ETV Bharat / state

లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణుల సమాయత్తం - వచ్చే నెలలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా భేటీలు

BRS Focus on Parliament Elections 2024 : లోక్‌సభ ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేస్తూనే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు భారత రాష్ట్ర సమితి సిద్ధమవుతోంది. వచ్చేనెల మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో సమావేశాలు జరగనున్నాయి. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణే ఎజెండాగా పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోనుంది. క్షేత్రస్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు కమిటీల ఏర్పాటుతోపాటు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించేందుకు గులాబీ పార్టీ సన్నద్ధమవుతోంది.

BRS Meeting in Hyderabad
BRS Focus on Parliament Elections 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 23, 2024, 7:40 AM IST

లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణుల సమాయత్తం

BRS Focus on Parliament Elections 2024 : అసెంబ్లీ పోరులో హ్యాట్రిక్ విజయంపై కన్నేసి ఓటమి పాలైన భారత రాష్ట్ర సమితి త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సర్వశక్తులు కూడదీసుకుంటోంది. అందులో భాగంగా లోక్‌సభ నియోజవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించింది. సోమవారంతో సన్నాహక సమావేశాలు ముగిశాయి. ఒక్కో అసెంబ్లీ నియోజవకవర్గం నుంచి సగటున 70 నుంచి వంద మంది వరకు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు సమావేశాలకు హాజరయ్యారు. సమావేశాలకు వచ్చిన నేతలు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు.

హైదరాబాద్ బీఆర్ఎస్ నేతల్లో వర్గపోరు - ప్రాధాన్యం లేకుండా ఎన్నాళ్లు పనిచేయాలంటూ అసహనం

BRS Meeting in Hyderabad : శాసనసభ ఎన్నికల్లో ఓటమి కారణాలను తెలుసుకోవడం, పార్టీని బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్ కార్యచరణపై సమావేశాల్లో ప్రధానంగా దృష్టి సారించారు. కొద్ది మంది నేతలు సమావేశంలో బహిరంగంగా తమ అభిప్రాయాలు తెలపగా మిగిలిన వారు లిఖితపూర్వకంగా ఇచ్చారు. సమావేశాల్లో వచ్చిన అభిప్రాయాల ఆధారంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునే దిశగా కార్యాచరణ అమలు చేసేందుకు గులాబీ పార్టీ సిద్ధమైంది. అన్ని స్థాయిల్లోనూ పార్టీ కమిటీలను పునర్వ్యవస్థీకరిస్తామని కార్యకర్తలు, ఉద్యమకారులకు తగిన గుర్తింపు కల్పిస్తామని ముఖ్యనేతలు హామీ ఇచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయాలను క్రియాశీలం చేయడం, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం వంచి కార్యక్రమాలు చేపట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది.

"మావల్ల జరిగిన లోపాలను తెలుసుకున్నాము. నూతన ఉత్సాహంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ, హక్కుల కోసం పోరాడే పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకుంటామని కార్యకర్తలు చెప్పారు. ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటారు."-మధుసూదనాచారి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ

'కారు' సర్వీసింగ్‌కు వెళ్లింది - త్వరలోనే హైస్పీడ్​తో దూసుకొస్తుంది : కేటీఆర్

BRS Focus on Lok Sabha Elections 2024 : తొమ్మిదిన్నరేళ్లు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం, కాంగ్రెస్ హామీలు, వాటి అమలులో లోపాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యనేతలు దిశానిర్దేశం చేశారు. స్వేదపత్రంలోని అంశాలను చెప్పడంల, హామీల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేని లోటు క్షేత్రస్థాయిలో తెలిసివస్తోందని నేతలు వివరించారు.

శాసనసభ ఎన్నికల్లో స్వల్ప తేడాతో పార్టీ ఓటమి పాలైందని నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేస్తే లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకోవచ్చని పేర్కొన్నారు. లోక్‌సభలో బీఆర్ఎస్ సభ్యులు ఉండాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ, హక్కుల కోసం పోరాటం కేవలం గులాబీ పార్టీతోనే సాధ్యమనే విషయాన్ని విడమర్చి చెప్పాలని పేర్కొన్నారు.

BRS Focus on Parliament Poll 2024 : వచ్చేనెల తొలివారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. సీనియర్ నేతల బృందాలు ఆ సమావేశాలకు పరిశీలకులుగా హాజరు కానున్నారు. తద్వారా శ్రేణులను లోక్‌సభ ఎన్నికలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం చేసేలా కార్యాచరణ అమలు చేయనున్నారు.

నేటితో ముగియనున్న బీఆర్‌ఎస్ లోక్‌సభ సన్నాహక సమావేశాలు

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు ఓటేస్తే మూసీలో వేసినట్లే : కిషన్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.