ETV Bharat / state

పరీక్షా పే చర్చ నిర్వహించే ప్రధాని నీట్ వ్యవహారంపై స్పందించాలి : కేటీఆర్‌ - KTR Letter On NEET Exam

KTR Letter On NEET Exam : నీట్‌ యూజీ పరీక్ష పేపర్‌ లీకేజీపైవ్యవహారంపై బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ కేంద్రానికి లేఖ రాశారు. విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడినా కేంద్రం పట్టించుకోవట్లేదని పరీక్షా పే చర్చ నిర్వహించే ప్రధాని నీట్ వ్యవహారంపై స్పందించాలని ఆరోపించారు. కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలన్నారు. మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టి విద్యార్థులకు, లక్షలాది మంది తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని కేటీఆర్‌ కోరారు.

NEET Exam Issue
KTR Letter On NEET Exam (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 16, 2024, 4:37 PM IST

KTR Letter On NEET Exam Issue : నీట్ యూజీ ప్రవేశ పరీక్ష వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడినా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులను వెంటనే శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో కేటీఆర్ కోరారు.

నీట్​ ఎగ్జామ్​పై కేంద్రానికి లేఖ : కష్టపడి చదివే తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలపై గందరగోళంగా మారిన నీట్ పరీక్షా వ్యవహారం నీళ్లు చల్లిందని కేటీఆర్ విమర్శించారు. ఓవైపు బిహార్‌లో రూ.30 లక్షల చొప్పున నీట్ ప్రశ్నాపత్రాలు విక్రయించారని పదుల సంఖ్యలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలొస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. ఆది నుంచి నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందని విమర్శించారు.

ఇన్ని ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ మోదీ సర్కార్ ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. విద్యార్థులతో పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని, కీలకమైన నీట్ పరీక్షపై మాత్రం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నీట్ ఎగ్జామ్​లో ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావటం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఒకే సెంటర్ నుంచి ఎనిమిది మంది విద్యార్థులు ఏకంగా 720 మార్కులు సాధించడం చూస్తే పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోందని ఆయన తెలిపారు.

నీట్‌ పరీక్ష ఫలితాలపై ఎక్స్‌పర్ట్‌ కమిటీతో విచారణ జరిపించాలి : కేటీఆర్

ఒకే సెంటర్​లో పెద్ద మొత్తంలో మార్కులు : ఒకే సెంటర్​లో ఇంతమంది విద్యార్థులకు పెద్ద మొత్తంలో మార్కులు రావడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. ఫలితాలను పది రోజులు ముందుకు జరిపి సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించటం కూడా అనేక సందేహాలకు తావిచ్చిందన్న ఆయన ఈ వ్యవహారం బయటకు రాగానే పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించాల్సిన కేంద్రం ఎందుకు ఈ అంశాన్ని ఇప్పటిదాకా పట్టించుకోలేదని నిలదీశారు. పైగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అంతా సవ్యంగానే జరిగిందంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే వరకు కేంద్రం ఈ అంశాన్ని పట్టించుకోకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. గ్రేస్ మార్కుల విధానమే లేని చోట ఏకంగా 1563 మందికి గ్రేస్ మార్కులు ఎందుకిచ్చారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. సాధ్యం కాని విధంగా కొంతమంది విద్యార్థులకు 718, 719 మార్కులు రావటం కూడా మొత్తం గ్రేస్ మార్కుల విధానంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్​ను ప్రమాదంలోకి నెట్టి ఇప్పుడు వాస్తవాలు బయటకు రాకుండా నానాతంటాలు పడుతున్నారని మండిపడ్డారు.

గ్రేస్ మార్కుల అంశమే కాకుండా నీట్ పేపరే లీకైందంటూ వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. గుజరాత్, బిహార్​లో పోలీసులు నీట్​లో అవకతవకలు పాల్పడిన కొంతమందిని అరెస్ట్ చేశారని వరుస వ్యవహారాలతో నీట్ ఎగ్జామ్ తీరుపై అనుమానాలు బలపడుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. గ్రేస్ మార్కులు, పేపర్ లీకేజీ ఆరోపణల కారణంగా తెలంగాణ విద్యార్థులు కూడా నష్టపోయే ప్రమాదం ఉందన్న ఆయన వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండేందుకు రాష్ట్ర ఎంపీలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

నీట్ పేపర్​పై సమగ్ర విచారణ : మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించేలా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు ఎన్డీఏ సర్కారుపై ఒత్తిడి తేవాలని కేటీఆర్ కోరారు. ఇంత జరగుతున్నా ఇప్పటి వరకు ఒక్కరిపై కూడా కేంద్రం చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాల్సిన అవసరముందన్న ఆయన లక్షలాది విద్యార్థుల భవిష్యత్​కు సంబంధించిన ఈ అంశంలో వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నీట్​లో జరిగిన అవకతవకల కారణంగా నష్టపోయిన విద్యార్థులకు ఇబ్బంది లేకుండా, వారికి న్యాయం చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎన్టీఏ పాత్రపై అత్యున్నత దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని, పేపర్ లీకేజీలకు పాల్పడిన వారితో పాటు అక్రమంగా లబ్దిపొందిన వారిపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు. దేశంలోని ఎన్నో పోటీ పరీక్షలు ఎన్టీఏ ఆధ్వర్యంలోనే జరుగుతున్నందున తాజా పరిణామాలతో ఎన్టీఏపై విద్యార్థులు నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చిందని అన్నారు. భవిష్యత్​లో ఇలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరముందని పేర్కొన్నారు. నీట్​లో అక్రమాల కారణంగా కష్టపడి చదివిన మన విద్యార్థులకు ఎలాంటి నష్టం జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదన్న కేటీఆర్ వారి తరపున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టంచేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయి - కేటీఆర్

టెస్కాబ్ ఛైర్మన్​ పదవులకు సైతం రాజీనామా చేసిన వారి నిర్ణయం అభినందనీయం : కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.