BJP Leaders Slams Congress : అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులు సార్వత్రిక పోరులో పునరావృతం కాకుండా బీజేపీ పకడ్బందీ ప్రణాళికలతో సాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ లక్ష్యంగా విమర్శలకు పదునుపెట్టింది. కాంగ్రెస్ పాలన వచ్చాక కరవు, కరెంట్ కోతలు వచ్చాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో జరిగిన కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు, కార్యకర్తలకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనను, పదేళ్ల మోదీ పాలనను బేరీజు వేసుకోని ఓట్లేయాలని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Etela Rajender Counter To Minister Komatireddy : కాంగ్రెస్‌తో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలకు మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘాటుగా బదులిచ్చారు. తాము తలుచుకుంటే 60 మంది కాంగ్రెస్ శాసనసభ్యులను టచ్‌లోకి తీసుకోగలమని స్పష్టంచేశారు. మల్కాజిగిరిలోని ఓ కల్యాణ మండపంలో బూత్‌స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచిన రేవంత్‌రెడ్డి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని ఈటల విమర్శించారు.
రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డిని చూసి ఓటేయలేదు - డీకే అరుణ - Lok Sabha Election 2024
బీఆర్ఎస్ మునిగిపోతున్న నౌక : బీఆర్ఎస్ మునిగిపోతున్న నౌక లాంటిదని మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు. చేవెళ్లలో రంజిత్ రెడ్డి నుంచి వరంగల్‌లో కడియం కావ్య వరకు ప్రకటించిన అభ్యర్థులంతా పార్టీని వీడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలను గెలిచి మోదీకి కానుకగా ఇస్తామన్నారు. గల్లీలో ఎవరున్నా దిల్లీలో మోదీనే ఉండాలని ప్రజలు కోరుకుంటన్నట్లు రఘునందన్ వివరించారు.
ప్రపంచమంతా భారత్ వైపు చూసేలా ప్రధాని మోదీ పని చేస్తున్నారని వరంగల్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బూత్ లెవల్ కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆరూరి రమేశ్ హాజరయ్యారు. తనను గెలిపిస్తే హసన్‌పర్తి నుంచి భూపాలపల్లికి రైల్వేలైన్ ఏర్పాటు, సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం సహా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని తెలిపారు.
కాంగ్రెస్‌కు 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉంటే బీజేపీకి 60 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్‌లోకి తీసుకోవడం పెద్ద విషయం కాదు. కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలకు హద్దు లేకుండా పోతున్నాయి.కేసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం డబ్బుతో నాయకులను, కార్యకర్తలను కొనుగోలు చేస్తుంది. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనను, పదేళ్ల మోదీ పాలనను బేరీజు వేసుకొని ఓట్లు వేయాలి. దేశ ప్రజలు నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. - బీజేపీ నాయకులు
మనసులు గెలిచేలా బీజేపీ మేనిఫెస్టో - సబ్బండ వర్గాలను ఆకట్టుకునేలా రూపకల్పన - lok sabha elections 2024