ETV Bharat / state

హైడ్రా పేరిట హైడ్రామా - కాంగ్రెస్‌ కండువా కప్పుకోకపోతే టార్చర్ : హరీశ్​రావు - HARISH RAO SLAMS GOVT OVER HYDRA

Harish Rao Fires On Congress Govt : కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరిట హైడ్రామా నడుపుతోందని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోలేక పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్‌ కండువా కప్పుకోకపోతే ఇబ్బంది పెడుతున్నారని ఆక్షేపించారు.

Harish Rao Fires CM Revanth
Harish Rao Fires CM Revanth (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 25, 2024, 12:03 PM IST

Updated : Aug 25, 2024, 2:42 PM IST

Harish Rao Fires On CM Revanth : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్​ నేత మాజీ మంత్రి హరీశ్​రావు స్పందించారు. రాజకీయంగా ఎదుర్కోలేక పల్లాపై అక్రమకేసులు పెట్టారని కాంగ్రెస్​ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా హస్తం పార్టీపై ఆయన పలు విమర్శలు గుప్పించారు. హైడ్రాపెరిట హైడ్రామా నడుపుతున్నారన్న హరీశ్​రావు కాంగ్రెస్​లో చేరని వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. పల్లా రాజేశ్వరరెడ్డిని ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. ఆయన్ను ఆర్థికంగా దెబ్బకొట్టాలని కాంగ్రెస్​ సర్కారు చూస్తోందని విమర్శించారు. అక్రమంగా కాలేజీలు నిర్మించారని నిరూపిస్తే పల్లా రాజేశ్వరరెడ్డే కూలగొడతారన్నారు.

రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ : రాష్ట్రంలో డెంగీ కేసులు పెరుగుతుండటంపై హరీశ్​రావు ఆందోళన వ్యక్తం చేశారు. డెంగీ కేసులు 36శాతం పెరిగాయన్న ఆయన ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సమీక్ష కూడా చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవన్న హరీశ్​రావు ప్రజల ఆరోగ్యం కంటే ఏదైనా ముఖ్యమైనది ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందని, తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. అయినా డెంగీపై సమీక్ష చేయకుండా విపక్షాలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలా : 'పేరుకు ప్రజాపాలన. జరుగుతుంది మాత్రం సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం. అధికార కాంగ్రెస్​కు ప్రజా సమస్యలు పరిష్కారం కంటే సంచలనాలపైనే దృష్టి. ప్రజలు విషజ్వరాలతో అల్లాడుతుంటే రేవంత్ ప్రభుత్వం మాత్రం ప్రత్యర్థులపై విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు పిట్టల్లా రాలుతుంటే చీమ కుట్టినట్లైన లేదు. ఉద్యమ నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి నిక్కచ్చిగా ప్రజల కోసం పనిచేస్తున్నారు. చీమకు కూడా హాని తలపెట్టని పల్లా కుటుంబాన్ని కేసులతో ఇబ్బంది పెడుతున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఆర్థికంగా దెబ్బకొట్టాలని చూస్తున్నారు. ఎఫ్ టీ ఎల్ లో ఉంటే 24 గంటల్లో ఆయనే కూల్చివేస్తారు' అని హరీశ్​రావు అన్నారు.

కక్షసాధింపు చర్యలు : ప్రభుత్వాలు శాశ్వతం కాదని, రాజకీయ ప్రేరేపితంతో అధికారులు అత్యుత్సాహంతో వ్యవహరించవద్దని హితవు పలికారు. హైడ్రాకు తాము వ్యతిరేకం కాదన్న ఆయన అక్రమకట్టడాలు ఉంటే కూల్చివేయాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 99 ఇంజనీరింగ్ కళాశాలలకు సీట్ల పెంపునకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి కళాశాలలకు మాత్రం అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు.

న్యాయస్థానాల్లో చూసుకుంటాం : మరోవైపు తనపై కేసు నమోదవ్వడంపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. 25 ఏళ్ల నుంచి విద్యాసంస్థలు నడుపుతున్నానని, కానీ తొమ్మిది నెలలుగా రోజూ ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నీటిపారుదల శాఖ అనుమతులు ఇచ్చిందన్నారు. వాళ్లే ఇవాళ ఫిర్యాదులు చేస్తున్నారని పేర్కొన్నారు. తన సొంత భూమిలో నిర్మాణాలు చేసుకున్నట్లు వివరించారు. మీడియా సమక్షంలో సర్వేచేసి నిర్ధారించాలన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా న్యాయస్థానాల ద్వారానే చూసుకుంటానని తెలిపారు.

విషజ్వరాలతో జనం చనిపోతున్నా - ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు : హరీశ్​ రావు - HARISH RAO ON DENGUE DEATHS

రుణమాఫీ కాలేదని నిరసనకు దిగితే అరెస్టు చేస్తారా? - ఇదెక్కడి అరాచకం : హరీశ్​రావు - HARISH RAO ON FARMERS ARRESTS

Last Updated : Aug 25, 2024, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.