ETV Bharat / state

పంచాయతీల్లో నిధులు లేక గ్రామాలు ఏడుస్తున్నాయి: కొత్త ప్రభాకర్​ రెడ్డి - telangana budget session 2024 - TELANGANA BUDGET SESSION 2024

Telangana Assembly Budget Session 2024 : తెలంగాణ శాసనసభలో పంచాయతీ నిధులపై బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​ రెడ్డి, మంత్రి శ్రీధర్​ బాబు కొద్దిపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. నిధులు లేక గ్రామాలు ఏడుస్తున్నాయని ఆవేదన చెందారు.

Telangana Assembly Budget Session 2024
Telangana Assembly Budget Session 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 30, 2024, 7:20 PM IST

Updated : Jul 30, 2024, 9:24 PM IST

BRS MLA Kotha Prabhakar Reddy Fires on Telangana Govt : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతున్న ఎమ్మెల్యేగా తనకు ఇంకా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​ రెడ్డి అన్నారు. శాసనసభలో పద్దులపై చర్చలో భాగంగా ఆయన ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్​ అంటూ గతంలో కాంగ్రెస్​ నేతలు బద్నాం చేశారని, అయితే ఇప్పుడు మధిర, కొడంగల్​ నియోజకవర్గాలకు నిధులను తరలిస్తున్నారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​ రెడ్డి అసెంబ్లీ సమావేశంలో ఆరోపించారు. అందుకే మీకు(అధికారపక్షానికి) ప్రశ్నించే హక్కులేదని పేర్కొన్నారు.

అప్పుడు అలా చేశామనే మమ్మల్లి(బీఆర్​ఎస్​ పార్టీ) ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని, మరి మీరు కూడా ఇక్కడ కూర్చుంటారా అంటూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​ రెడ్డి ప్రశ్నించారు. ఏదైనా శాఖకు ప్రతి ఏటా బడ్జెట్​ పెరుగుతుంది కానీ తగ్గడం ఏంటని ప్రశ్నించారు. నిధులు లేక గ్రామాలు ఏడుస్తున్నాయని ఆవేదన చెందారు. కుక్కలు, పందులు బెడదతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని వివరించారు. కానీ బీఆర్​ఎస్​ పాలనలో గ్రామీణాభివృద్ధి బాగా జరిగిందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​ రెడ్డి అన్నారు.

"2014 నుంచి తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత గ్రామీణ వ్యవస్థ మీద నాటి సీఎం కేసీఆర్​ మూడేళ్లలో అభివృద్ధి చేసిన ఘనత అప్పటి కేసీఆర్​ది. సిద్దిపేట, గజ్వేల్​, సిరిసిల్ల జిల్లాలకు నాటి అభివృద్ధి అంటున్నారు కదా ఇప్పుడు మధిర, కొడంగల్​, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు నిధులు అన్నీ వెళుతున్నాయి. అప్పుడు అలా చేయడం వల్లే ఈనాడు ఇక్కడ కూర్చున్నాం." - కొత్త ప్రభాకర్​ రెడ్డి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే

మీ పాలనలో సర్పంచ్​లు అప్పులు పాలు : బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​ రెడ్డి మాటలకు కౌంటర్​ ఇస్తూ మంత్రి శ్రీధర్​ బాబు మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనలో సర్పంచులు అప్పుల పాలైయ్యారని, ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. లక్షల కోట్ల రూపాయల నిధులు, బకాయిలు గత ప్రభుత్వం గ్రామాలకు పెట్టిందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన పాపాలను ఇప్పుడు తాము మోస్తున్నామని పేర్కొన్నారు.

"గత ప్రభుత్వ పాలనలో సర్పంచులు అప్పులు పాలైయ్యారు. ఆత్మహత్యలు చేసుకున్నారు. లక్షల కోట్ల రూపాయల నిధులు, బకాయిలు గత ప్రభుత్వం గ్రామాలకు పెట్టింది. గత ప్రభుత్వం చేసిన పాపాలను ఇప్పుడు మోస్తున్నాము. అన్ని బాకీలను తీరుస్తున్నాం." - శ్రీధర్​ బాబు, మంత్రి

కేంద్రం నుంచి వచ్చిన నిధులు విడుదల చేయడం లేదు : ఆ వెంటనే బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​ రెడ్డి లేచి స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం బకాయిలు ఉన్నాయని తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాలకు బడ్జెట్​లో నిధులు తగ్గించారని విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా విడుదల చేయడం లేదని ధ్వజమెత్తారు.

బీసీల కోసం లక్ష కోట్లు కేటాయిస్తామన్నారు - బడ్జెట్‌లో 20వేల కోట్లైనా పెట్టలేదు: కేటీఆర్ - telangana assembly session 2024

పవర్​ వార్​ : అసెంబ్లీ వేదికగా విద్యుత్ ​రంగంపై అధికార, విపక్షాల మధ్య హోరాహోరీ చర్చ - electricity debate in assembly 2024

Last Updated : Jul 30, 2024, 9:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.