BRS on MLAs Disqualification Petition : సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద (KP Vivekananda) డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. కడియం, తెల్లం వెంకట్రావుపై అనర్హత పిటిషన్ ఇచ్చేందుకు యత్నించామని, స్పీకర్ తమకు సమయం ఇవ్వడం లేదని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను రిజిస్టర్ పోస్ట్, ఈ-మెయిల్ ద్వారా స్పీకర్‌కు పంపినట్లు కేపీ వివేకానంద తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద బీఆర్ఎస్(BRS) నేతలు ధర్నాలు చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టాలని గతంలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారని, ఇప్పుడు ఎవరిని రాళ్లతో కొట్టాలని కేపీ వివేకానంద ప్రశ్నించారు.
BRS Fires Congress : రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని వ్యవస్థలను తన చేతుల్లో పెట్టుకుని, నియంత్రించాలనే ప్రయత్నం చేస్తున్నారని కేపీ వివేకానంద పేర్కొన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య తెలంగాణ స్థాపిస్తామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామంటూ కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చారని, కానీ నేడు మాటలకు, చేతలకు సంబంధం లేదని దుయ్యబట్టారు. ప్రస్తుతం పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయతలేదని, ప్రజలలో నమ్మకం పోయిందన్నారు.
నేడు కాంగ్రెస్ పార్టీ అంటే కన్‌ఫ్యూజన్, కరప్షన్ పార్టీగా మారిందని వివేకానంద ఎద్దేవా చేశారు. దేశంలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వాలు ఎక్కడా స్థిరంగా లేవని ఆయన పేర్కొన్నారు. జాతీయ కాంగ్రెస్‌ను అపహస్యం చేస్తూ రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. రాహుల్ నీతులు చెబుతుంటే, రేవంత్ గోతులు తవ్వుతున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, తమ ఎమ్మెల్యేల మీద నమ్మకం లేక పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.
దానం నాగేందర్ పై పిటిషన్ దాఖలు చేసి నెల రోజులు కావస్తున్నా చర్య తీసుకోకపోవడంతో హైకోర్టులో పిటిషన్ వేశామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సానుకూల తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. పార్టీ మారిన ఎమ్మేల్యేల ఇండ్ల వద్ద చావు డప్పు కొడతామని హెచ్చరించారు.
"ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను రిజిస్టర్ పోస్ట్, ఈ-మెయిల్ ద్వారా స్పీకర్‌కు పంపించాము. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం స్పీకర్ 3నెలలలోపు నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు". - కేపీ వివేకానంద, బీఆర్ఎస్ నేత
దానం విషయంలో ఆదివారంలోగా నిర్ణయం తీసుకోవాలి - లేదంటే హైకోర్టుకే : కేటీఆర్ - KTR ON DANAM
బీఆర్ఎస్కు మరో షాక్ - కాంగ్రెస్ గూటికి ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్