ETV Bharat / state

హైదరాబాద్​లో 260 చెక్ పాయింట్స్ పెట్టారంట - మందుబాబులారా జర జాగ్రత్త - NEW YEAR CELEBRATIONS IN HYDERABAD

హైదరాబాద్​లో న్యూ ఇయర్ వేడుకలపై నిఘాపెంచిన పోలీసులు - ఎక్కడికక్కడ డ్రంకన్‌ డ్రైవ్, డ్రగ్‌ డిటెక్షన్‌ పరీక్షలు

New year Celebrations In Telangana
New year Celebrations In Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 31, 2024, 8:33 AM IST

New year Celebrations In Hyderabad : నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా పోలీసులు హైదరాబాద్​లో పలు ఆంక్షలను విధించారు. ఎలాంటి రోడ్డు ప్రమాదాలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ ​శాఖ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవాప్తంగా జరిగే కొత్త సంవత్సర వేడుకలపైన పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రంకన్‌ డ్రైవ్, డ్రగ్‌ డిటెక్షన్‌ పరీక్షలు చేయడంతో పాటు, ర్యాష్ డ్రైవింగ్‌, ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

మహిళలకు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు : నగరంలో 3 కమిషనరేట్​ల పరిధిలో నూతన సంవత్సర వేడుకల కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. నిర్వాహకులకు ప్రత్యేకంగా పోలీసులు కొన్ని నియమ నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. వేడుకలకు వచ్చే మహిళలకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయాలంటూ సూచించారు. వేడుక నిర్వహించే ప్రదేశంలో అన్ని సీసీ కెమెరాలు పని చేసే విధంగా పెట్టాలన్నారు. భారీగా వేడుకలు నిర్వహించే నిర్వాహకులకు కొన్ని ప్రత్యేక సూచనలు తెలియజేశారు. వేడుకకు వచ్చే ప్రజలకు ప్రత్యేకంగా ఎంట్రీ, ఎగ్జిట్లను ఏర్పాటు చేయడంతో పాటు పార్కింగ్ స్థలాలను అణువుగా ఉండే విధంగా చూసుకోవాలని వివరించారు.

హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకలు : హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మరింత కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ప్రతి పోలీస్‌ స్టేషన్ పరిధిలో 5 చెక్‌పాయింట్లు ఏర్పాటు చేశారు. డ్రంకన్ డ్రైవ్ తనిఖీల కోసం ఎస్‌ఐ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు పని చేస్తాయని అధికారులు తెలిపారు.

డ్రగ్స్, గంజాయి వంటి నిషేధిత పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని అధే విధంగా డ్రగ్ డిటెక్షన్ టెస్టింగ్ కిట్లను అందుబాటులో ఉంచామని వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్​తో పాటు జిల్లాలో కూడా డ్రగ్ డిటెక్షన్ పరీక్షలను నిర్వహించనున్నారు నగరంలో వేడుకలకు ఇచ్చిన సమయం దాటిన తర్వాత ఈవెంట్స్ నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని లైసెన్స్ రద్దు చేస్తామన్నారు.

ప్రత్యేక నిఘా : హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 260 చెక్‌ పాయింట్స్ ఉన్నాయి. ఫ్లైఓవర్స్‌, ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌రోడ్స్ మూసి వేస్తామని అధికారులు వెల్లడించారు. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేక నిఘా పెట్టారు. మొత్తం 59 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్‌ లిమిట్స్‌లో దాదాపు 260 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేయనున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌, బేగంపేట్‌, సైఫాబాద్‌, సైబరాబాద్‌ పరిధిలో ఒక్కో ఠాణా పరిధిలో 5 నుంచి 7 చెక్‌పోస్ట్‌లను ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ పోలీసులతో పాటు టీ న్యాబ్‌ పోలీసులు జాయింట్ ఆపరేషన్స్ చేయనున్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు : పబ్స్‌, శివారు ప్రాంతాల్లోని రిసార్ట్స్‌ సహా డ్రగ్స్, గంజాయి హాట్‌స్పాట్స్‌ గుర్తించిన ఏరియాల్లో పోలీసులు మఫ్టీలో నిఘా పెట్టనున్నారు. రాత్రి 8 గంటల నుంచే డ్రంక్‌ అండ్ డ్రైవ్ తనిఖీలను పోలీసులు చేయనున్నారు. మంగళవారం తెల్లవారుజామున 7 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను చేయనున్నారు. ఓఆర్‌‌ఆర్‌‌పై ఎయిర్‌‌పోర్ట్‌కు వెళ్లే వాహనదారులకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించారు. సిటీలోని లంగర్‌‌హౌస్‌, బేంగంపేట్ ఫ్లైఓవర్ మినహా అన్ని ఫ్లై ఓవర్స్‌ మూసివేయనున్నారు.

ఐటీ ప్రాంతంలో 61 వేడుకలు : నగరంలో ప్రసిద్ధి చెందిన ఐటీ ప్రాంతంలో 61 వేడుకలను నిర్వహిస్తున్నట్లు మాదాపూర్ డిసీపీ వెల్లడించారు. 20 కమ్యూనిటీలో నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్నాయని తెలిపారు. ఐడీ కార్డ్ ఆధారంగా ఈవెంట్స్‌కు అనుమతించాలని నిర్వాహకులకు సూచించారు. వేడుకలు భాగంగా మైనర్లకు మద్యం ఇవ్వకూడదని సూచించారు. చాలా ప్రాంతాల్లో నివాసముండే ప్రదేశాల్లో వేడుకలను నిర్వహిస్తున్నారు కాబట్టి డీజే శబ్దాలను స్థానికులకు ఇబ్బంది కలిగించకూడదని వివరించారు. మహిళల భద్రతకు ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి తెలిపారు. క్యాబ్, టాక్సీ, ఆటో డ్రైవర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

హైదరాబాద్​లో న్యూ ఇయర్​ సెలబ్రేషన్స్​ - ప్రత్యేక ఆకర్షణగా సినీ తారలు, డీజేలు

రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు : సీపీ అవినాశ్ మహంతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.