ETV Bharat / state

ఆ విషయంలో సీఎం క్షమాపణలు చెప్పాలంటూ బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీల పట్టు - మండలిలో గందరగోళం

BRS MLCs Protest in Legislative Council : శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యావాద తీర్మానంపై సమావేశం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మండలి సభ్యులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలంటూ బీఆర్ఎస్​ ఎమ్మెల్సీలు డిమాండ్‌ చేయడంతో పాటు కౌన్సిల్ పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. దీంతో కౌన్సిల్ ఛైర్మన్ గుత్తా సుఖేందర్​రెడ్డి మండలిని వాయిదా వేశారు.

BRS MLCs Protest in Legislative Council
BRS MLCs Protest in Legislative Council
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 9, 2024, 12:19 PM IST

Updated : Feb 9, 2024, 2:19 PM IST

BRS MLCs Protest in Legislative Council : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యావాద తీర్మానంపై శాసనమండలిలో వాడీవేడి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల మండలి సభ్యులపై సీఎం రేవంత్​రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళ చేపట్టారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్​రెడ్డి వెంటనే కౌన్సిల్ సభ్యులకు క్షమాపణలు చెప్పాలని అప్పటి వరకు మండలిని నిర్వహించొద్దని వారు అన్నారు. దీంతో గందరగోళం నెలకొంది.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి స్పందించారు. కౌన్సిల్​ను గులాబీ పార్టీ సభ్యులు అగౌరవపరుస్తున్నారని అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్సీలు చేసిన ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి పంపారని, పెద్దల సభలో ఓపిక ఉండాలని సూచించారు. మరోవైపు వారికి ఈ విషయంలో నిరసన చేపట్టే హక్కు లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. అయినా భారత్ రాష్ట్ర సమితి సభ్యులు కౌన్సిల్ పోడియాన్ని చుట్టుముట్టడంతో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్​ రెడ్డి 10 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు.

ప్రజాకాంక్షలు నెరవేరేలా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోంది : గవర్నర్ తమిళిసై

Telangana Budget Sessions 2024 : వాయిదా అనంతరం శాసనమండలి తిరిగి ప్రారంభమైంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) మండలి సభ్యులను అవమాన పరిచారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ ఆరోపించారు. వెంటనే ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సభ గౌరవ మర్యాదలను కాపాడాల్సిన రేవంత్​రెడ్డి, ఇలాంటివి మాట్లాడకూడదని ఆయన అన్నారు. మరోసారి గులాబీపార్టీ ఎమ్మెల్సీలు కౌన్సిల్ పోడియాన్ని చుట్టుముట్టి అందోళన చేపట్టారు. సీఎంపై వచ్చిన ఫిర్యాదును అసెంబ్లీ సెక్రటరీకి పంపినట్లు కౌన్సిల్ ఛైర్మన్ గుత్తా సుఖేందర్​రెడ్డి వారికి వివరించారు. అయినా వారు నిరసన ఆపకపోవడంతో మండలిని మరోసారి వాయిదా వేశారు.

అంతకుముందు ఆటో డ్రైవర్ల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా హైదరాబాద్​లో భారత్​ రాష్ట్ర సమితి వినూత్నంగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించింది. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో చేరుకున్నారు. అయితే వారిని అసెంబ్లీ గేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు గొడవ జరిగింది.

గవర్నర్​ ప్రసంగం పేలవంగా ఉంది - ప్రభుత్వం తన విజన్​ను​ ఆవిష్కరించలేదు : హరీశ్​రావు

Last Updated : Feb 9, 2024, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.