ETV Bharat / state

నా కుమార్తె జైళ్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా? : కేసీఆర్‌ - BRSLP Meeting Today 2024 - BRSLP MEETING TODAY 2024

BRSLP Meeting Today 2024 : రాజకీయ కక్షతోనే ఎమ్మెల్సీ కవితను జైల్లో పెట్టారని, కుమార్తె జైల్లో ఉంటే కన్నతండ్రిగా బాధ ఉండదా? అని బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్ఎస్​ఎల్పీ మీటింగ్ జరిగింది. బడ్జెట్​ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గులాబీ బాస్​ దిశానిర్దేశం చేశారు.

BRSLP Meeting Today 2024
BRSLP Meeting Today 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 23, 2024, 7:53 PM IST

BRS Legislative Party Conference Today : తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీ హామీల అమలు, ప్రజాసమస్యలను లేవనెత్తడం ద్వారా బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సిద్ధమైంది. ఆ దిశగానే ఇవాళ గులాబీ బాస్​ కేసీఆర్ అధ్యక్షత ఆ పార్టీ శాసనసభా పక్షం సమావేశమైంది. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్​లో జరిగిన ఈ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఉభయ సభల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, లేవనెత్తిన విషయాలపై మార్గనిర్దేశం చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరగడం ఇదే మొదటిసారి. గతంలో జరిగిన సమావేశానికి అనారోగ్యం కారణంగా కేసీఆర్ హాజరు కాలేదు.

నా కుమార్తె జైళ్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా? : బీఆర్​ఎస్​ఎల్పీ మీటింగ్ అనంతరం గులాబీ బాస్​ కేసీఆర్ పలు విషయాలపై​ మాట్లాడారు. అందులో భాగంగానే కవిత అరెస్ట్​పై స్పందించారు. రాజకీయ కక్షతోనే తన కుమార్తె కవితను జైల్లో పెట్టారని, సొంత కుమార్తె జైల్లో ఉంటే కన్నతండ్రిగా బాధ ఉండదా? అని కేసీఆర్‌ అన్నారు.

తాను అగ్నిపర్వతంలా ఉన్నట్లు పేర్కొన్నారు. పార్టీలో క్లిష్ట పరిస్థితులు ఏమీ లేవన్న ఆయన, ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితుల్లోనే తెలంగాణ సాధించామని తెలిపారు. నలుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ అధికారంలోకి రాలేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యే, బాగా ఎదుగుతారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ సర్కార్ పాలనపై పట్టు సాధించలేకపోయిందని, పాలనపై దృష్టి పెట్టకుండా బద్నాం చేసే పనిలో ఉన్నారని ధ్వజమెత్తారు.

BRS Legislative Council Leader Madhusudanachari : ఏడు నెలల రేవంత్​ పాలనలోనే శాంతి భద్రతలు ఎందుకు అదుపుతప్పుతున్నాయని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులపై స్పందించిన గులాబీ దళపతి, ఎక్కడో ఉన్న వారిని నేతలను చేస్తే, పదవులు వచ్చాక పార్టీని వీడుతున్నారని ఆక్షేపించారు. పార్టీ వదిలి వెళ్లే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్‌ అన్నట్టు సమాచారం. కాగా రేపటి సభలకు శాసనమండలిలో బీఆర్​ఎస్​ పక్ష నేతగా మధుసూదనాచారిని ప్రకటించారు.

టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - వైఎస్సార్సీపీ నేతల బెయిల్‌ పిటిషన్‌ వాయిదా

మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పోలీసుల పహారా - కొనసాగుతున్న విచారణ - Madanapalle Fire Accident Incident

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.