ETV Bharat / state

ఎన్టీఆర్ స్డేడియంలో ఘనంగా సదర్ ఉత్సవం - హాకీ స్టిక్స్​తో స్టెప్పులేసిన సీఎం రేవంత్‌

హైదరాబాద్​లో ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా సదర్​ సమ్మేళనం - ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి - మూసీ అభివృద్ధికి యాదవులు అండగా నిలవాలని విజ్ఞప్తి - ఈ సందర్భంగా సదర్ స్టెప్పులేసిన సీఎం

CM REVANTH IN SADAR SAMMELANAM
CM Revanth Reddy Dance at Sadar sammelanam in NTR Stadium (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Updated : 1 hours ago

CM Revanth Reddy Dance at Sadar sammelanam in NTR Stadium : యాదవ జాతి నిత్యం అభివృద్ధిని కాంక్షించేదని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ అభివృద్ధికి సైతం యాదవులు అండగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఇవాళ హైదరాబాద్​లో ఎన్టీఆర్ స్టేడియంలో సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్‌ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవానికి సీఎం రేవంత్​రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాను ముఖ్యమంత్రిగా ఉండడానికి ముఖ్య కారణం యాదవ సోదరులు ఇచ్చిన భరోసా అని గుర్తుచేసుకున్న ఆయన, తెలంగాణ ఉద్యమంలో అంజన్ కుమార్ యాదవ్ పాత్ర మరపురానిదన్నారు. అంజన్‌ కుమార్‌ను గెలిపించి ఉంటే మంత్రి అయ్యి ఉండేవారని పేర్కొన్నారు.

'హైదరాబాద్​లో విజయ్​ డైయిరీ, హెరిటెజ్​ డైయిరీ వచ్చింది. కానీ నగరంలో పేదవాడి నుంచి పెద్దోళ్ల వరకు పాలు కావాలన్నా వారి పిల్లలకు బలం కావాలన్నా యాదవుల సోదరులు పంచిన పాలే. పశుసంపదన పండగ పూట పూజించి పశుసంపదన కూడా దేవుళ్లతో సమానంగా పూజిస్తున్న యాదవులు సంస్కృతి దేశానికి ఆదర్శం. మూసీ అభివృద్ధికి సైతం యాదవులు అండగా నిలవాలి'-రేవంత్​రెడ్డి, ముఖ్యమంత్రి

సీఎం రేవంత్​రెడ్డి సదర్ స్టెప్పులు : సదర్ అంటే యాదవుల ఖదర్ అన్న ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి, యాదవులకు రానున్న రోజుల్లో పదవుల్లో మరిన్ని అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. శ్రీకృష్ణుడిని ఆదర్శంగా తీసుకునే యాదవులు ధర్మం వైపు నిలబడాలని కోరారు. ఇక నుంచి ఏటా ప్రభుత్వమే అధికారికంగా సదర్ ఉత్సవం నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. మూసీ ఆధ్వానంగా తయారైందని, అందుకే మూసీని ప్రక్షాళన చేసి పునరుద్ధరించి అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ నగరం అభివృద్ధి చేయడం యాదవుల బాధ్యత కూడా అని ఉద్ఘాటించారు.

యువకుడైన అనిల్ కుమార్​ను రాజ్యసభకు పంపడం యాదవులపై ముఖ్యమంత్రికి ఉన్న ప్రత్యేక దృష్టికి నిదర్శనమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాగా ఎన్టీఆర్ స్డేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి యాదవులు తరలివచ్చారు. అలాగే నగర నలుమూలల నుంచి యాదవులు సదర్ దున్నలను తీసుకువచ్చి ఆడించారు. ఈ సందర్భంగా ఎంపీ అనిల్​కుమార్​ యాదవ్​ కోరిక మేరకు సీఎం రేవంత్​రెడ్డి సదర్ స్టెప్పులు వేసి అందరిని అలరించారు.

'మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం - మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా!'

వైభవంగా మల్లారెడ్డి మనవరాలి వివాహ మహోత్సవం - వేడుకలో స్పెషల్ అట్రాక్షన్​గా సీఎం రేవంత్ ​రెడ్డి

Last Updated : 1 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.