ETV Bharat / state

స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు - రేపు రాష్ట్ర కార్యవర్గ సమావేశం - BJP Focus On LocalBody Elections - BJP FOCUS ON LOCALBODY ELECTIONS

BJP Focus On Local Body Elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటిన కాషాయ పార్టీ త్వరలో జరగబోయే స్థానిక సంస్థలను లక్ష్యంగా పెట్టుకుంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడుకు మూకుతాడు వేసినట్లే లోకల్ బాడీ ఎన్నికల్లోనూ వేయాలని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల వల్లే గ్రామీణ ప్రాంత అభివృద్ధి సాధ్యమైందనేది బలంగా తీసుకెళ్లేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు అనుకున్న స్థాయిలో కేటాయింపులు చేయలేదని కాంగ్రెస్‌ క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్లింది. ఈ పరిస్థితుల్లో స్తానిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలనే ప్రణాళికలను రచించేందుకు రేపు బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం నిర్వహిస్తోంది.

BJP Focus On Local Body Elections 2024
Telangana Local Body Elections 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 5, 2024, 7:27 PM IST

BJP Focus On Local Body Elections In Telangana : రాష్ట్రాభివృద్ధికి పట్టుకొమ్మలే గ్రామాలు ఆ గ్రామాల్లో కాషాయజెండా ఎగరవేస్తే రాష్ట్ర పీఠాన్ని సునాయసంగా కైవసం చేసుకోవచ్చని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అధికార పార్టీకి ధీటుగా బీజేపీ ఎనిమిది స్థానాలను సొంతం చేసుకుంది. అధికార పార్టీకి సమానంగా సీట్లు సాధించిన బీజేపీ వచ్చే లోకల్‌ బాడీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఊవ్విల్లారుతోంది. ఈ ఎన్నికల్లో అత్యధిక గ్రామ పంచాయతీలను తమ ఖాతాలో వేసుకోవాలని ప్లాన్‌ చేస్తుంది. రాష్ట్రంలో గ్రామ స్థాయిలో బీజేపీ బలహీనంగా ఉంది. దీనిని అధిగమించేందుకు స్థానిక సంస్థల ఎన్నికలను ఉపయోగించుకుని 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేపట్టాలని సుదీర్ఘమైన ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు సమాయత్తమవుతోంది.

తెలంగాణకు కేంద్ర నిధలు : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్​కు భారీగా కేటాయింపులు చేసి తెలంగాణకు ఆశించిన స్థాయిలో నిధులు ఇవ్వకపోవడంతో బీజేపీయే కాంగ్రెస్​కు విమర్శనాస్త్రం అందించినట్లయింది. ఈ అంశంపై శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ సంధిస్తూ వచ్చింది. తెలంగాణపై కాషాయ పార్టీకి సవతి తల్లి ప్రేమ అంటూ నాయకులు విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చిందనే వ్యంగ్యాస్త్రాలతో కూడిన ఫ్లెక్సీలు వేసింది. దీంతో ఈ అంశం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని ఎనిమిది సీట్లలో గెలిపించి తప్పు చేశామనే భావన కలిగేలా కాంగ్రెస్‌ పార్టీ విస్తృతంగా తీసుకెళ్లింది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గాడిద గుడ్డు అస్త్రాన్ని ప్రయోగించి సఫలీకృతమైంది. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ సందర్భంగా మరోసారి గాడిద గుడ్డు అంశాన్ని హస్తం పార్టీ తెరపైకి తీసుకొచ్చింది.

ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ ఆరోపణలను తిప్పికొట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లా లబ్ధిపొందాలనే అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశాన్ని రేపు నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో హార్‌ఘర్‌ తిరంగాతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థితులపైన సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యదిక సీట్లు గెలిచే విధంగా కార్యాచరణ రూపకల్పన చేయనన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతుందా : గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంచి సీట్లు, ఓట్లతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీకి ధీటుగా సీట్లను సాధించి ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగామని అధిష్ఠానం భావిస్తోంది. తదనుగుణంగా వ్యూహాలను రచిస్తోంది. నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన పార్టీ సంస్థాగత ప్రధానకార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ సైతం త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నందున, వాటిపై దృష్ఠి సారించాలని గ్రామాల్లోనూ పార్టీ బలోపేతానికి కృష్టి చేయాలని దిశానిర్ధేశం చేశారు. పార్టీ బలహీనంగా ఉన్నచోట మరింత కష్టపడి పనిచేయాలని సూచించినట్లు సమాచారం. పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల తరహాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతుందా లేక కేంద్ర బడ్జెట్‌ అంశాన్ని తిప్పికొట్టకుండా బోల్తాపుడుతోందా అనేది అటు కాషాయ శ్రేణులతో పాటు రాజకీయవర్గాల్లోనూ ఒక చర్చనడుస్తోంది.

'6 గ్యారంటీలు, 66 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ - 9 నెలల్లోనే ప్రజల విశ్వాసం కోల్పోయింది' - Etela Rajender Fires On CM Revanth

ముచ్చర్లను నాల్గో నగరంగా ప్రకటించడం ద్వారా ఏం సంకేతాలు ఇచ్చారు : కాటిపల్లి - MLA katipally on CM Revanth Reddy

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.