ETV Bharat / state

పార్టీ నేతలు, శ్రేణులను కలుపుకుని వెళ్లేలా బీఆర్​ఎస్ బిగ్​ ప్లాన్ - నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తల నియామకం - BRS Party Focus On Coordinators - BRS PARTY FOCUS ON COORDINATORS

BRS Party Focus On Coordinators : లోక్​సభ ఎన్నికల్లో పార్టీ నేతలు, శ్రేణుల మధ్య సమన్వయంపై భారత రాష్ట్ర సమితి ప్రధానంగా దృష్టి సారించింది. పార్టీలోని అందరినీ సమన్వయం చేసుకుపోవడంతో పాటు విశ్వాసంలోకి తీసుకునేలా ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా శాసనసభ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమిస్తోంది. ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ మాజీ ఛైర్మన్లు, సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు.

BRS Party Focus On Coordinators
BRS Party Focus On Coordinators
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 11, 2024, 9:13 PM IST

BRS Party Focus On Coordinators : శాసనసభ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమితికి లోక్​సభ ఎన్నికలు (Lok Sabha polls 2024) సవాల్​గా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆ పార్టీ అభ్యర్థులు (BRS Candidates), ఇంకా దాన్నుంచి పూర్తిగా తేరుకోలేదు. స్థానికంగా నేతల మధ్య మనస్పర్థలు, వివాదాలు పూర్తిగా సమసిపోలేదు. ఓటమి పాలైన ఇన్​ఛార్జ్​లకే పూర్తి బాధ్యతలు అప్పగించడం సరికాదన్న భావన కొన్ని చోట్ల శ్రేణుల్లో నెలకొంది. పై అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని పార్టీలోని అందరినీ కలుపుకొని పోయే విషయమై బీఆర్ఎస్ అధిష్ఠానం దృష్టి సారించింది.

BRS Party Appoints coordinators : నేతలు, శ్రేణులు అందరిని విశ్వాసంలోకి తీసుకొని ముందుకెళ్లే ఏర్పాటు చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఇందులో భాగంగా లోక్​సభ ఎన్నికల కోసం సమన్వయకర్తలను (coordinators) నియమిస్తోంది. శాసన మండలి సభ్యులు, సీనియర్ నేతలు, కార్పొరేషన్ మాజీ ఛైర్మన్లకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నారు. శాసనసభ నియోజకవర్గాల (Assembly Constituency) వారీగా ఈ సమన్వయకర్తలను నియమిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, మాజీలు, ఇతర సీనియర్ నేతలు, శ్రేణులను సమన్వయం చేయడం వీరి బాధ్యత. ఇప్పటి వరకు మూడు లోక్​సభ నియోజకవర్గాలకు అసెంబ్లీ సమన్వయకర్తలను నియమించారు.

చేవెళ్ల నియోజక వర్గం సమన్వయకర్తగా స్వామిగౌడ్ : చేవెళ్ల లోక్​సభ నియోజకవర్గంలోని (Lok Sabha Constituency) మహేశ్వరం సమన్వయకర్తగా మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, రాజేంద్రనగర్​కు సీనియర్ నేత పుట్టం పురుషోత్తం రావును సమన్వయకర్తలుగా నియమించారు. శేరిలింగంపల్లి సమన్వయకర్తగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్, చేవెళ్లకు పార్టీ కార్యదర్శి నాగేందర్ గౌడ్ కు బాధ్యతలు అప్పగించారు. పరిగికి సీనియర్ నేత గట్టు రామచంద్రరావు, వికారాబాద్ కు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, తాండూర్​కు జెడ్పీ వైస్ ఛైర్మన్​ను బైండ్ల విజయ్ కుమార్​ను సమన్వయకర్తగా నియమించారు.

మల్కాజిగిరి నియోజకవర్గ సమన్వయకర్తలు వీరే : మల్కాజిగిరి నియోజకవర్గంలోని మేడ్చల్ సమన్వయకర్తగా ఎమ్మెల్సీ శంబిపూర్ రాజును, మల్కాజిగిరికి కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ నందికంటి శ్రీధర్​కు బాధ్యతలు అప్పగించారు. కుత్బుల్లాపూర్​కు సీనియర్ నేత గొట్టిముక్కుల వెంగళరావు, కూకట్ పల్లికి మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఉప్పల్​కు పార్టీ కార్యదర్శి జహంగీర్ పాషను సమన్వయకర్తలుగా నియమించారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి సమన్వయకర్తగా కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, ఎల్బీనగర్​ను ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తకు బాధ్యతలు ఇచ్చారు.

BRS Party Nagar Kurnool Coordinators : నాగర్​కర్నూల్ లోక్​సభ నియోజకవర్గంలో నాగర్​కర్నూల్ బాధ్యతలు కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ వాల్యా నాయక్, గద్వాల్​కు మరో మాజీ ఛైర్మన్ ఇంతియాజ్ అహ్మద్ సమన్వయకర్తలుగా నియమించారు. అలంపూర్​కు సీనియర్ నేత దేవర మల్లప్ప, కల్వకుర్తికి చాడ కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. సమన్వయకర్తలుగా వనపర్తికి బైకాని శ్రీనివాస్ యాదవ్, అచ్చంపేటకు నవీన్ కుమార్ రెడ్డి, కొల్లాపూర్​కు ఆంజనేయులు గౌడ్​ను నియమించారు

Functions Of Coordinators : లోక్​సభ ఎన్నికల కోసం ఆయా నియోజవర్గాల్లో నేతలు, శ్రేణులను సమన్వయం చేసుకుంటా పార్టీ రాష్ట్ర నాయకత్వం, స్థానిక పార్టీకి మధ్య వారధులుగా పనిచేయాల్సి ఉంటుంది. మిగిలిన నియోజకవర్గాలకు కూడా త్వరలోనే సమన్వయకర్తలను నియమించనున్నారు. అటు ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పార్టీ మారిన తరుణంలో భద్రాచలం నియోజకవర్గానికి సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న పది మంది సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు.

'పదేళ్ల కేసీఆర్​ పాలనలో ఏనాడూ ఇలాంటి పరిస్థితులు లేవు - కాంగ్రెస్ వచ్చింది - కరవు మొదలైంది' -

సీఎం గుంపు మేస్త్రీ అయితే ప్రధాని తాపీ మేస్త్రీ - ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు : కేటీఆర్ -

గెలిచేంత వరకు ఒక మాట-గెలిచాక ఇంకో మాట-ఇదే కాంగ్రెస్ నీతి: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.