ETV Bharat / state

ఈ 2 రోజులు మరింత అప్రమత్తంగా ఉండండి - అధికారులకు సీఈవో వికాస్​రాజ్​ ఆదేశాలు - CEO Vikas Raj Video conference - CEO VIKAS RAJ VIDEO CONFERENCE

CEO Vikas Raj Video Conference : ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలైన్స్ టీమ్స్ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, క్లిష్టమైన ప్రాంతాల్లో వెబ్ ​కాస్టింగ్ కోసం ఏర్పాట్లు చేయాలని వికాస్ ​రాజ్ స్పష్టం చేశారు.

CEO Vikas Raj Video Conference
CEO Vikas Raj Video Conference (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 10, 2024, 9:21 PM IST

TS CEO Vikas Raj Video Conference : పోలింగ్​కు సమయం దగ్గర పడుతున్న వేళ మరింత అప్రమత్తంగా ఉండాలని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా తగిన పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్​రాజ్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎన్నికల అధికారులు, ఆర్వోలతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 17 లోక్​సభ నియోజకవర్గాల్లో, కంటోన్మెంట్ ఉపఎన్నిక పోలింగ్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.

జిల్లా కలెక్టర్లకు కీలక సూచనలు : 106 శాసనసభ నియోజకవర్గాల్లో రేపు సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగియనుంది. మిగిలిన 13 అసెంబ్లీ నియోజకవర్గాలైన సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేటలో రేపు సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగియనుంది. చివరి దశలో తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులు, పరిశీలకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను వికాస్​రాజ్ ఆదేశించారు.

ప్రలోభాలకు తావు లేకుండా : ప్రలోభాలకు ఆస్కారం ఉండే బస్తీలు, తదితర ప్రాంతాల్లో రాత్రి పూట ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, కమ్యూనిటీ హాళ్లు, మ్యారేజీ హాళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలైన్స్ టీమ్స్, పూర్తి అప్రమత్తంగా ఉండాలని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, క్లిష్టమైన ప్రాంతాల్లో వెబ్​కాస్టింగ్ కోసం ఏర్పాట్లు చేయాలని వికాస్​రాజ్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలను పక్కాగా పర్యవేక్షించాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.

Measures To prevent The Spread Of Misinformation : తప్పుడు సమాచారం వెళ్లకుండా సందేహాలు నివృత్తి చేయాలని చెప్పారు. మద్యం, లైసైన్స్​లు లేని ఆయుధాలు, నగదు, డ్రగ్స్ తదితరాల అక్రమ రవాణాకు ఆస్కారం లేకుండా చెక్ పోస్టుల వద్ద పటిష్ట తనిఖీలు చేపట్టాలని వికాస్​రాజ్ తెలిపారు. డబ్బు, మద్యం, కానుకల పంపిణీ విషయమై నిఘా మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు. పోలింగ్ రోజు ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే స్పందించేలా ఈసీఐఎల్ ఇంజినీర్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.

ఈ ఎన్నికల్లోనూ 'హోమ్​ ఓటింగ్'కు అవకాశం - రోడ్ షోలకు ముందస్తు అనుమతి తప్పనిసరి : వికాస్​రాజ్

GPS Facility To EVM Vehicles : పోలింగ్ అధికారులు, ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను తీసుకెళ్లే వాహనాలు అన్నింటికీ జీపీఎస్ సౌకర్యం, కేంద్ర బలగాలతో భద్రత ఉంటుందని వికాస్​రాజ్ పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూమ్​ల నుంచి తీసుకెళ్లినపుడు, తిరిగి తీసుకొచ్చినపుడు వీడియోగ్రఫీ, సీసీటీవీ నిఘాలో ఉంటాయని రెండు సందర్భాల్లోనూ అభ్యర్థులు పార్టీల ప్రతినిధులు ఉండాలని చెప్పారు. స్ట్రాంగ్ రూమ్​ల వద్ద నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు అగ్నిమాపక ఉపకరణాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్న వికాస్​రాజ్, 13వ తేదీన ఓటర్లు అందరూ ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్య ప్రక్రియను బలోపేతం చేయాలని కోరారు.

తెలంగాణ లోక్​సభ బరిలో 525 మంది - ఈనెల 5 నుంచి హోమ్ ఓటింగ్ : వికాస్ రాజ్ - Vikas Raj on Election Arrangements

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లోనే మీ ఓట్లు - లోక్​సభ ఎన్నికల ఏర్పాట్లపై వికాస్ రాజ్ - LOK SABHA POLLING IN TELANGANA

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.