధికారంలోకి వచ్చి ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును రద్దు చేసి ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు.
దేశం సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది : సీఎం రేవంత్ రెడ్డి - CM Revanth Campaign in Patancheru
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని కేంద్రాన్ని అడిగితే ఇవ్వలేదని, సీఎం రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని ఆయన తెలిపారు. మే 9 నాటికి రైతుభరోసా కింద రూ.7500 కోట్ల నిధులు వేస్తామని చెప్పామని, చెప్పిన మాట ప్రకారం రెండ్రోజుల ముందే మే 6 నాటికి రైతుభరోసా నిధులు వేశామని స్పష్టం చేసారు.
వికారాబాద్ అనంతగరి పద్మనాభ స్వామి సాక్షిగా ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తానని, సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి వారి రుణం తీర్చుకుంటానని, రైతు రుణమాఫీ చేయకపోతే తన జీవితానికి అర్థం ఉండదంటూ పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన పరిశ్రమలు బీజేపీ రద్దు చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమను సోనియాగాంధీ కేటాయించారని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని సోనియాగాంధీ మంజూరు చేశారని గుర్తు చేశారు.
హైదరాబాద్‌కు ఐటీఐఆర్ ప్రాజెక్టును యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిందని, యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన అన్ని ప్రాజెక్టులు మోదీ రద్దు చేశారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఈ పదేళ్లలో తెలంగాణకు ప్రధాని మోదీ గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చారని, అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీకి కర్రు కాల్చి వాతపెట్టాలని పిలుపునిచ్చారు. చెప్పుకోవటానికి ఏమీ లేకనే బీజేపీ నేతలు జై శ్రీరామ్ అంటున్నారని, దేవుడి పేరు చెప్పి పోలింగ్ బూత్‌లో ఓట్లు అడుక్కోవటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఒకేసారి రూ.లక్ష రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని తెలిపారు.
"వికారాబాద్ అంనతగరి పద్మనాభస్వామి సాక్షిగా ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తాను. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి వారి రుణం తీర్చుకుంటాను. రైతు రుణమాఫీ చేయకపోతే నా జీవితానికి అర్థం ఉండదు. ఈ పదేళ్లలో తెలంగాణకు ప్రధాని మోదీ గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చారు. తెలంగాణకు గాడిదగుడ్డు మాత్రమే ఇచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాతపెట్టాలి". - రేవంత్‌రెడ్డి, సీఎం