BJP MP Konda Vishweshwar Reddy On Lok Sabha Election Results : కేసీఆర్ తెలంగాణాను అప్పులకుప్పగా మార్చారని అందుకే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు రాలేదని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. బీజేపీ నాయకులు కార్యకర్తలు కలిసి పని చేయడం వల్ల చేవెళ్లవో విజయం సాధించామని వారికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు మోదీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మారుస్తారని తప్పుడు ప్రచారం చేశారని వాటిని నమ్మకుండా ప్రజలు బీజేపీకే ఓట్లు వేశారని తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని పోలీసులు కూడా బాగా పని చేశారని అభినందించారు.
మెదక్‌లో డబ్బులు, మద్యం పని చేయలేదని బీజేపీ, రఘునందన్ రావును చూసి గెలిపించారని తెలిపారు. భవిష్యత్తు ఎన్నికల్లోనూ మద్యం, డబ్బులులేని ఎన్నికలు జరగాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఇదే ఊపుతో సర్పంచ్, స్థానిక సంస్థలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పని చేస్తామని తెలిపారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం వస్తుందని అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిస్తూనే ముందుకు సాగుతామని తెలిపారు. కేసీఆర్ తెలంగాణాను అప్పులకుప్పగా మార్చారని అందుకే ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో బుద్ది చెప్పారని విమర్శించారు. తన వంతుగా కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రాజెక్టులు, నిధులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు.
దేశంలోనే ఆదర్శ ఎంపీగా నడుచుకుంటా : సంకీర్ణ ప్రభుత్వమైనప్పటికీ మోదీ విధానాల్లో మార్పు ఉండదని తెలిపారు. రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేయాలని సూచించారు. దేశంలోనే ఆదర్శ ఎంపీగా నిలిచేలా నడుచుకుంటానని కేంద్ర మంత్రి అయితే నియోజకవర్గ ప్రజలకు దూరమైతా కానీ నా పరిజ్ఞాన్నాన్ని పంచగలనని వివరించారు. అధిష్ఠానం ఏ అవకాశం ఇచ్చిన దానికి కట్టుబడి ఉంటానని తెలిపారు.
"మెదక్‌లో రూ. కోట్లు ఖర్చు చేసినా బీఆర్ఎస్ గెలవలేదు. ఇదే ఊపుతో సర్పంచ్, స్థానిక సంస్థలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పని చేస్తాం. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిస్తూనే ముందుకు సాగుతాం. పార్టీలు వేరైనప్పటికీ రాష్ట్రాభివృద్ధికి పాటుపడతాం. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి వెళ్లిపోయింది’’ -కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ ఎంపీ