Bangalore Woman Wins 9 lakh Rupees By Sleeping : ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు అంటారు. కానీ ప్రస్తుతం జీవనశైలి కారణంగా సుతిమెత్తని పరుపు మీద పడుకున్నప్పటికీ నిద్రలోకి జారుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కంటి మీద కునుకు రావడానికి యుద్ధాలే చేయాల్సి వస్తుంది. అందుకే చాలా మంది అమ్మాయిలకు మంచి నిద్ర అనేది ఓ కలలానే ఉంటోంది.
అయితే బెంగళూరుకు చెందిన శైష్వరి పాటిల్ మాత్రం వీటన్నింటిని అధిగమించింది. తనకు ఉన్న నిద్రపోయే అలవాటును ఓ వరంగా మారడంతో, అదే ఆమెను రూ.9 లక్షలు గెలుచునేలా చేసింది. శైర్వరి ఓ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్. తను తాజాగా ఓ స్టార్టప్నకు చెందిన స్లీప్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లో చేరారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, దాన్ని సమన్వయం చేసుకుంటూ ఎంత బాగా నిద్రపోగలరో తెలుసుకోవడమే ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం. అందుకోసం వాళ్లకు ఓ పోటీని నిర్వహించారు.
ఈ ప్రోగ్రామ్‌లో 12 మంది పాల్గొనగా, అందులో శైష్వరి కూడా ఒకరు. పోటీలో భాగంగా రోజుకు కనీసం 8 గంటల నుంచి 9 గంటల గాఢ నిద్రపోవాలి. ఆఁ.. అదేం పెద్ద పని, మేము కూడా గెలుస్తాం అనుకుంటున్నారా? కానీ అనుకున్నంత సులువేం కాదట. ఎందుకంటే దీంట్లో రకరకాల స్లీప్ షెడ్యూళ్లు ఉంటాయట. వీటన్నింటీలో గెలిస్తేనే విజేతగా నిలుస్తారు. శైష్వరి అలానే విజయం సాధించింది మరి.
మంచి ప్రణాళిక వేసుకుంటే విజయం సొంతం : ఏకాగ్రతతో పని చేయాలన్నా, ఉత్పాదకత పెరగాలన్నా, భావోద్వేగాలు అదుపులో ఉండాలి అన్నా, శరీరం రిపేర్ అవ్వాలన్నా మనిషికి నిద్ర చాలా అవసరం. ఈతరం వారికి నిద్ర అనేది పెద్ద సమస్యే. మొదట్లో బాగా నిద్రపోయినా, కరోనా నుంచి నిద్రవేళలు క్రమం తప్పాయి. ఈ పోటీలో పాల్గొనడం వల్ల తిరిగి రొటీన్‌లోకి రాగలిగారని శైష్వరి చెబుతోంది. ఈ పోటీల్లో మంచి స్కోర్ రావాలంటే మొదట క్రమబ్ధమైన నిద్రవేళలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. రాత్రుళ్లు ఫోన్, టీవీలాంటివి చూడటం తగ్గించుకోవాలని సూచిస్తుంది. మరీ ప్రయత్నించాలి అనుకుంటున్నారా?
గుడ్ స్లీప్, ఫుల్ ఖుషీ! ఏ టైంలో స్నానం చేస్తే సుఖంగా నిద్రపోవచ్చో తెలుసా? - Showering Before Bed