CM Chandrababu Helps a Child Suffering from Typhoid in AP : ఓ చిన్నారి కోసం ఏపీ సీఎం చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. టైఫాయిడ్‌తో బాధపడుతున్న బాధిత బాలుడి కోసం వైద్యబృందాన్ని ఇంటికే పంపారు. అనంతరం కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్సకు వెంటనే ఎల్ఓసీ ఇప్పించారు. మూడేళ్ల బాలుడి ప్రాణాలను కాపాడేందుకు తన పేషీ అధికారుల్ని క్షేత్రస్థాయిలోనే నిమగ్నమయ్యేలా సీఎం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆసుపత్రి యాజమాన్యంతో వాకబు చేసిన సీఎంఆర్‌ఎఫ్ బృందం ముఖ్యమంత్రికి నివేదిస్తూ వచ్చింది.
విజయవాడలోని పాతరాజేశ్వరిపేటలో 3 ఏళ్ల బాలుడు దేవాన్ష్ అనారోగ్యానికి గురయ్యాడు. టైఫాయిడ్‌కు పలు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నా నయం కాలేదు. జ్వరం తీవ్రతతో 14 శాతం ఉండాల్సిన హిమోగ్లోబిన్ పర్సంటేజ్ 4 శాతానికి పడిపోవటంతో దేవాన్ష్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. విషయం సీఎం దృష్టికి రావటంతో వెంటనే తన పేషీ అధికారుల్ని అప్రమత్తం చేశారు. ఎలాగైనా దేవాన్ష్ ప్రాణాలను కాపాడాలని సీఎంఆర్‌ఎఫ్ విభాగాన్ని ఆదేశించారు. వైద్య బృందాన్ని నేరుగా బాధితుడి ఇంటికి పంపి పరీక్షలు చేయించిన సీఎం పేషీ మెరుగైన చికిత్సకు యుద్ధప్రాతిపదికన ఎల్ఓసి ఇచ్చి నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించింది.
11 రోజులపాటు చికిత్స అనంతరం దేవాన్ష్ కోలుకున్నాడు. చికిత్స అందుతున్న 11 రోజులూ సీఎంకు దేవాన్ష్ ఆరోగ్య పరిస్థితిని సీఎంవో నివేదించింది. పూర్తి ఆరోగ్యవంతుడై దేవాన్ష్ తల్లిదండ్రులతో ఇంటికి చేరుకున్నాడు. తమ బిడ్డకు పునర్జన్మ నిచ్చిన సీఎం చంద్రబాబుకు, చొరవ తీసుకుని ఫాలో అప్ చేసిన సీఎం పేషీ అధికారులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
మానవత్వాన్ని చాటుకున్న లోకేశ్: మంత్రి నారా లోకేశ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువుకు చెందిన వేముల నాగరాజు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో కోమాలోకి వెళ్లాడు. ప్రస్తుతం నాగరాజు ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని, ఏం చేయాలో పాలుపోని కుటుంబ సభ్యులు వైద్యానికి సాయం అందించి తమ కుమారుడుకి ప్రాణాపాయం నుంచి తప్పించాలని ఎక్స్ వేదిక ద్వారా మంత్రి నారా లోకేశ్‌కు విన్నవించారు. వెంటనే స్పందించిన లోకేశ్ సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.7 లక్షల సాయం అందించి ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచారు. ఉదయం నిర్వహించిన ప్రజాదర్బార్ లో తమ కుటుంబానికి అండగా నిలిచిన లోకేశ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ధైర్యంగా ఉండాలని మంత్రి భరోసా ఇచ్చారు.
చిట్టిచేతులు పెద్ద సాయం చేశాయి - వీడియోను పంచుకున్న ఏపీ సీఎం చంద్రబాబు - AP CM On Students Donation