ETV Bharat / state

బయ్యారంలో వెంటనే ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలి : వినోద్​ కుమార్​ - Vinod Kumar On Bayyaram Steel Plant

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 10, 2024, 7:21 PM IST

BRS Vinod Kumar On Bayyaram Steel Plant : భద్రాద్రి మీదుగా కొత్త రైల్వేలైన్​కు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినందున వెంటనే బయ్యారంలో స్టీల్ ​ప్లాంట్​ను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్​ నేత వినోద్​ కుమార్​ డిమాండ్​ చేశారు. తద్వారా 4 వేల మందికి ప్రత్యక్షంగా, 10 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే మాత్రమే రాష్ట్రానికి ఈ రైల్వే లైన్​ ఉపయోగపడుతుందని తెలిపారు.

BRS Vinod Kumar On Bayyaram Steel Plant
BRS Vinod Kumar On Bayyaram Steel Plant (ETV Bharat)

BRS Vinod Kumar On Bayyaram Steel Plant : భద్రాచలం - మల్కన్​గిరి రైల్వే లైన్​కు అనుమతుల దృష్ట్యా వెంటనే బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. రైల్వే లైన్ లేకపోవడం వల్లనే బయ్యారానికి ఉక్కు కర్మాగారం రావడం లేదని, ఛత్తీస్​గఢ్​లోని బైలదిల్లా విశాఖ కన్నా బయ్యారంకే దగ్గర అని పేర్కొన్నారు.

బయ్యారంలో ఉక్కు కర్మగారం ఏర్పాటు చేయాలి : బయ్యారంలో 300 మిలియన్ టన్నుల ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని గతంలోనే సెయిల్ ప్రాతిపాదించిందన్న ఆయన అక్కడ ఫ్యాక్టరీ వస్తే 4000 మందికి ప్రత్యక్షంగా, పదివేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని వివరించారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తేనే ఈ రైల్వే లైన్ తెలంగాణకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కొత్త రైల్వే లైన్ ఖనిజ సంపదను గుజరాత్ తరలించేందుకు ఉపయోగపడేలా మారకూడదని వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు.

విభజన హామీల సాధనకు కృషిచేయాలి : 2030 నాటికి తలసరి ఉక్కు వినియోగాన్ని భారీగా పెంచాలని కేంద్రం 2017లో విధానం తీసుకొచ్చిందని, బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడితేనే ఈ తలసరి వినియోగం పెరుగుతుందని అన్నారు. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో భారీ పరిశ్రమలకు పది పైసలైనా ఇచ్చిందా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ నుంచి గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు విభజన హామీలు నెరవేర్చేందుకు కృషి చేయాలని వినోద్ కుమార్ కోరారు.

భద్రాద్రి మీదుగా కొత్త రైలు మార్గం : ఎనిమిది కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్రమంత్రి వర్గం శుక్రవారమే ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ, మహారాష్ట్ర, ఝార్ఖండ్, బిహార్, బంగాల్​లో వీటిని చేపట్టనున్నారు. అందులో భాగంగానే ఒడిశాలోని మల్కన్​గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు రూ.4,109 కోట్లతో 200.60కి.మీ పొడవైన కొత్తలైన్​ నిర్మాణం జరగనుంది. ఇది సాకారమైతే ఏపీ, తెలంగాణల నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు అనుసంధానం పెరుగుతుంది.

తెలంగాణకు కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ మంజూరు చెయ్యాలి : వినోద్ కుమార్ - BRS Vinod Kumar Comments

తెలంగాణ ఆస్తుల విషయంలో సీఎం రేవంత్​ రాజీ పడొద్దు : వినోద్​ కుమార్​ - Vinod Kumar on CMs Meeting

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.