ETV Bharat / state

ఆ బడిలో ఐదుగురు విద్యార్థులు - వారి కోసం ఏడుగురు పంతుళ్లు - Bijigiri Sharif Govt High School

Bijigiri Sharif Govt High School : పాఠశాల అనగానే విద్యార్థులు, ఉపాధ్యాయులతో సందడిగా కనిపిస్తుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో దీనికి భిన్నంగా ఉంటుంది. కొన్నిచోట్ల ప్రభుత్వ బడులలో ఉపాధ్యాయులు ఉంటే విద్యార్థులు ఉండరు. విద్యార్థులు ఉంటే టీచర్ల కొరత ఉంటుంది. కానీ ఈ పాఠశాలలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ ఐదుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు పాఠాలు చెబుతుండడం గమనార్హం.

Seven Teacher For Five Student In Karimnagar
Seven Teacher For Five Student
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 18, 2024, 11:09 AM IST

Bijigiri Sharif Govt High School : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడం కోసం తెలంగాణ సర్కార్​ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. తద్వారా కొన్ని బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరగగా, మరికొన్ని చోట్ల అందుకు భిన్నంగా ఉంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరనే ఫిర్యాదులే ఎక్కువగా వినిపిస్తుంటాయి. కానీ ఆ బడిలో కేవలం ఐదుగురు విద్యార్థులు. కానీ వారికి పాఠాలు భోదించే ఉపాధ్యాయలు మాత్రం ఏడుగురు. ఇంతకీ ఆ పాఠశాల ఎక్కడా అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

చదువుకున్న పాఠశాలలోనే ఉపాధ్యాయులుగా పని చేస్తున్న పూర్వ విద్యార్థులు

Seven Teachers for Five Students in Karimnagar District : కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో మాత్రం ఐదుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. పిల్లలు లేక 9, 10వ తరగతులు కొనసాగడం లేదు. మొత్తంగా ఆరో తరగతిలో 2, ఏడులో ఒకరు, ఎనిమిదో తరగతిలో ఇద్దరు విద్యార్థులున్నారు. వీరిలోనూ రోజూ ఇద్దరు లేదా ముగ్గురే హాజరవుతున్నారు. 2022-23లో ఇక్కడ 18 మంది ఉండేవారు.

గత సంవత్సరం నలుగురు పదో తరగతి పూర్తి చేశారు. ఈసారి పదో తరగతికి రావాల్సిన ఒక్కరు కూడా సమీపంలోని కోరపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో (Govt High School) ప్రవేశం పొందాడు. మిగతా వారూ ఇతర పాఠశాలలకు వెళ్లిపోయారు. తక్కువ మంది విద్యార్థులు ఉండటంతో ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని నిర్వాహకుడు ఇంటి వద్దే తయారు చేసి తెస్తున్నారు. అయితే ఇద్దరు ఉపాధ్యాయులు ఇతర ప్రాంతాలకు బదిలీ అయినా అక్కడి ఉపాధ్యాయులు రిలీవ్‌ కాకపోవటంతో ఇక్కడే కొనసాగుతున్నారు. ఇదే ఆవరణలోని ప్రాథమిక పాఠశాలలో మాత్రం 30 మంది విద్యార్థులు ఉండటం విశేషం. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పెంచేందుకు కృషి చేస్తామని ప్రధానోపాధ్యాయురాలు హేమలత పేర్కొన్నారు.

Government Schools in Telangana : ఒకప్పుడు పిల్లలతో ప్రభుత్వ పాఠశాలలు పిల్లలతో కళకళలాడుతుండేవని విద్యావేత్తలు అంటున్నారు. కానీ ప్రైవేట్ బడుల రాకతో సర్కార్ పాఠశాలల్లో పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థుల సంఖ్య పెంచే దిశగా కార్యక్రమాలు చేపట్టాలని సూచిస్తున్నారు.

విధుల పట్ల అలసత్వం.. ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెండ్​

students Work in Mahbubabad: స్కూల్‌ పిల్లలే.. అక్కడ పని పిల్లలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.