ETV Bharat / state

భక్తులకు శుభవార్త - ఆన్‌లైన్‌లో శ్రీరామనవమి కల్యాణం టికెట్లు - Sri Rama Navami in Bhadradri

Bhadradri Ramaiah Kalyanam Tickets 2024 : భద్రాద్రి సీతారాముల కల్యాణం ఏప్రిల్ 17న జరగనుంది. ఈ సందర్భంగా భక్తులు ఈ కల్యాణాన్ని వీక్షించేందుకు సెక్టార్ టికెట్లను ఈరోజు నుంచి ఆన్​లైన్​లో అధికారులు అందుబాటులో ఉంచారు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 25, 2024, 12:30 PM IST

Bhadradri Ramaiah Kalyanam Tickets 2024 : భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఏప్రిల్‌ 17న శ్రీరామనవమి సందర్భంగా కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. కల్యాణాన్ని వీక్షించేందుకు సెక్టార్‌ టికెట్లను నేటి నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. శ్రీరామనవమి రోజు ఉభయ దాతల టికెట్‌ రుసుము రూ.7,500 కాగా దీనిపై ఇద్దరికి ప్రవేశం ఉంటుంది. రూ.2500, రూ.2000, రూ.1000, రూ.300, రూ.150 టికెట్లపై ఒక్కరికి ప్రవేశం కల్పిస్తారు. 18న పట్టాభిషేక మహోత్సవం సెక్టార్‌ టికెట్ల ధరను రూ.1500, రూ.500, రూ.100గా నిర్ణయించామని ఈవో రమాదేవి తెలిపారు.

Bhadradri Ramaiah Kalyanam 2024 Dates : వీటిని https:-//bhadradritemple.telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చని ఈవో రమాదేవి పేర్కొన్నారు. ఈ రెండు వేడుకల్లో పాల్గొనాలనుకునే భక్తులు ముందస్తుగానే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవాలని సూచించారు. మరోవైపు కల్యాణం (Bhadradri Ramaiah Kalyanam) రోజున ప్రత్యక్షంగా రాలేని భక్తులు పరోక్ష పద్ధతిలో తమ గోత్రనామాలతో పూజ చేయించుకునే వెసులుబాటునూ కల్పించామని వివరించారు. దీనికోసం రూ.5000లు, రూ.1116 టికెట్లనూ ఇదే వెబ్‌సైట్‌ నుంచి బుక్‌ చేసుకోవచ్చని ఈవో రమాదేవి వెల్లడించారు.

అయోధ్య రాఘవుడి ప్రాణప్రతిష్ఠ వేళ - భద్రాద్రి రామయ్యకు ప్రత్యేక పూజలు

ఆన్‌లైన్‌ ద్వారా సెక్టార్‌ టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులు ఏప్రిల్‌ 1 నుంచి 17వ తేదీ ఉదయం 6:00 గంటల వరకు రామాలయ కార్యాలయం (తానీషా కల్యాణ మండపం)లో తమ ఒరిజినల్‌ ఐడీ కార్డులను చూపించి టికెట్లు తీసుకోవాల్సి ఉంటుందని ఈవో రమాదేవి తెలిపారు. ఏప్రిల్‌ 1 నుంచి భద్రాచలం రామాలయం, గోదావరి బ్రిడ్జి సెంటర్‌లోని ఆలయ విచారణ కేంద్రం, తానీషా కల్యాణ మండపం, ఆర్డీవో కార్యాలయాల వద్ద ప్రత్యేక కౌంటర్లలో నేరుగా టికెట్లను విక్రయించనున్నట్లు ఈవో రమాదేవి పేర్కొన్నారు.

మరోవైపు భద్రాద్రి రాములోరి కల్యాణానికి కోటి గోటి తలంబ్రాలను ఈరోజు తిరుమల తిరుపతి సేవా కుటుంబం సమర్పించింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు కూడా ధాన్యాన్ని పంపించి రామనామ జపం చేస్తూ గోటితో ఒలిచిన తలంబ్రాలను సిద్ధం చేశామని నిర్వాహకులు పేర్కొన్నారు. గత ఆరు సంవత్సరాలుగా గోటి తలంబ్రాలను సమర్పిస్తున్నామని చెప్పారు. గతేడాది తలంబ్రాల ప్యాకింగ్ మిషన్​ను కానుకగా ఇచ్చామని, ఈ సంవత్సరం అన్నదాన కార్యక్రమానికి 108 బస్తాల బియ్యాన్ని కానుకగా అందించామని తెలిపారు. స్వామి వారి సేవలో పాల్గొనడం తమకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని నిర్వాహకులు వెల్లడించారు.

భద్రాచలంలో ఘనంగా రాపత్తు ఉత్సవాలు - శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునిగా దర్శనమిచ్చిన శ్రీరాముడు

భద్రాద్రి రామయ్య ఆలయంలో వెండి వాకిలి - హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు

భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైభవంగా భక్త రామదాసు 391వ జయంతి ఉత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.