BRS Vijayotsava Sabha In Medchal : మేడ్చల్ జిల్లా మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అధ్వర్యంలో మేడ్చల్ నియోజక బీఆర్ఎస్ పార్టీ విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(BRS Party Working President KTR), సీనియర్ నాయకులు భద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుభాశ్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాగి లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, తాండూరు శ్రీనివాస్, సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఉప్పల్‌లో జోష్ చూస్తుంటే అధికారంలో మనం ఉన్నామా? కాంగ్రెస్ వాళ్లు ఉన్నారా? అర్థం కావటం లేదన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరిలో గెలుపు బీఆర్ఎస్దే అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించి కాంగ్రెస్‌ను ఈ ప్రాంతంలో మడత పెట్టి కొట్టుడేనని ధ్వజమెత్తారు. 420 హామీలు చూసి జిల్లాలో జనం మోసపోయారని కేటీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీని ఆగం చేసే ఉద్దేశం మాకు లేదు : కేటీఆర్
"ఉప్పల్‌లో జోష్ చూస్తుంటే అధికారంలో బీఆర్ఎస్ ఉందా? కాంగ్రెస్ వాళ్లు ఉన్నారా అర్థం కావడం లేదు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరిలో బీఆర్ఎస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ను పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించి, కాంగ్రెస్‌ను తరిమికొట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను చూసి ప్రజలు మోసపోయారు." - కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
KTR Fires On Congress : కాంగ్రెస్ సర్కార్ మాటల ప్రభుత్వం కానీ, చేతల ప్రభుత్వం కాదని జనం తెలుసుకున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్‌ను బొంద పెట్టుడే అని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడే భాషను జనం చూసి అసహ్యించుకుంటున్నారన్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. లంకె బిందెల కోసం దొంగలు తిరుగుతారని కేటీఆర్ విమర్శించారు. ఈ క్రమంలోనే గతంలో రేవంత్ రెడ్డి అదే కావచ్చని, తనకైతే తెలియదని ఎద్దేవా చేశారు. మొన్న జరిగిన ఫలితాలు మన మంచికే వచ్చాయని కేటీఆర్ అన్నారు. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుందన్నారు.
కంచుకోటను మరోసారి కైవసం చేసుకునేందుకు 'హస్తం' పక్కా ప్లాన్ - నిజామాబాద్ బరిలో ఆ అభ్యర్థి!
"లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరిలో బీఆర్ఎస్ గెలుస్తుంది. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను చూసి జనం మోసపోయారు. కాంగ్రెస్ మాటల ప్రభుత్వమే, చేతల ప్రభుత్వం కాదు. 100 రోజుల్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్‌ను బొందపెడతాం. కేసీఆర్‌ను సీఎం రేవంత్ నోటికొచ్చినట్లు మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మన మంచికే అనుకుంటున్నా. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది." - కేటీఆర్
కాంగ్రెస్‌కు ఓటు వేస్తే దేశంలో అస్థిరత, అవినీతి పెరుగుతుంది: కిషన్‌రెడ్డి
రైతుబంధు అడిగితే మంత్రి కోమటిరెడ్డి అహంకారంతో ప్రవర్తించారు : హరీశ్‌రావు