ETV Bharat / state

"బీఆర్‌ఎస్‌కు 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు - పేద విద్యార్థులు చదివే స్కూళ్లకు మాత్రం తిలోదకాలు" - CM REVANTH SLAMS ON KCR

సమీకృత గురుకుల పాఠశాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన - విద్య, ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడేందుకు సర్కార్‌ కృషి - కుల, మతాలకు అతీతంగా ముందుకెళ్తున్నామన్న సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth On Integrated Residential Schools
Integrated Residential Schools Foundation In Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 11, 2024, 5:37 PM IST

Updated : Oct 11, 2024, 7:32 PM IST

CM Revanth On Integrated Residential Schools : విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించటం తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ దిశలో తాము గద్దెనెక్కగానే చర్యలు చేపట్టినట్టు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గులో యంగ్‌ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం భూమిపూజ చేశారు. కులాలకు అతీతంగా అందరూ ఒకే చోటా చదువుకోవాలనే మహోన్నత ఆశయంతో ప్రభుత్వం సమీకృత గురుకులాలకు శ్రీకారం చుట్టినట్టు ముఖ్యమంత్రి వివరించారు. 28చోట్ల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ భవనాలకు శంకుస్థాపనలు చేసినట్టు వివరించారు.

ఇదే సమయంలో గత ప్రభుత్వంపై విమర్శలు సంధించిన సీఎం బీఆర్ఎస్​ సర్కార్ 5 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసిందన్నారు. ఈ కారణంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని చెప్పారు. కేసీఆర్‌ గురుకుల పాఠశాలలకు ఎక్కడా సరైన భవనాలు నిర్మించలేదని అన్నారు. పేద విద్యార్థులు చదువుకునే బడులు, హాస్టళ్లు, గురుకుల పాఠశాలలను పట్టించుకోలేదని, బీఆర్‌ఎస్‌కు మాత్రం 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించుకున్నారని ధ్వజమెత్తారు. బడుగు,బలహీన వర్గాలు ప్రశ్నిస్తారనే విద్యావ్యవస్థను నాటి సర్కార్‌ నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.

ఒక్కో పాఠశాలను 25 ఎకరాల్లో రూ.150 కోట్ల వ్యయం : వందల కోట్లు ఖర్చు చేసి ప్రగతిభవన్‌, ఫామ్‌హౌజ్‌లు కట్టుకున్నారన్న ఆయన, పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ స్కూళ్లను మాత్రం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. రెసిడెన్సియల్‌ పాఠశాలల ఏర్పాటు ఆలోచన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుదన్న రేవంత్‌, గురుకులాల్లో చదివిన చాలామంది ఐఏఎస్‌లు, ఏపీఎస్‌లు అయినట్టు గుర్తుచేశారు. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నామని సీఎం తెలిపారు. అందుకే గురుకులాలకు సరైన భవనాలు, మౌలిక వసతులు కల్పించే ఉద్దేశంతో ఒక్కో పాఠశాలను 25 ఎకరాల్లో రూ.150 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి వివరించారు.

"పేదలకు విద్యను దూరం చేయాలనే కుట్రతో దాదాపు ఐదు వేల పాఠశాలలను నాటి సర్కార్​ మూతవేసింది. కొన్నేళ్లుగా బదిలీలు, పదోన్నతులు లేకపోవటంతో టీచర్లలో అపనమ్మకం ఏర్పడింది. ఈ ప్రభుత్వం 21 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి ఒక నమ్మకం కలిగించింది. గత ప్రభుత్వం గురుకుల పాఠశాలలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఏ గురుకుల పాఠశాలలకు సరైన భవనాలు, మౌలిక వసతులు లేవు. విద్యావ్యవస్థలోని లోటుపాట్లను సరిచేస్తూ అందులో భాగంగానే ఇవాళ ఈ ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ స్కూళ్లకు నాంది పలికాం."-రేవంత్​రెడ్డి, ముఖ్యమంత్రి

'ప్రైవేట్ స్కూళ్లలో మీకంటే అనుభవజ్ఞులు ఉన్నారా ?' - డీఎస్సీ విజేతలతో సీఎం రేవంత్

ఏక సభ్య కమిషన్ నివేదిక సమర్పించాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు : సీఎం రేవంత్

Last Updated : Oct 11, 2024, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.