ETV Bharat / state

పెట్రోల్ పోస్తుండగా నిప్పంటించిన ఆకతాయిలు - ఆ తరువాత ఏమైందంటే? - MALLAPUR PETROL BUNK FIRE ACCIDENT

మల్లాపూర్‌ ఇండియన్‌ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో తప్పిన ప్రమాదం -బైక్‌లో పెట్రోలు పోస్తుండగా నిప్పు పెట్టిన ఆకతాయిలు -మంటలను అదుపు చేసిన బంక్‌ సిబ్బంది

Mallapur Petrol Bunk Fire Accident
Mallapur Petrol Bunk Fire Accident (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 26, 2024, 10:50 PM IST

Mallapur Petrol Bunk Fire Accident : హైదరాబాద్​లో ఆకతాయిల చేష్టలు మితిమీరిపోతున్నాయి. మద్యం మత్తులో, డ్రగ్స్ మత్తులో వారేం చేస్తున్నారో వారికే తెలియదు. ఆ మైకంలో ఇతరులపై దాడి చేయడం, డబ్బుల కోసం బెదిరించడం, పక్కవారిని అల్లరి చేయడం, బైకులు, కార్లలో వేగంగా వెళ్లి రోడ్డున పోయేవారిని బెదరగొట్టడం లాంటి ఘటనలు మనం చాలానే వింటున్నాం. కానీ ఇవాళ ఈ ఆకతాయిలు చేసిన ఘటన ఊహించుకుంటేనే వెన్నులో వణుకు తెప్పించింది.

నాచారం పోలీస్​ స్టేషన్ పరిధిలో ఇవాళ సాయంత్రం మల్లాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వాహనదారులతో రద్దీగా ఉంది. బంక్ సిబ్బంది బిజీగా ఉన్నారు. ఈ సమయంలో స్కూటీపై వచ్చిన యువకులు పెట్రోలు కావాలన్నారు. సిబ్బంది పెట్రోల్ నింపుతుండగా అందులో ఓ యువకుడు ఒక్కసారిగా జేబులో ఉన్న లైటర్​ తీసి నిప్పంటించాడు. అంతే ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఆ దెబ్బకు అక్కడ ఉన్న వాహనదారులంతా తలోదిక్కుకు పరుగులు తీశారు. అయినా అంతటితో ఆగని ఆ ఆకతాయి, నిప్పు చెలరేగుతుండగానే దానిని మరోవైపు కాలితో నెట్టుతూ పైశాచిక ఆనందం పొందాడు.

మంటలను అదుపు చేసిన బంక్‌ సిబ్బంది : బంక్ సిబ్బంది వెంటనే తేరుకొని అగ్నిమాపక సాధనాలతో మంటలను ఆర్పేశారు. లక్కీగా వెంటనే మంటలు ఆరిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అదే మంటలు పెట్రోల్​ నిల్వచేసే ట్యాంకుకు అంటుకొని ఉంటే ఊహించలేని నష్టం జరిగేది. మంటలు చెలరేగి ఉంటే ఆ సమయంలో బంకులో ఉన్న వారు, రోడ్డుపై ప్రయాణించే వారు, చుట్టుపక్కల వారి ప్రాణాలు పోయేవి. సమాచారం అందుకొని ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు పెట్రోల్​ సిబ్బంది ఫిర్యాదుతో నిందితులను అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు. ఆ యువకులంతా గంజాయి మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

డ్రగ్స్ దందాలో డెడ్‌డ్రాప్‌ పద్ధతి అంటే ఏంటో మీకు తెలుసా?

బల్బులో డ్రగ్స్​ - బెంగళూరు టు హైదరాబాద్​ వయా గుంటూరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.