ETV Bharat / state

రాష్ట్రానికి పెనుభారంగా మారనున్న కాళేశ్వం ప్రాజెక్ట్ - కాగ్​ రిపోర్ట్​లో​ సంచలన విషయాలు

CAG Report on Kaleshwaram Project : రాష్ట్ర ఖజానాకు కాళేశ్వరం ప్రాజెక్ట్​ పెనుభారంగా మారబోతుందని కాగ్​ రిపోర్ట్​లో తెలిపింది. 2035-36 నాటికి రూ.1,41,544.59 కోట్లు తిరిగి చెల్లించాలని స్పష్టం చేసింది. 12 ఏళ్లలో మొత్తం రూ.2.66 లక్షల కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వస్తుందని తెలిపింది.

Kaleshwaram project loan Details
CAG Report on Kaleshwaram Project
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 16, 2024, 10:18 AM IST

CAG Report on Kaleshwaram Project : రాష్ట్ర ఆర్థిక రంగానికి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పెనుభారంగా మారనుందని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) నివేదిక స్పష్టం చేసింది. 2022 మార్చికి కాళేశ్వరం ప్రాజెక్టు సంస్థకు మొత్తం రూ.96,064 కోట్ల రుణం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిందని తెలిపింది. ఇందులో 2022 మార్చి నాటికి రూ.87,449.15 కోట్లు తీసుకుందని పేర్కొంది. 2035-36 నాటికి వడ్డీ సహా అక్షరాలా రూ.1,41,544.59 కోట్లు తిరిగి చెల్లించాలని వివరించింది. రుణ ఒప్పందాల ప్రకారం తొలుత పేర్కొన్న వడ్డీ రేట్లను పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తేనే తిరిగి చెల్లించాల్సిన సొమ్ము ఇంత ఉంటుందని, వడ్డీ రేట్లు మారుతుంటాయని స్పష్టం చేసింది. ఇవి పెరిగితే చెల్లించాల్సిన నగదు కూడా పెరుగుతుందని వెల్లడించింది.

కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో మూడో రోజు తనిఖీలు - మినీ ట్రక్​ సరిపడా దస్త్రాలు స్వాధీనం

Kaleshwaram Project Debts According to CAG : 2024-25 నుంచి కాళేశ్వరం పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభమై అనుకున్న ప్రకారం నీటిని ఎత్తిపోస్తే కరెంటు ఛార్జీల కింద ప్రభుత్వం ఏటా రూ.10,374.56 కోట్ల చొప్పున రాబోయే 12 ఏళ్లలో సుమారు రూ.1,24,495 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని కాగ్​ తెలిపింది. దీనికి అదనంగా ప్రాజెక్టు వార్షిక నిర్వహణ కోసం రూ.272.70 కోట్లు, తరుగుదల ఖర్చుల కింద రూ.2,761 కోట్లు అవసరమని తెలియజేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project) నివేదిక ప్రకారం పథకం పూర్తయినా పెద్దగా ఆదాయమేమీ రాదని తేల్చి చెప్పింది.

రాష్ట్రంలో ప్రజలకు సాగు, తాగునీరు సరఫరా చేసినందుకు రాబడిని పొందే నిబంధనలేమీ ఇప్పటివరకు లేవని పేర్కొంది. అందువల్ల రుణాన్ని వడ్డీ సహా తిరిగి చెల్లించడానికి, నిర్వహణ వ్యయం కలిపి మొత్తం రూ.2.66 లక్షల కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వమే రాబోయే 12 ఏళ్లలో భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

కాళేశ్వరం, మేడిగడ్డపై రెండో రోజు కొనసాగుతున్న విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ సోదాలు

Kaleshwaram project loan Details : సాధారణ బడ్జెట్‌కు వెలుపల ప్రభుత్వరంగ సంస్థలు రుణాలు తీసుకుంటే 14 ఏళ్లలో తిరిగి చెల్లించాలనే నిబంధనలున్నాయని కాగ్​ తెలిపింది. దీని ప్రకారం 2022 నుంచి 2036 మధ్య ఏటా కాళేశ్వరం కార్పొరేషన్‌ తీసుకున్న అసలు రుణం రూ.87,369.89 కోట్లతో పాటు దానిపై 14 ఏళ్లకు వడ్డీ మరో రూ.54,174.70 కోట్లు కలిపి మొత్తం రూ.1,41,544.59 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని కాగ్‌(CAG Report) వివరించింది.

2023- 36 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సిన నగదు వివరాలు :

క్రమ సంఖ్య సంవత్సరం చెల్లించాల్సిన నగదు(రూ.కోట్లలో)
1 2022-23 6,910.73
2 2023-24 13,406.58
3 2024-25 14,462.52
4 2025-26 14,024.69
5 2026-27 13,302.50
6 2027-28 12,593.51
7 2028-29 11,859.19
8 2029-30 11,135.93
9 2030-31 10,817.86
10 2031-32 10,059.84
11 2032-33 9294.66
12 2033-34 8671.38
13 2034-35 4293.13
14 2035-36 712.44

కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల కార్యాలయాల్లో విజిలెన్స్​ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ బృందాల సోదాలు

కాళేశ్వరం​పై వారం రోజుల్లో జ్యుడీషియల్ విచారణ : మంత్రి ఉత్తమ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.