ETV Bharat / state

సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు బహిరంగ లేఖ - 'ఆ నిష్పత్తిలోనే గ్రూప్‌-1 మెయిన్స్‌కు అనుమతించాలి' - harishrao open letter to cm

Harish Rao Open Letter to CM Revanth : గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలోనే అభ్యర్థులను అనుమతించాలని సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ చేసే విధంగా మెగా డీఎస్సీ ఉండాలని డిమాండ్‌ చేశారు. జీవో 46 ద్వారా ఏర్పడ్డ సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్‌కు సూచించారు.

Harishrao Open Letter to CM Revanth
Harishrao Open Letter to CM Revanth (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 14, 2024, 7:05 PM IST

BRS leader Harish Rao Wrote a Letter to CM Revanth Reddy : గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు సాధించుకునేందుకు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తుంటే, ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం శోచనీయం అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆందోళన వ్యక్తంచేశారు. పెద్ద మనసుతో వారి సమస్యలకు పరిష్కారం చూపాల్సింది పోయి, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా నేడు మీడియా సమావేశం నిర్వహించి ఉసూరుమనిపించారన్నారని వాపోయారు. గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌ రావు బహిరంగ లేఖ రాశారు.

గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను అనుమతించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గతంలో కాంగ్రెస్‌ శాసన సభాపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీ వేదికగా డిమాండ్‌ చేసిన విషయాన్ని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు గుర్తు చేశారు. గతంలో మీరు ప్రకటించిన వైఖరికి కట్టుబడి మెయిన్స్‌కు 1:100 చొప్పున ఎంపిక చేసి ఉద్యోగార్థులకు తగిన న్యాయం చేయాలని కోరారు. గ్రూప్‌-2 పరీక్షకు రెండు వేల ఉద్యోగాలు, గ్రూప్‌-3 పరీక్షకి మూడు వేల ఉద్యోగాలు అదనంగా కలుపుతామని ఇచ్చిన మాటను నిలుపుకోవాల్సిన బాధ్యత సీఎం రేవంత్‌ రెడ్డిపై ఉందని లేఖలో పేర్కొన్నారు. పోటీ పరీక్షల మధ్య కాలవ్యవధి చాలా తక్కువ ఉండటం వల్ల అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మీరు మేనిఫెస్టోలో చెప్పిన దానికి కట్టుబడి మొత్తం ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసే విధంగా మెగా డీఎస్సీ నిర్వహించాలని కోరుతున్నామని తెలిపారు.

అప్పుడు ఎందుకు అలా చెప్పారు : అప్పడు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని లేఖ ద్వారా సీఎం రేవంత్‌ రెడ్డికి హరీశ్‌రావు రాశారు. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి తదనుగుణంగా నోటిఫికేషన్లను జారీ చేయాలని కోరుతున్నానని తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు నెలకు రూ.4000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారని లేఖలో రాశారు. నిరుద్యోగ భృతిని నెలనెలా చెల్లించాలని కోరుతున్నానని స్పష్టం చేశారు.

జీవో నంబర్‌ 46 ద్వారా ఏర్పడ్డ సమస్యలు పరిష్కరించాలి : కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే జీవో నంబర్‌ 46ను రద్దు చేస్తామని నిరుద్యోగులను నమ్మించారని లేఖలో హరీశ్‌రావు చెప్పారు. ప్రభుత్వం వెంటనే జీవో 46 ద్వారా ఏర్పడ్డ సమస్యలను పరిష్కరించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌ రెడ్డికి పలు అంశాలపై సత్వరమే చర్యలు తీసుకోవాలంటూ హరీశ్‌రావు లేఖ రాశారు.

గ్రూప్- 2 పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగుల ధర్నా - Unemployed Protest on Group 2 Exams

గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్ - మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలోనే ఎంపిక - TGPSC GROUP 1 CANDIDATES SELECTION

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.