ETV Bharat / state

తెలంగాణ విమోచన దినోత్సవాలు నిర్వహించకుండా దిగజారుడు రాజకీయాలు : కిషన్ రెడ్డి - Telangana Liberation Day 2024

Central Minister Kishan Reddy On Telangana Liberation Day 2024 : కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రజాకార్ల వారసత్వమైన మజ్లిస్ పార్టీకి కొమ్ముకాస్తూ తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిన సెప్టెంబర్‌ 17ను పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

BJP Organised Telangana Liberation Day 2024
Central Minister Kishan Reddy On Telangana Liberation Day 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 17, 2024, 10:18 AM IST

Central Minister Kishan Reddy On Telangana Liberation Day 2024 : సెప్టెంబర్ 17 నియంతృత్వ నిజాం నుంచి తెలంగాణకు విమోచనం లభించిన రోజని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వేలాది మంది తెలంగాణ ప్రజలు విరోచిత పోరాటం చేశారని, అనేక బలిదానాలు, అనేక త్యాగాల అనంతరం తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందని గుర్తు చేశారు. నిజాం రజాకార్ల మెడలు వంచి తెలంగాణ సాధించడంలో పటేల్ పాత్ర సాహసోపేతమైందన్నారు.

లిబరేషన్ డే ఉత్సవాలు, విశ్వకర్మ జయంతి ఉత్సవాలు, వినాయక శోభాయాత్ర ఉత్సవాలు, ప్రధాని నరేంద్ర మోదీ జయంతి ఉత్సవాలు నాలుగు ప్రధాన ఘట్టాలు ఒకేసారి రావడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిన సెప్టెంబర్‌ 17ను పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురువేసిన కిషన్‌రెడ్డి, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

BJP Organised Telangana Liberation Day 2024 : గత మూడేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహిస్తుందని కేంద్ర మంతి కిషన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రజాకార్ల వారసత్వమైన మజ్లిస్ పార్టీకి కొమ్ముకాస్తూ, అడుగులకు మడుగులొత్తుతూ తెలంగాణ ప్రజలను మోసం చేశాయని మండిపడ్డారు. తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించకుండా రెండు పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దుర్మార్గమైన రాజకీయాలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

"కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రజాకార్ల వారసత్వమైన మజ్లిస్ పార్టీకి కొమ్ముకాస్తున్నాయి. తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ దుర్మార్గమైన రాజకీయాలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్ధం కావాలి. లిబరేషన్ డే ఉత్సవాలు, విశ్వకర్మ జయంతి ఉత్సవాలు, వినాయక శోభా యాత్ర ఉత్సవాలు, ప్రధాని నరేంద్ర మోదీ జయంతి ఉత్సవాలు నాలుగు ప్రధాన ఘట్టాలు ఒకేసారి రావడం సంతోషంగా ఉంది." - కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి

పరకాల అమరధామం : నిజాం నిరంకుశానికి నిలువెత్తు రూపం - నాటి అమరవీరుల త్యాగాలకు చిహ్నం - Parakala Amaradhamam

సెప్టెంబర్‌ 17 : ఇటు ప్రభుత్వ 'ప్రజా పాలన' - అటు బీజేపీ విమోచన దినోత్సవం - Praja Palana Day Celebrations

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.