ETV Bharat / state

ఖమ్మంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య ఘర్షణ - పువ్వాడ కారుపై రాళ్లతో దాడి - BRS CONGRESS MUTUAL ATTACKS IN KMM - BRS CONGRESS MUTUAL ATTACKS IN KMM

BRS Congress Attacks in Khammam : ఖమ్మం నగరంలో వరద బాధితులను పరామర్శించే క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకేసారి రెండు పార్టీల కార్యకర్తలు ఎదురు పడటంతో గట్టిగా నినాదాలు చేసుకుంటూ చివరకు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.

BRS Congress Attacks
BRS Congress Attacks (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 3, 2024, 3:40 PM IST

Updated : Sep 3, 2024, 3:48 PM IST

BRS Congress Mutual Attacks in Khammam : ఖమ్మం నగరం బొక్కలగడ్డలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వరద బాధితులను పరామర్శించేందుకు గులాబీ నేతలు మాజీ మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు వచ్చారు. వారి వెంటే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అక్కడే ఉండటంతో గులాబీ శ్రేణులను చూసి వారు నినాదాలు చేయడం మొదలుపెట్టారు. అలా ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పర నినాదాలు చేస్తూ అది కాస్త గొడవకు దారి తీయడంతో రాళ్లు రువ్వుకున్నారు.

మాజీ మంత్రుల వాహనంపై రాళ్ల దాడి : ఈ క్రమంలో పువ్వాడ, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, నామ వెళ్తున్న కారుపైనా కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో నేతలకు ఎలాంటి గాయాలు కాలేదు కానీ రాళ్ల దాడిలో పువ్వాడ అజయ్ కారు మాత్రం ధ్వంసం అయింది. కాంగ్రెస్ కార్యకర్తల దాడిని బీఆర్ఎస్ నేతలు ఖండించారు. వరద బాధితులను పరామర్శించేందుకు వస్తే ఇలా దాడులకు తెగబడుతున్నారంటూ ఆరోపించారు. దీనికి సీఎం రేవంత్ సాబ్ ఏం సమాధానమిస్తారంటూ ధ్వజమెత్తారు.

'ఇది ప్రకృతి తెచ్చిన విపత్తు కాదు - అధికార పార్టీ తెచ్చిన విపత్తు' - brs inspect Flood Affected Areas

KTR Slams Congress Over Attack on BRS : ఖమ్మంలో బీఆర్ఎస్‌ నేతలపై దాడిని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రులపై కాంగ్రెస్ చేసిన దాడులపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ, సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై దాడి చేయటం కాంగ్రెస్ అసహనానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజలకు సాయం చేయటం చేతగాక, సాయం చేస్తున్న వాళ్లను చూసి ఓర్వలేకే ఈ దాడికి తెగబడ్డారని ధ్వజమెత్తారు.

రాళ్ల దాడిపై కేటీఆర్ ఫైర్ : మీరు ప్రజలను నిర్లక్ష్యం చేస్తే వారికి అండగా ఉండటమే తప్పా అని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ప్రజలకు సేవ చేయటం చేతకాదు...సేవ చేసే వాళ్లపై మాత్రం దాడి చేయటం సిగ్గుచేటు అంటూ తీవ్రంగా దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నేతలపై దాడికి ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఎన్ని దాడులు చేసినా ప్రజల వద్ద బీఆర్ఎస్ శ్రేణులను వెళ్లకుండా ఆపలేరని పేర్కొన్నారు. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలనను ప్రజలు గమనిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. సరైన సమయంలో బుద్ధి చెప్పటం ఖాయమని కేటీఆర్ అన్నారు.

'ఆక్రమణల వల్లే ఖమ్మంలో వరదలు - త్వరలోనే రాష్ట్రానికి ప్రత్యేక విపత్తు నిర్వహణ సంస్థ' - CM REVANTH REDDY ON FLOODS

వరద బాధితుల కోసం కదిలిన ఉద్యోగ జేఏసీ - విరాళంగా రూ.130కోట్లు - TELANGANA EMPLOYEES JAC DONATION

Last Updated : Sep 3, 2024, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.