Harish Rao Serious Comments On Congress Party: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో అనేక అభివృద్ధి చేసినట్లు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీశ్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏడు నెలల గ్రామాలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. 7 నెలల్లో గ్రామాలకు 7 పైసలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చిందని, తద్వారా దేశానికే తెలంగాణ గ్రామాలు ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు.
స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదని విమర్శించారు. సర్పంచుల పదవీకాలం ముగిసిందని, ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం కూడా ముగుస్తోందని, స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రతి గ్రామానికి ఒక చెత్త సేకరణ ట్రాక్టర్ కేటాయించామని చెప్పారు. పంచాయతీ అవార్డుల్లో ఎక్కవ భాగం తెలంగాణ గ్రామాలకే వచ్చేవని వెల్లడించారు. గ్రామ పంచాయతీలకు ఉద్యోగుల జీతం ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
దావోస్‌కు వెళ్తే డబ్బులు దండగా అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎందుకు వెళ్లారు : హరీశ్‌రావు
ట్రాక్టర్ల డీజిల్‌కు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. చాలా పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదు. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ప్రజలు రోగాలతో ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో ప్రతి ఏటా పల్లెలకు 3300, పట్టణాలకు 1700 కోట్లు ఖర్చు చేసింది. మా కంటే ఇంకా బాగా చేస్తారని ప్రజలు మీకు ఓట్లు వేశారు. కానీ, ప్రభుత్వంలో చలనం లేదు. బాధ్యత లేకుండా పరిపాలన కొనసాగిస్తుంది. హరీశ్ రావు, బీఆర్ఎస్ మాజీ మంత్రి
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మిన నిరుద్యోగులను నిలువునా ముంచారని హరీశ్ రావు విమర్శించారు. ఆంక్షలు తప్ప ఫించన్లు లేవని, రెండు నెలల పింఛన్ బాకీ పడిందని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కు ఓటేసిన పాపానికి, నేతల దాష్టీకానికి రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభాకర్ ఆత్మహత్య దురదృష్టకరమని, రాష్ట్రంలో ఎంత విషాదకర పరిస్థితులు ఉన్నాయో దీన్ని బట్టి అర్థం అవుతోందన్నారు. ప్రభాకర్ చెప్పిన పేర్లతో తండ్రి ఫిర్యాదు ఇస్తే పోలీసులు తీసుకోవడం లేదని ఆరోపించారు.
ప్రభాకర్ చావుకు కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఎవరైనా స్పందించి ఉంటే ఆయన బతికి ఉండేవారన్నారు. రైతుల తరపున పోరాడతాం కాపాడుకుంటామని, ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభాకర్ మృతి కారణమైన వారిని అరెస్ట్ చేసి, ఆ భూమి కుటుంబానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. 25 లక్షల పరిహారంతో పాటుగా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు.
ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట - అధికారంలో ఉంటే మరో మాట: హరీష్ రావు - Harish Rao letter to Congress govt