CBI Seizes Huge Consignment of Drugs in Visakahaptanm Port: విశాఖ తీరంలో డ్రగ్స్ కలకలం సృష్టించింది. బ్రెజిల్ నుంచి విశాఖలోని ఓ ప్రైవేటు ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌కు వచ్చిన కంటైనర్‌లో సుమారు 25 వేల కిలోల డ్రగ్స్ ఉన్నట్లు సీబీఐ, నార్కోటిక్స్ అధికారులు గుర్తించారు. ఇంటర్‌పోల్ అధికారులు ఇచ్చిన సమాచారంతో దిల్లీ సీబీఐ, విశాఖలోని సీబీఐ, కస్టమ్స్ అధికారులను అప్రమత్తం చేసింది. దీంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
ఈనెల 19న నార్కోటిక్స్ సామగ్రి, నిపుణులతో వచ్చిన సీబీఐ అధికారులు ఆ కంటైనర్‌లో భారీ మెత్తంలో డ్రగ్స్ ఉన్నట్టు నిర్ధరించుకున్నారు. ఆపరేషన్ గరుడలో భాగంగా అధికారులు వాటిని సీజ్ చేశారు. జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా ఈ నెల 16న కంటైనర్ విశాఖకు వచ్చినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఓ ప్రైవేటు కంపెనీ ఈ డ్రగ్స్ బ్యాగులను 25 కిలోల చొప్పున 1000 బ్యాగుల డ్రగ్స్ నింపి సరఫరా చేసినట్లు తెలుస్తోంది.