ETV Bharat / state

కష్టం కేసీఆర్‌దైతే బటన్‌ నొక్కేది మాత్రం కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దలు : జగదీశ్ రెడ్డి - BRS Jagadish Reddy On Sitarama - BRS JAGADISH REDDY ON SITARAMA

BRS MLA Jagadish Reddy Comments On Congress : సీతారామ ప్రాజెక్టుపై మంత్రులు మట్లాడేవన్నీ అబద్దాలేనని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. హరీశ్ రావు చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించిన జగదీశ్‌ బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. ఓ మంత్రి కంటతడి పెట్టడం ఆశ్చర్యం కలిగించిందన్న మాజీ మంత్రి కష్టం కేసీఆర్‌దైతే బటన్‌ నొక్కేది మాత్రం కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దలని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీతారామ ప్రాజెక్టుపై కనీసం ఒక ఉత్తరమైనా రాశారా? అని ప్రశ్నించారు.

BRS MLA Jagadish Reddy Comments On congress
BRS Jagadish Reddy On Sitarama Project (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 14, 2024, 6:35 PM IST

Updated : Aug 14, 2024, 6:52 PM IST

BRS MLA Jagadish Reddy On Sita Rama Project : కిరణ్ కుమార్ రెడ్డిదే బలహీనమైన ప్రభుత్వం అనుకుంటే అంతకన్నా బాధ్యతారాహిత్యమైన ప్రభుత్వం రేవంత్ రెడ్డిది అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. వీధుల్లో కుక్కలు ప్రజలను కరుస్తుంటే కనకపు సింహాసనం మీద కూర్చున్న శునకాలు ప్రతిపక్షాలను కరుస్తున్నాయని వ్యాఖ్యానించారు. సీతారామ ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీశ్ రావు ఉన్న మాట అంటే మంత్రులకు ఉలుకు ఎందుకని ప్రశ్నించిన ఆయన ఓ మంత్రి కంటతడి పెట్టడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు.

కేసీఆర్ హయాంలో సీతారామ ప్రాజెక్టు పనులు దాదాపుగా పూర్తిచేసారని కనీసం బటన్ నొక్కేటపుడైనా కేసీఆర్ కష్టం గురించి చెప్పాలని మంత్రులను కోరారు. మంత్రి ఉత్తమ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని కనీసం అధికారులతో ఆయన మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. సీతారామ ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రభుత్వం 2018 నుంచి 2022 దాకా వరుసగా కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపితే అనుమతులు వచ్చాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీతారామ ప్రాజెక్టుపై కనీసం ఒక ఉత్తరమైనా రాశారా అని ప్రశ్నించారు.

కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత తప్పటడుగు వేసి బీఆర్ఎస్ ఒత్తిడితో వెనక్కి తగ్గారని కాంగ్రెస్ హయాంలోలాగా కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ప్రాజెక్టు అంచనాలు పది, పదిహేను రెట్లు పెంచలేదని పేర్కొన్నారు. కమీషన్లు ఇవ్వడం, తీసుకోవడం కాంగ్రెస్ నేతలకు అలవాటన్న మాజీ మంత్రి కాలువలు తవ్వకముందే మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ నేతలు ఇంకా చంద్రబాబు, వైఎస్ భజన చేస్తున్నారని వాళ్లిద్దరూ తెలంగాణలో ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో ఆంధ్రా, రాయలసీమ ప్రాజెక్టులు పూర్తయి తెలంగాణ ప్రాజెక్టులు పెండింగ్​లో పడ్డాయని అన్నారు. వైఎస్ రాయలసీమకు 350 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేశారని తెలంగాణకు ఏం చేశారని అడిగారు. వైఎస్, చంద్రబాబు హయాంలో తెలంగాణలో మూడున్నర క్యూసెక్కుల సామర్ధ్యం ఉన్న చెరువు అయినా కట్టారా అని ప్రశ్నించిన జగదీష్ రెడ్డి ఎవరి హయాంలో తెలంగాణ ప్రాజెక్టులు పూరయ్యాయో ఉత్తమ్, భట్టి చర్చకు వస్తారా అని సవాల్ చేశారు.

ఎస్సార్బీసీ పూర్తయినా పూర్తి కాలేదని కాంగ్రెస్ మంత్రులు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టుపై మంత్రులు మాట్లాడిన ప్రతి వాక్యం అబద్దమే అన్న ఆయన మంత్రులు మాట్లాడిన దానిపై ఎక్కడైనా చర్చకు సిద్దమేనని స్పష్టం చేశారు. వడ్లు పండితే ఎక్కడ బోనస్ ఇవ్వాల్సి వస్తుందోనని కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఉన్నా సాగునీరు ఇవ్వడం లేదని మాజీమంత్రి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ బిడ్డలను స్థానికేతరులను చేసే విధంగా జీఓ 33 తెచ్చారని, ఇంత కన్నా తెలంగాణకు ద్రోహం ఏముంటుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం జీఓ 33ను వెంటనే రద్దు చేయాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.

"కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత తప్పటడుగు వేసి బీఆర్ఎస్ ఒత్తిడితో వెనక్కి తగ్గారు. కాంగ్రెస్ హయాంలో లాగా కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ప్రాజెక్టు అంచనాలు పది, పదిహేను రెట్లు పెంచలేదు. కమీషన్లు ఇవ్వడం తీసుకోవడం కాంగ్రెస్ నేతలకు అలవాటు. కాలువలు తవ్వకముందే మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలది." -జగదీశ్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే

విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వ యత్నం : జగదీశ్‌ రెడ్డి - BRS On Electricity Privatization

విభజన చట్టం ప్రకారం దక్కాల్సిన విద్యుత్‌ తెలంగాణకు దక్కలేదు : జగదీశ్‌ రెడ్డి - jagadish reddy comments on congress

Last Updated : Aug 14, 2024, 6:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.