KTR Strongly Criticized The Prajavani Program : సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మేడ్చల్ జిల్లాకు చెందిన రేణుక అనే మహిళ జీతం సరిగా రావటం లేదని ప్రజావాణిలో ఫిర్యాదు చేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. అయితే ఫిర్యాదు చేయడంతో సంబంధిత ఏజెన్సీ ఆమెను ఉద్యోగంలోంచి తొలగించిందని వెల్లడించారు. ఈ ప్రభుత్వానికి ఆర్భాటం ఎక్కువ, పరిష్కారం తక్కువ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
జీతం రావటం లేదని అడిగితే ఉద్యోగం పీకేశారు. ప్రజావాణి లో ఫిర్యాదు చేసినందుకు ప్రభుత్వం నిర్ణయం !!
— KTR (@KTRBRS) August 28, 2024
ఆర్భాటం ఎక్కువ, పరిష్కారం తక్కువ
ప్రజాపాలన కాదు ఇది ప్రతీకార పాలన
రేణుక గారిని ఉద్యోగంలోంచి తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని @TelanganaCS గారిని డిమాండ్ చేస్తున్నా… pic.twitter.com/DF5HQe12Ac
ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్రతీకార పాలన అని కేటీఆర్ విమర్శించారు. ఇప్పటివరకు మీ ప్రభుత్వంలో ఎంతమంది పేదలకు ప్రజాదర్బార్ వల్ల సమస్యలు పరిష్కారం అయ్యాయో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేణుకను ఉద్యోగంలోంచి తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
Congress fellows who are making frivolous statements about BRS & BJP collusion
— KTR (@KTRBRS) August 28, 2024
Please Note 👇
✳️ Both Sonia Gandhi Ji & Rahul Gandhi have been granted bail in ED case in December, 2015
✳️ AAP that has been part of INDIA alliance in recent elections. It’s leader Manish Sisodia… pic.twitter.com/aL1CEp9oSO
ఓటుకు నోటు కేసులో నేటికీ సీఎం రేవంత్‌రెడ్డి బెయిల్‌పైనే : బీఆర్ఎస్, బీజేపీ పొత్తు గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు పనికిమాలిన ప్రకటనలు చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆక్షేపించారు. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ విమర్శలపై ఘాటుగా స్పందించారు. 2015 డిసెంబరులో ఈడీ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు బెయిల్ మంజూరైందని దయచేసి గమనించండంటూ పోస్టులో పేర్కొన్నారు.
ఇటీవల ఎన్నికల్లో భారత కూటమిలో భాగమైన ఆప్ నేత మనీశ్ సిసోడియాకు వారం రోజుల క్రితం బెయిల్ మంజూరైందని ప్రస్తావించారు. ఓటుకు నోటు కుంభకోణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2015 నుంచి బెయిల్‌పై ఉన్నారని గుర్తు చేశారు. ఇవన్నీ ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే జరిగాయని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌లు భాగస్వామ్య పక్షాలు అని, ఆపై ఉదాహరణలు బట్టి మనం ఊహించాలా? అని సూటిగా ప్రశ్నించారు.
ఏది నిజం? ఏది అబద్దం?
— KTR (@KTRBRS) August 28, 2024
రుణమాఫీ పూర్తి అని ఒకరు
ఆగస్టు 15 మాట నిలబెట్టుకున్నాం అని ఒకరు
7,500 కోట్లు మాత్రమే విడుదల అయింది అని ఆర్థిక మంత్రి
17 వేల కోట్లు చేసాం అని మంత్రులు
31 వేల కోట్లు చేసాం అని ముఖ్యమంత్రి
తాజాగా అయిపోలేదు మధ్యలో ఉంది అంటూ వ్యవసాయ శాఖ మంత్రి..… pic.twitter.com/m4IAKWnwbp
KTR On Loan Waiver : ఏది నిజం? ఏది అబద్ధం? రుణమాఫీ పూర్తి అని ఒకరు, ఆగస్టు 15 మాట నిలబెట్టుకున్నామని మరొకరు అంటున్నారని కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రుణమాఫీ కోసం 7,500 కోట్ల రూపాయలు మాత్రమే విడుదలైందని ఆర్థిక మంత్రి, రూ.17 వేల కోట్లు చేశామని మంత్రులు,. 31 వేల కోట్ల రూపాయలు మాఫీ చేశామని ముఖ్యమంత్రి అంటున్నారని, ఇలా తలో మాట చెబుతున్నారని పేర్కొన్నారు.
తాజాగా రుణమాఫీ అయిపోలేదు మధ్యలో ఉంది అంటూ వ్యవసాయ శాఖ మంత్రి అంటున్నారని గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన "ఎక్స్" వేదికగా స్పందించారు. రైతులతో అసమర్థ కాంగ్రెస్ నాయకులు చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఎద్దేడ్సిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని, జూటా కాంగ్రెస్ - జూటా హామీ అంటూ కేటీఆర్ ఘాటుగా స్పందించారు.