ETV Bharat / state

తల్లి కాంగ్రెస్‌, పిల్ల కాంగ్రెస్‌ కలిసి కొత్త నాటకం ఆడుతున్నాయి: చంద్రబాబు - CHANDRABABU PRAJA GALAM MEETING - CHANDRABABU PRAJA GALAM MEETING

Chandrababu Prajagalam Public Meeting: ఆంధ్రప్రదేశ్​లో రావణాసురుడిని అంతం చేసేందుకే కూటమి కట్టామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలని తల్లి, పిల్ల కాంగ్రెస్‌ కొత్త కుట్రకు తెరలేపాయని ఆయన ఆరోపించారు. ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఇంట్లో తేల్చుకోవాలి, ప్రజల నెత్తిన ఎందుకు రుద్దుతున్నారని ప్రశ్నించారు.

AP Politics 2024
Chandrababu Fires on CM Jagan
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 6, 2024, 10:12 PM IST

తల్లి కాంగ్రెస్‌, పిల్ల కాంగ్రెస్‌ కలిసి కొత్త నాటకం ఆడుతున్నాయి: చంద్రబాబు

Chandrababu Prajagalam Public Meeting: కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే అని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తంచేశారు. అందుకే ఆ పార్టీతో కలిశామని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసింది తమ కోసం కాదని రాష్ట్రం కోసం అని స్పష్టం చేశారు. ఎన్డీఏకు పడే ఓట్లు చీల్చాలని తల్లి కాంగ్రెస్‌, పిల్ల కాంగ్రెస్‌ కలిసి కొత్త నాటకం ఆడుతున్నాయని మండిపడ్డారు. పల్నాడు జిల్లా క్రోసూరులో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు.

రావణాసురుడిని అంతం చేసేందుకే : రాముడు దేవుడు అయినప్పటికి వానరులతో కలిసి పోరాడారన్న చంద్రబాబు, రాష్ట్రంలో రావణాసురుడిని అంతం చేసేందుకే బీజేపీతో(BJP Govt) కలిశామని తెలిపారు. రావణాసురుడిని చంపేందుకు వానరసైన్యమంతా కలిసిందని అన్నారు. ఈ దోపిడీ దొంగలు కృష్ణా నదిలోనే రోడ్డు వేశారని ధ్వజమెత్తారు.

ఇసుకాసురుడిని అంతం చేసి పేదలకు ఉచితంగా ఇసుక ఇస్తామని పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో అనేక అరాచకాలు జరిగాయన్న చంద్రబాబు, గత ఐదేళ్లలో ముస్లింలపై అనేక దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం మహిళలు, బాలికలను వైసీపీ నేతలు వేధించారని దుయ్యబట్టారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు అలాగే ఉంటాయని తాను హామీ ఇస్తున్నానన్నారు.

అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే - నిరుద్యోగ భృతి ఇస్తాం : చంద్రబాబు - Chandrababu Kuppam Tour

గంజాయి కావాలంటే జగన్‌ ఉండాలి: 2014 నుంచి 2019 వరకు బీజేపీతో టీడీపీ కలిసే ఉందని తెలిపారు. 2014- 2019 మధ్య ముస్లింలకు ఏమైనా అన్యాయం జరిగిందా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో ముస్లింల రక్షణకు తాను హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు. జాబు కావాలంటే చంద్రబాబు మళ్లీ రావాలని తెలిపారు. గంజాయి కావాలంటే జగన్‌(AP CM Jagan) ఉండాలని అన్నారు. ఏపీ నుంచి ఎంతోమంది అమెరికాకు వెళ్లారని, తెలుగు వాళ్లు అమెరికాకు వెళ్లేలా ఫౌండేషన్‌ వేసింది ఎవరు అని ప్రశ్నించారు.

పోలవరం ప్రాజెక్టును తానే 72 శాతం పూర్తి చేశానని తెలిపారు. ఈ ఐదేళ్లలో పోలవరం మిగతా పనులు ఏమాత్రం చేయలేదన్న చంద్రబాబు, యువత కంటే తన ఆలోచనలు 20 ఏళ్లు ముందుంటాయని అన్నారు. ఆనాడు నేను చేసిన కృషితో ఇవాళ హైదరాబాద్‌ నంబర్ వన్‌గా ఉందన్న పార్టీ అధినేత, టీడీపీ అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ గెలిస్తే పెదకూరపాడులో కూడా ఐటీ పార్కు వస్తుందని తెలిపారు.

పింఛన్ల పంపిణీ అంశంపై రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు లేఖ - Chandrababu Fight On Pensions

మీ జీవితాలు మారతాయి : ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేసిన పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. ముస్లింలకు న్యాయం చేసేందుకు రంజాన్ తోఫా తీసుకువచ్చానని, ఇమామ్‌లు, మౌజమ్‌లకు గౌరవ వేతనం ఇచ్చానని అన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే ఎన్డీఏను గెలిపించాలని కోరారు. టీడీపీ అమలు చేసే సూపర్‌ సిక్స్‌తో మీ జీవితాలు మారతాయని, సంపద సృష్టించి అందరికీ పంచే పార్టీ టీడీపీ అని తెలిపారు. కొరియా నుంచి ఏపీకి కియా సంస్థను తీసుకువచ్చానని, అమరరాజా కంపెనీని(Amararaja Company) వైసీపీ వేధిస్తే వాళ్లు తెలంగాణకు వెళ్లిపోయారని గుర్తు చేశారు.

తల్లికి వందనం పథకం కింద మహిళలకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని వివరించారు. అంతేకాకుండా కుటుంబంలో ఎంతమంది ఉన్నా అంతమందికి తల్లికి వందనం ఇస్తామని హామీ ఇచ్చారు. పేదలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీరు సరఫరా(Fresh Water Supply) చేస్తామని అన్నారు. జగన్‌ రూ.10 ఇచ్చి వంద రూపాయలు తీసుకుంటున్నారన్న చంద్రబాబు, పింఛన్ల పంపిణీలో శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంతమంది సచివాలయ ఉద్యోగులు పింఛన్లు ఇవ్వలేరా అని ప్రశ్నించిన చంద్రబాబు, ఎన్డీఏ గెలిస్తే నెలకు రూ.4 వేల పింఛన్ ఇస్తామని తెలిపారు.

తల్లి కాంగ్రెస్‌, పిల్ల కాంగ్రెస్‌ కలిసి కొత్త నాటకం : తల్లి కాంగ్రెస్‌, పిల్ల కాంగ్రెస్‌ కలిసి కొత్త నాటకం ఆడుతున్నాయన్న చంద్రబాబు, కుమారుడికి ఏపీ, కుమార్తెకు తెలంగాణ రాసిచ్చానని ఒక తల్లి చెప్పిందని తెలిపారు. ఆ తల్లి తన ఇద్దరు పిల్లలకే న్యాయం చేయలేదు, రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. పిల్ల కాంగ్రెస్‌ వ్యతిరేక ఓటు చీల్చాలని తల్లి కాంగ్రెస్‌ నాటకం ఆడుతోందని చంద్రబాబు విమర్శించారు. ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఇంట్లో తేల్చుకోవాలని, ఎన్డీఏకు పడే ఓట్లు చీల్చాలని నాటకం ఆడుతున్నారని దుయ్యబట్టారు.

ఎలా మాట్లాడాలో ముందే శిక్షణ - భజనలా ప్రజలతో సీఎం జగన్​ ముఖాముఖి - CM JAGAN INTERACT WITH PUBLIC

కేసీఆర్, జగన్ కలిసి తెలంగాణకు తీరని అన్యాయం చేశారు: మంత్రి ఉత్తమ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.