ETV Bharat / state

ఏఐ సిటీగా అమరావతిని రూపొందించండి - అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు - Chandrababu Review On Amaravati

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2024, 8:15 PM IST

AP CM Chandrababu Review On Capital : ఏపీలో సీఆర్డీఏ కార్యాలయ నిర్మాణం 90 రోజుల్లో పూర్తి కావాలని అధికారులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో త్వరితగతిన జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు పూర్తి చేయాలని సూచించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సిటీగా అమరావతిని తీర్చిదిద్దాలని ఆదేశించారు. కార్మికుల క్షేమం, సంక్షేమం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ విధానమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. త్వరలో చంద్రన్న బీమాకు శ్రీకారం చుడతామని అన్నారు.

CM Chandrababu Review On Capital Amaravat
AP CM Chandrababu Review On Capital (ETV Bharat)

AP CM Chandrababu Review On Capital Amaravati : ఏపీ రాజ‌ధానిలో త్వరిత‌గ‌తిన జంగిల్ క్లియ‌రెన్స్ ప‌నులు చేప‌ట్టాల‌ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. 90 రోజుల్లో సీఆర్డీఏ కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని అధికారుల‌కు స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) సిటీగా అమరావతి రాజధానిని రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్, అమరావతిని కలిపి ఆంగ్లంలో లోగోను రూపొందించాలని సూచించారు. అత్యాధునిక టెక్నాల‌జీల‌ను ఉప‌యోగించి, నాణ్యతలో ఎక్కడా కూడా రాజీ ప‌డ‌కూడ‌ద‌ని తెలిపారు.

మెట్రో రైలు ప్రాజెక్టు ప‌నుల‌ను త్వరిత‌గ‌తిన చేప‌ట్టాలి : హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుపైనా చంద్రబాబు స‌మీక్షించారు. హ్యాపీనెస్ట్ ప్లాట్లన్నీ అప్పట్లో ఒక్క గంట‌లో అమ్ముడు పోయాయ‌ని గుర్తు చేశారు. హ్యాపీనెస్ట్​లో గ‌త ప్రభుత్వం చ‌ర్యల‌ కారణంగా వచ్చిన న‌ష్టాన్ని పూడ్చేలా విధానాలు రూపొందించాల‌ని అధికారులకు సూచించారు. రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులపై సీఎం సమీక్ష చేశారు. జంగిల్ క్లియరెన్స్ కోసం 190 ప్రొక్లెయినర్లు ముళ్ల చెట్లను తొలగిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటికీ దాదాపు 60 శాతం జంగిల్ క్లియరెన్స్ ప‌నులు పూర్తయ్యాయ‌ని వెల్లడించారు. మెట్రో రైలు ప్రాజెక్టు ప‌నులు వేగ‌వంతం చేయాలని సీఎం స్పష్టం చేశారు. విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌లో చేప‌ట్టబోయే మెట్రో రైలు ప్రాజెక్టు ప‌నుల‌ను త్వరిత‌గ‌తిన చేప‌ట్టాల‌ని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Narayana on Happy Next Project : సీఆర్డీఏ కార్యాలయాన్ని త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని మంత్రి నారాయణ తెలపారు. గత ప్రభుత్వం హ్యాపీనెస్ట్‌ను పూర్తిగా వదిలేసిందని ఆరోపించారు. రూ.700 కోట్లతో గతంలో హ్యాపీనెస్ట్‌ను ప్రతిపాదించామని, ప్రస్తుతం హ్యాపీనెస్ట్‌ పూర్తి కావాలంటే రూ.930 కోట్లు కావాలని అన్నారు. గంటలోనే హ్యాపీనెస్ట్‌లోని ప్లాట్లు అన్నీ బుక్‌ అయ్యాయని, ప్రాజెక్టుకు సీఎం క్లియరెన్స్‌ ఇచ్చారని తెలిపారు.

కార్మిక శాఖపై సీఎం సమీక్ష : కార్మికుల క్షేమం, సంక్షేమం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ విధానమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కార్మికుల హక్కులు పరిరక్షించాలని అన్నారు. అర్థంలేని నిబంధనలతో పరిశ్రమలపై వేధింపులు ఉండకూడదని తెలిపారు.సేఫ్టీ విషయంలో రాజీ పడొద్దని ఆదేశించారు. ఫ్యాక్టరీస్ భద్రతా ప్రమాణాలపై థర్డ్ పార్టీతో ఆడిట్ నిర్వహించాలని అన్నారు. ఈఎస్ఐ ఆసుపత్రులను బలోపేతం చేస్తామని వెల్లడించారు. కార్మిక శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు.

చంద్రన్న బీమా త్వరలో శ్రీకారం : రాష్ట్ర వాటా నిధుల విడుదల చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. 2019కి ముందు ఇచ్చిన చంద్రన్న బీమాను వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారాన్ని కుదించి ఆంక్షలతో లబ్ధిదారులను తగ్గించిందని నిప్పులు చెరిగారు. 10 లక్షల బీమాకు త్వరలో శ్రీకారం చుడతామని తెలిపారు.

అచ్యుతాపురం ఘటనపై కమిటీ - ఎవరు తప్పు చేసినా వదిలేది లేదు : చంద్రబాబు - COMMITTEE ON ATCHUTAPURAM BLAST

త్వరలోనే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని నియమిస్తా : ఏపీ సీఎం చంద్రబాబు - AP CM Chandrababu On Party Workers

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.