ETV Bharat / state

మరోసారి తిహాడ్ జైలుకు కవిత - ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ - BRS MLC Kavitha Judicial Custody - BRS MLC KAVITHA JUDICIAL CUSTODY

BRS MLC Kavitha Judicial Custody Again : దిల్లీ మద్యం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితను నేడు సీబీఐ అధికారులు రౌస్‌ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించాలని సీబీఐ కోరగా, 9 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది.

BRS MLC Kavitha Judicial Custody Again
BRS MLC Kavitha Judicial Custody Again
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 15, 2024, 10:21 AM IST

Updated : Apr 15, 2024, 11:55 AM IST

BRS MLC Kavitha Judicial Custody Again : దిల్లీ మద్యం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha CBI Investigation) ఈడీ కస్టడీ నుంచి సీబీఐ ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టు అనుమతితో శని, ఆదివారం రెండు రోజులు ఆమెను అధికారులు ప్రశ్నించారు. కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు ఈరోజు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరపరిచారు.

9 Days Judicial Custody Of Kavitha : ఈ సందర్భంగా కవితను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించాలని సీబీఐ కోరగా, 9 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది. ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కవితను అధికారులు మరోసారి తిహాడ్ జైలుకు తరలించనున్నారు.

రెండేళ్ల నుంచి అడిగిందే అడుగుతున్నారు : అయితే కోర్టుకు వెళ్లే ముందు కవిత మీడియా (Kavitha on CBI Investigation)తో మాట్లాడుతూ బీజేపీ తీవ్రంగా మండిపడ్డారు. ఇది సీబీఐ కస్టడీ కాదని, బీజేపీ కస్టడీ అని అన్నారు. బయట కమలం పార్టీ వాళ్లు మాట్లాడేదే, లోపల అధికారులు అడుగుతున్నారని తెలిపారు. రెండేళ్ల నుంచి అడిగిందే అడుగుతున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు.

CBI Investigation On Kavitha : రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలతో శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్సీ కవితను అధికారులు సీబీఐ కేంద్ర కార్యాలయానికి తరలించారు. అంతకుముందు కోర్టులో కవితను కస్టడీ (BRS Leader Kavitha CBI Custody)కి కోరుతూ సీబీఐ, దిల్లీ మద్యం విధానం రూపకల్పన, అక్రమాల్లో కవితను కీలక సూత్రధారి, పాత్రధారి అని తెలిపింది. అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఆమెను ప్రశ్నించేందుకు కస్టడీ కోరగా ఈనెల 14వ తేదీ వరకు కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. రెండ్రోజుల సీబీఐ కస్టడీలో అధికారులు కవితను మద్యం కుంభకోణం (Delhi Excise Policy Case Update)లో దాగి ఉన్న విషయాలు రాబట్టేలా వివిధ కోణాల్లో ప్రశ్నించి సమాచారం రాబట్టినట్లు తెలిసింది.

లిక్కర్ స్కామ్​తో నాకు సంబంధం లేదు - నాకెలాంటి ఆర్థిక లబ్ధి చేకూరలేదు : కవిత

జపమాల, నరసింహ శతకం, గజేంద్ర మోక్షం - వీటిని ఇచ్చేందుకు కవితకు కోర్టు అనుమతి - Court Grants Facilities to Kavitha

Last Updated : Apr 15, 2024, 11:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.