ETV Bharat / state

ముల్లోకాలు మురిసేలా సీతారాముల కల్యాణం - భక్తితో పులకించిన భద్రాచలం - sri ramanavami 2024

Bhadrachalam Sita Ramula Kalyanam 2024 : జగదానంద కారకుడు, జగదభిరాముడు, భక్తకోటి తీరొక్క పేరుతో పిలుచుకునే భద్రాద్రి రాములోరి కల్యాణ వేడుక కనుల పండువగా సాగింది. అభిజిత్‌ లగ్నంలో రాముడు, జగన్మాత సీతమ్మ మెడలో మాంగళ్యధారణ చేశారు. ప్రభుత్వం తరఫున సీఎస్‌ శాంతికుమారి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. దేవదేవుడి కల్యాణవైభోగాన్ని కనులారా వీక్షించిన భక్తజనం పులకించారు.

Sri Rama Navami in Bhadradri 2024
Sri Rama Navami in Bhadradri 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 17, 2024, 12:33 PM IST

Updated : Apr 17, 2024, 7:47 PM IST

ముల్లోకాలు మురిసేలా సీతారాముల కల్యాణం

Bhadrachalam Sita Ramula Kalyanam 2024 : లోక కల్యాణంగా భావించే శ్రీ సీతారాముల కల్యాణం (Sri Rama Navami 2024)భద్రాచలంలో అంగరంగ వైభవంగా సాగింది. మిథిలా మైదానంలో కిక్కిరిసిన భక్తజన సందోహం మధ్య ఉదయం 10:30 గంటలకు వేదమంత్రోచ్ఛారణల నడుమ కల‌్యాణ ఘట్టం ప్రారంభమైంది. మొదట మేళతాళాలు, భక్తుల జయజయద్వానాల మధ్య కల్యాణమూర్తులను ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. అనంతరం స్వామివారికి ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

Bhadradri Ramayya Kalyanam 2024 : కల్యాణ క్రతువులో తిరుకల్యాణానికి సంకల్పం పలికి సర్వవిజ్ఞాన శాంతికి విశ్వక్సేన ఆరాధన నిర్వహించారు. ఆ తర్వాత కల్యాణానికి ఉపయోగించే సామాగ్రికి సంప్రోక్షణ తర్వాత రక్షా బంధనం నిర్వహించి యోక్త్రధారణ చేశారు. 12 దర్బలతో ప్రత్యేకంగా అల్లిన తాడును సీతమ్మవారి నడుముకు అలంకరించారు. యోక్త్రధారణ చేయడం ద్వారా గర్భస్త దోషాలు తొలుగుతాయని చెబుతారు. సీతారాములకు రక్షాబంధనం కట్టి స్వామి గృహస్త ధర్మం కోసం యజ్ఞోప వితరణ చేసి, కన్యావరుణ నిర్వహించి తాంబూలాది సత్కారాలు అందించారు. శ్రీరాముడికి సీతమ్మ తగిన వధువనిపెద్దలు నిర్ణయించి ఇరువంశాల గోత్రాలు పఠించారు. స్వామివారి పాదప్రక్షాళన చేసి మహాదానాలు సమర్పించారు. భక్త రామదాసు సమర్పించిన పచ్చల హారం సహా పలు అభరణాలను స్వామి, అమ్మవారికి అలంకరించారు.

శ్రీరామనవమి స్పెషల్ - జానకి రాముడికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు ఇవే! - Sri Rama Navami Food

Sri Rama Navami Celebrations 2024 : కల్యాణ వైభవాన్ని చాటిచెప్పేలా చూర్ణికను పఠించిన అనంతరం వేద మంత్రోచ్చరణాలు మారుమోగుతుండగా జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచారు. జగత్ కల్యాణ శుభ సన్నివేశాన్ని కనులారా వీక్షించి భక్తులు తన్మయత్వం పొందారు. లోకమంతా వేయికళ్లతో ఎదురుచూసిన సీతమ్మవారి మెడలో శ్రీరామచంద్రుడు మాంగళ్యధారణ చేశారు. జగదభిరాముడు మూడుముళ్లు వేసిన క్షణాన ముల్లోకాలు మురిశాయి. లక్షలాది సంఖ్యలో తరలివచ్చిన భక్తుల రామనామస్మరణ మధ్య ఆ జగదభిరాముడు జానకమ్మను మనువాడాడు.

రాముడు దోసిట తలంబ్రాలు నీలపురాసులుగా జానకి దోసిట తలంబ్రాలు మనిమాణిక్యాలై సాక్ష్యాత్కరించిన వేళ మిథిలా మైదానం భక్తి పారవశ్యంలో ఓలలాడింది. శ్రీరామనవమి (Sri Rama Navami in Telangana)సందర్భంగా కల్యాణ కాంతులతో కళకళలాడిన పురుషోత్తముడికి గురువారం పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. కల్యాణ క్రతువుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు.

భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారుల ఏర్పాట్లు : మరోవైపు స్వామివారి కల్యాణానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎండ దృష్ట్యా వారి సౌకర్యార్థం ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు, కూలర్లను ఏర్పాటు చేసిన అధికారులు, భక్తుల కోసం ముత్యాల తలంబ్రాలు, లడ్డు ప్రసాదాలు పంపిణీ కోసం ప్రత్యేక కౌంటర్లను ఉంచారు. అదేవిధంగా పోలీస్ శాఖ 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది.

అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం

శ్రీరామనవమి రోజున ఇంటిపై హనుమాన్ జెండా - ఎందుకు ఎగరేస్తారో తెలుసా? - Sri Rama Navami 2024

Last Updated : Apr 17, 2024, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.