ETV Bharat / state

బీఆర్​ఎస్​ చేసిన అభివృద్ధి శూన్యం - కాంగ్రెస్​ అయినా చేసి చూపించాలి : కిషన్​రెడ్డి

BJP State Chief Kishan Reddy Fires on Congress : హైదరాబాద్ నగరంలో గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ మాదిరి మాయమాటలు చెప్పకుండా, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజాసేవలో తమ పనితనం చూపించాలని కోరారు.

Minister Kishan Reddy Fires On BRS :
BJP State Chief Kishan Reddy Fires on Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 3, 2024, 1:23 PM IST

Updated : Feb 3, 2024, 2:24 PM IST

BJP State Chief Kishan Reddy Fires on Congress : మాయమాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించి బీఆర్ఎస్ (BRS) పార్టీ ఫామ్​హౌస్​కే పరిమితమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అయినా మాయమాటలు చెప్పకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేయాలని కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్​ నగర్​, బోరబండ, మధురానగర్​ డివిజన్​లలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, గత ప్రభుత్వం కారణంగా నగరంలోని బస్తీలు అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు.

రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి - ఎలాంటి పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలి : కిషన్​రెడ్డి

Minister Kishan Reddy Fires On BRS : హైదరాబాద్​ అంటే హైటెక్ సిటీలు కాదని, పేద ప్రజలను పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పేద ప్రజలను ఆదుకునేది బీజేపీ ప్రభుత్వమని తెలిపారు. దేశ ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Modi) అన్ని విధాలుగా ఆదుకుంటారని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజాసేవను మాటల్లో కాకుండా, పని తనంలో ముందుండి చేయాలని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి హితవు పలికారు.

"నేను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాను. మీరు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారే తప్ప, బస్తీ ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించడం లేదు. హైదరాబాద్ అంటేనే అతిపెద్ద ఆదాయం వచ్చే నగరం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 80 శాతం ఆదాయం కేవలం హైదరాబాద్ నగరం నుంచే వస్తుంది. కానీ హైదరాబాద్​కు కావాల్సిన వనరుల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. జీహెచ్​ఎంసీ (GHMC Funds) హైదరాబాద్​కు మేజర్ కమ్యూనిటీ. కానీ ఇప్పుడు అది కూడా నిధుల కొరతతో ఉంది. నీటి సరఫరా, మెట్రో వర్క్స్​ అన్ని పనులూ నిధుల కొరతతో ఆగిపోయాయి." - కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం - కాంగ్రెస్​ అయినా చేసి చూపించాలి : కిషన్​రెడ్డి

రోడ్డు విస్తరణ, పార్కింగ్ తదితర అంశాలపై రేవంత్ ​రెడ్డికి కిషన్ ​రెడ్డి లేఖ

BJP Focus on Lok Sabha Elections 2024 : మరోవైపు బీజేపీ నాయకులు లోక్​సభ ఎన్నికలపై కార్యాచరణ చేపట్టారు. పార్టీ చేరికలపై దృష్టి సారిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు తెలిపారు. రాష్ట్రంలో డబుల్ డిజిట్ సీట్లు గెలిచే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదంటూ జోస్యం చెప్పారు.

విపక్షాలు పెట్టుకున్న కూటమి అప్పుడే విచ్చిన్నం అవుతోంది : కిషన్​రెడ్డి

వీధి దీపాలు లేవంటూ ఫిర్యాదు - అధికారులపై కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఆగ్రహం

Last Updated : Feb 3, 2024, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.