Bangalore Rave Party Accused Lankapalli Vasu : బెంగళూరు రేవ్ పార్టీ నిందితుడు లంకపల్లి వాసు ఏపీలోని విజయవాడ బ్రహ్మంగారి మఠం వీధిలో నివాసం ఉంటాడు. ఇతనిది సాధారణ కుటుంబమే తల్లి దోసెలు అమ్ముతూ జీవనం సాగిస్తుంది. తండ్రి మరణించాడు. వాసుకు ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య ఉన్నారు. చిన్నప్పటి నుంచి మంచి క్రికెటర్‌గా ఎదగాలన్నది అతని లక్ష్యం. ఆటపై అభిమానమే అతడిని బుకీగా మార్చింది. క్రికెట్, హాకీ, కబడ్డీ ఇలా ప్రధాన క్రీడల బెట్టింగుల్లో బుకీగా వ్యవహరించేవాడు.
బెంగళూరు, చెన్నై, ముంబయి, విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి చిత్తూరు, కర్నూలు, తదితర ప్రాంతాల నుంచి బెట్టింగులు నిర్వహించేవాడు. ఇలా పెద్ద సంఖ్యలో పలు రాష్ట్రాల్లో బెట్టింగ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. విజయవాడలోనే దాదాపు 150కి పైగా బెట్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత వ్యాపారాలను విస్తరించి హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో పబ్‌లు నిర్వహిస్తున్నాడు. వాసు భార్య, ఇద్దరు కుమార్తెలు విజయవాడలోనే ఉంటారు. అతను మాత్రం ఒకటి, రెండు రోజులు వచ్చి వెళ్తుంటాడు. చుట్టుపక్కల వారు అడిగితే దుబాయ్, బెంగళూరు, మలేసియాలో పని చేస్తున్నానని చెప్పి నమ్మించేవాడు.
బెంగళూరు రేవ్ పార్టీపై స్పందించిన నటీనటులు శ్రీకాంత్, హేమ - Actor Hema Reacts on Rave Party
బెట్టింగ్ వాసు చీకటి సామ్రాజ్యం : ఎక్కడికి వెళ్లినా విమానాలలోనే తిరిగేవాడు. ఎక్కడకి వెళ్లినా అక్కడ విమానాశ్రయంలో లగ్జరీ కార్లు, అనుచరులతో హడావుడి చేసేవాడు. రూ. కోటి విలువైన విలాసవంతమైన కార్లు నాలుగు వరకు ఉన్నాయి. విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తదితర ప్రాంతాల్లో భారీగా విల్లాలు, ఇళ్లు కొన్నాడు. విజయవాడలోని వైవీరావు ఎస్టేట్ వద్ద భారీగా డబ్బులు వెచ్చించి విల్లా నిర్మించాడు. ఓ కార్పొరేటర్‌కు చెందిన భవనాన్ని రూ. కోటి వెచ్చించి కొనుగోలు చేశాడు.
ఒక్క విజయవాడలోనే రెండు విల్లాలు, పలు ప్రాంతాల్లో ఇళ్లు ఉన్నట్లు తెలిసింది. ముంబయిలో అద్దె భవనంలో ఉంటూ బెట్టింగ్ వ్యవహరాలు నడుపుతుంటాడు. 15 ఏళ్లల్లో అందనంత స్థాయికి ఎదగటానికి పోలీసుల సహకారం ఉందని తెలిసింది. ముడుపులతో తన కార్యకలాపాలను నిరాఘాతంగా నిర్వహించేవాడు. విజయవాడలో చాలా సార్లు పెద్ద ఎత్తున అతని అనుచరులు పోలీసులకు పట్టుబడ్డారు. తన పలుకుబడిని ఉపయోగించి మళ్లీ బయటకు తెచ్చేవాడు.
బెంగళూరు రేవ్‌పార్టీలో తప్పితే ఇంత వరకు ఎక్కడా పోలీసులకు పట్టుబడలేదు. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, వంటి ప్రాంతాలలో తన తరపున వాదించేందుకు ప్రత్యేక న్యాయవాదులను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో వాసు అరెస్టు అయి రిమాండ్‌లో ఉండడంతో న్యాయ సహాయం కోసం హైదరాబాద్, విజయవాడ బెంగళూరుకు చెందిన సుమారు 8 మంది వరకు న్యాయవాదులు తరలి వెళ్లినట్లు తెలిసింది. లాక్‌డౌన్ సమయంలో భవానీపురంలోని కృష్ణానది ఒడ్డున క్రికెట్ ఆడుతుండగా కాలుకు పెద్ద దెబ్బ తగిలింది. ఇటీవలి వరకు చేతి కర్ర సాయంతోనే నడవాల్సిన పరిస్థితి. మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. గుండె సంబంధ సమస్యలు రావడంతో స్టంట్ వేసినట్లు సమాచారం.
రేవ్ పార్టీ అంటే ఏమిటి? - అందులోకి వెళ్లిన వారు ఏం చేస్తారు? - What is Rave Party in Telugu
రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నారు : బెంగళూరు పోలీస్ కమిషనర్ - Bangalore Rave Party Details