Cattle Feed Shortage In Nalgonda District : వేసవిలో పశుగ్రాసం కొరత వల్ల మూగ జీవాలు అలమటిస్తున్నాయి. ఈ ప్రభావం పాడిరైతులపై పడుతోంది. నల్గొండ జిల్లా, మిర్యాలగూడ సాగర్ ఆయకట్టు పరిధిలోని పాడి రైతులకు గడ్డు రోజులు ఎదురవుతున్నాయి. ఆయకట్టు పరిధిలో ఎండు గడ్డి కొరత తీవ్రంగా ఉండడంతో పాడి రైతులకు పశు పోషణ రోజురోజుకు భారంగా మారుతోంది. సాగర్ ఆయకట్టు పరిధిలో గత ఏడాది నీరు సమృద్ధిగా ఉండడంతో రైతులు(Farmers) వరి సాగును అధికంగా చేపట్టారు. ఈ ఏడాది ఎడమ కాలువ నీటి విడుదల లేని కారణంగా ఆయకట్టులో పరిధిలో బోర్లు, బావుల కింద మాత్రమే రైతులు యాసంగిలో(Yasangi Season నీటి వనరులను ఆధారంగా వరి సాగు చేశారు.
Grass Shortage In Nalgonda District : అంతే కాకుండా రైతులు వరికోత యంత్రం సహాయంతో వరిని కోస్తుండటం వల్ల ఎండు గడ్డి ఆశించిన స్థాయిలో రావడం లేదు. ప్రస్తుతం వరి సాగు తగ్గడంతో పశుగ్రాసానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. నియోజకవర్గంలోని పాడి రైతులు వరిగడ్డి కోసం ఇతర జిల్లాలకు వెళ్లి లారీలు, ట్రాక్టర్లలో తెచ్చుకుంటున్నారు. గడ్డి(Grass) కొరత ఎక్కువగా ఉండటంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. పాడి రైతులు వరిగడ్డిని కొనలేక ఎక్కువ శాతం పచ్చిమేత, దాణా మీద ఆధారపడుతున్నారు. వరిగడ్డి ధరలు ఈ సీజన్లో రెట్టింపు అయ్యాయి. గతంలో ఒక ట్రాక్టర్ వరిగడ్డి రూ.6000ల నుంచి రూ.7000ల వరకు ఉండేది కాగా ఈ సీజన్లో రూ.9వేల నుంచి రూ.12వేల వరకు పలుకుతుంది. లారీ వరిగడ్డి సుమారు రూ.20వేల నుంచి రూ.30 వేల వరకు పెరిగింది. దీంతో రైతులకు వరిగడ్డి లభించక పశుపోషణ భారంగా మారింది.
గోవుతల్లి గోసపడుతోంది.. దాతల కోసం ఎదురుచూపులు..
"గత 14 ఏళ్లుగా డెయిరీ నిర్వహిస్తున్నాను. తగినంతగా వర్షాలు లేకపోవడంతో పొలాలు ఎండిపోయి పశుగ్రాసానికి కొరత ఏర్పడుతోంది. ఇంతకు ముందు ట్రాక్టర్ గడ్డికి రూ.6 వేలకు లభించేది ప్రస్తుతం రూ.12వేలు ఇచ్చి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇలాగే పరిస్థితి కొనసాగితే పశువులను పోషించడం చాలా ఇబ్బందిగా మారుతుంది. ప్రభుత్వం చొరవ చూపించి పశుగ్రాసాన్ని సబ్సిడీ ధరకు అందజేయాలని కోరుతున్నాం" - వెంకటేశ్వర్లు,పాడిరైతు
పశుగ్రాసాన్ని సబ్సిడీపై అందించాలని కోరుతున్న రైతులు
కొంతమంది పాడి రైతులు పాల నుంచి లాభాలు రాకున్నా అప్పులు చేసి పశువులకు పశుగ్రాసం, దాణాలు పెడుతున్నారు. గతంలో పశుసంవర్ధక శాఖ ద్వారా పాడి రైతులకు గడ్డి విత్తనాలు సబ్సిడీపై అందజేసేవారు, ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకుండా పోయింది.
దేవరకొండ, నల్లమల్ల అటవీ ప్రాంతాల్లో వేలాది ఆవులు, ఎద్దులు (మూగజీవాలు) పశుగ్రాసం కోసం ఇతర ప్రాంతాలకు వలస బాటపట్టాయి. గ్రామ గ్రామాలు తిరుగుతూ మేత, నీరు లేక అలమటిస్తున్నాయి. రాబోయే కాలంలో నీటి ఎద్దడి అధికంగా ఉండే దృష్ట్యా ప్రభుత్వం గ్రామాల్లో నీటి తొట్లను చేయాలని ఇతర రాష్ట్రాల నుండి పశుగ్రాసాన్ని తెప్పించి పాడి రైతులకు సబ్సిడీపై అందించాలని పలువురు కోరుతున్నారు.
అడవులకు పశు తాకిడి- హరించుకుపోతున్న పచ్చదనం
కరెంటు వైర్లు తగిలి.. పశుగ్రాసం, ట్రాక్టర్ దగ్ధం
గోశాలలకు రూ.12 లక్షల విలువైన పశుగ్రాసం