ETV Bharat / state

హల్లో హైదరాబాదీస్ : ఒక్కరోజులోనే చూసొచ్చే అద్భుతమైన ప్రదేశాలు మన చుట్టూనే! - మీకు తెలుసా? - Best Tourist Places Near Hyderabad - BEST TOURIST PLACES NEAR HYDERABAD

Best Tourist Places: బిజీబిజీగా గడిపే హైదరాబాద్ నగర వాసులు ఆదివారం ఒక్క రోజైనా కుటుంబంతో సరదాగా గడపాలని కోరుకుంటారు. కానీ.. ఆ పనీ ఈ పనీ చేసుకునే సరికి సెలవు దినం ఐస్​ క్రీమ్​లా కరిగిపోతుంది. అందుకే.. ఈ సారి ముందుగానే టూర్​ ప్లాన్ పెట్టుకోండి. ఉదయాన్నే వెళ్లి సాయంత్రం కల్లా తిరిగి వచ్చే పిక్నిక్ స్పాట్స్ నగరానికి కొద్ది దూరంలోనే ఉన్నాయి. ఆ వివరాలేంటో చూసేయండి.

Best Tourist Places Near Hyderabad
Best Tourist Places Near Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 9, 2024, 3:35 PM IST

Best Tourist Places Near Hyderabad: జాబ్​ టెన్షన్స్​, వ్యాపార లావాదేవీలు, కుటుంబ బాధ్యతలు.. వీటన్నింటిని బ్యాలన్స్​ చేయాలంటే వెకేషన్​ బెస్ట్​ ఆప్షన్​. మంచి రిలీఫ్ ఇస్తుంది. కానీ.. ఇప్పుడున్న రోజుల్లో రోజుల తరబడి విహార యాత్రలకు వెళ్లాలంటే కొంచెం కష్టమైన పనే. అందుకే.. హైదరాబాద్​ నుంచి ఒక్కరోజులోనే చుట్టొచ్చే ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. ఆ వివరాలపై ఓ లుక్కేయండి. మీకు నచ్చిన ప్లేస్​కు వెళ్లి ఎంజాయ్​ చేసి రండి..

అనంతగిరి హిల్స్: హైదరాబాద్​కు అతి దగ్గరగా.. ప్రకృతి అందాలకు కేరాఫ్​ అడ్రస్​ అయిన ప్రాంతం వికారాబాద్. పచ్చగా పరుచుకున్న చెట్లు.. గలగలాపారే సెలయేళ్లు, ఎత్తైన కొండలతో వికారాబాద్ అటవీప్రాంతం రమణీయంగా వుంటుంది. ఇక్కడ తప్పకుండా చూడాల్సిన ప్లేస్​ అనంతగిరి హిల్స్. ప్రకృతి ప్రేమికులు, ట్రెక్కింగ్​ను ఇష్టపడేవారు ఈ ప్రాంతంలో బాగా ఎంజాయ్ చేయవచ్చు. హైదరాబాద్ నుంచి కేవలం రెండు గంటల్లో వికారాబాద్​కు చేరుకోవచ్చు.

సింగూరు డ్యామ్, మెదక్ : హైదరాబాద్​కు ​కేవలం 100 కి.మీ లోపే ఈ సింగూరు డ్యామ్ ఉంది. మంజీరా నదిపై నీటిపారుదల, విద్యుత్​ ఉత్పత్తి కోసం నిర్మించిన ఆనకట్ట ఇది. వర్షాకాలంలో నీటితో నిండి ఉండే ఈ సింగూరు డ్యామ్ పరిసరాలు రమణీయంగా ఉంటాయి. నేచర్​ లవర్స్​ సింగూరు డ్యామ్ వెకేషన్​ను బాగా ఎంజాయ్ చేస్తారు.

యాదగిరిగుట్ట : హైదరాబాద్ సమీపంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. యాదగిరిగుట్టపై వెలసిన నరసింహ స్వామిని దర్శించుకుని తరిస్తుంటారు భక్తులు. మీరు కూడా వెళ్లాలనుకుంటే ఒక్కరోజులో వెళ్లి రావచ్చు. అంతేకాకుండాయాదగిరి చుట్టుపక్కల భువనగిరి కోట, స్వర్ణగిరి ఆలయం వంటి పలు సందర్శనీయ ప్రదేశాలు కూడా చూసి ఎంజాయ్​ చేయవచ్చు.

బైరాన్​పల్లి బురుజు - రాణి శంకరమ్మ కోట - మెదక్​ జిల్లాలో ది బెస్ట్ షూటింగ్ స్పాట్స్ ఇవే

ఏడుపాయల ఆలయం, మెదక్ : మెదక్ పట్టణానికి సమీపంలో మంజీరా నది ఒడ్డున గల ఆధ్యాత్మిక కేంద్రం.. ఏడుపాయల వనదుర్గా ఆలయం. మంజీరా నది ఒడ్డున.. ప్రకృతి అందాల నడుమ వెలిసిన అమ్మవారి ఆలయాన్ని సందర్శిస్తే ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. స్నేహితులతో కలిసి వెళ్లేందుకు పర్ఫెక్ట్ ప్లేస్ ఏడుపాయల ఆలయం.

నర్పాపూర్ ఫారెస్ట్ : హైదరాబాద్​కు సమీపంలో ఉన్న మరో ప్రకృతి కేంద్రం నర్సాపూర్ ఫారెస్ట్. దట్టమైన అడవి, రకరకాల జంతువులు, పక్షులతో రమణీయంగా వుంటుంది. మధ్యలో ఉండే సరస్సు నర్సాపూర్ అడవి అందాలను మరింత పెంచుతుంది. ఈ అడవిలో ట్రెక్కింగ్ ఎంజాయ్​ చేయవచ్చు.

చిలుకూరు ఆలయం : హైదరాబాద్​ శివారు ప్రాంతంలోని చిలుకూరులో పురాతన వెంకటేశ్వరస్వామి ఆలయం వుంది. ఈ స్వామిని వీసా దేవుడిగా భక్తులు కొలుస్తుంటారు. విదేశాలకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నవారు స్వామివారిని దర్శించుకుంటే ఈజీగా వీసా లభిస్తుందని నమ్మకం. సెలవు రోజులు, ఆదివారం ఈ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది.

హైదరాబాద్‌ వాసులకు దగ్గర్లోని అద్భుత పర్యాటక ప్రాంతాలు - అక్కడికి వెళ్లారంటే ప్రకృతిలో పిల్లలైపోతారు!

సమ్మర్​లో ఫ్యామిలీతో కలిసి ట్రిప్​ ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఈ టాప్-10 ప్లేసెస్‌పై ఓ లుక్కేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.