CM Revanth Reddy Raebareli Tour Today : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. ఇందులో భాగంగా వారు హైదరాబాద్‌లోని బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో రాయ్‌బరేలీ బయల్దేరారు.
మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి ఈరోజు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారానికి హాజరు కావాల్సి ఉంది. ఇంకోవైపు ఉదయం 11:00 గంటలకు హైదరాబాద్‌లో తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టో కాంగ్రెస్ విడుదల చేయనుంది. అదేవిధంగా ధర్మపురి, సిరిసిల్లలో ఏర్పాటు చేసిన జనజాతర సభలతో పాటు ఉప్పల్ రోడ్ షోలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఇప్పుడు రేవంత్ అకస్మాత్తుగా రాయబరేలీకి వెళ్లడంతో ఆయన ఎన్నికల ప్రచారం షెడ్యూల్ రద్దయనట్లు సమాచారం. అయితే మేనిఫెస్టో విడుదల మాత్రం మంత్రులెవరైనా చేస్తారా లేక మరో రోజు విడుదల చేస్తారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.