ETV Bharat / state

మందుబాబులకు బ్యాడ్​న్యూస్​ - త్వరపడండి! - bad news for DRUNKARDS - BAD NEWS FOR DRUNKARDS

BAD NEWS FOR DRUNKARDS: మందుబాబులకు మరోసారి బ్యాడ్ న్యూస్. ఏపీలో పలు చోట్ల మద్యం షాపులు మూసేసి కనిపిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు అక్టోబర్ 2 (బుధవారం) గాంధీ జయంతి కావడంతో మరింత కంగారు పడుతున్నారు. మద్యం షాపుల కోసం అన్వేషిస్తున్నారు. అయితే మరి షాపులు మూసివేయడానికి కారణాలు ఏంటో తెలుసా?

BAD NEWS FOR DRUNKARDS
BAD NEWS FOR DRUNKARDS (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 1, 2024, 5:35 PM IST

Updated : Oct 1, 2024, 5:59 PM IST

BAD NEWS FOR DRUNKARDS: చాలా మందుబాబులు నిత్యం ముందుచూపుతో ఆలోచిస్తారు. ఎప్పుడైనా మద్యం షాపులు క్లోజ్ చేస్తారు అనే వార్త రాగానే త్వరపడతారు. అయితే ఈసారి మాత్రం వారికి షాక్ తగిలింది. ఒక్కసారిగా ఏపీలో పలు చోట్ల మద్యం దుకాణాలు మూసివేసి ఉండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు తమకు సమాచారం కూడా లేదు కదా అంటూ తమలో తాము చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఎందుకు షాపులు క్లోజ్ చేశారో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

ఇప్పుడిప్పుడే ఏపీలో మందుబాబులు సంతోషంగా ఉంటున్నారు. నూతన మద్యం పాలసీ వార్తతో సంబరాలకు రెడీ అయ్యారు. అయితే మద్యం షాపులకు వెళ్లి చూశాక, వారికి దుకాణాలు క్లోజ్ చేసి కనిపించాయి. అసలు ఎందుకు మద్యం దుకాణాలు క్లోజ్ చేశారు? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

AP New Liquor Policy 2024: ఏపీలో నూతన మద్యం విధానాన్ని తీసుకురావడాన్ని నిరసిస్తూ మద్యం దుకాణదారులు మంగళగిరిలో పలుచోట్ల బంద్ పాటించారు. అయితే ఎక్సైజ్ శాఖ అధికారులు మూసివేసిన దుకాణాలను దగ్గరుండి తెరిపించారు. ప్రభుత్వం మద్యం దుకాణాలను కేటాయించేంతవరకు అమ్మకాలు కొనసాగించాలని మద్యం దుకాణ సిబ్బందికి గట్టిగా చెప్పారు. ఎవరైనా దుకాణాన్ని మూసేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం షాపులు తెరవడంతో మందుబాబులు సంతోషం వ్యక్తం చేశారు.

అమల్లోకి నూతన మద్యం విధానం - నేటి నుంచి కొత్త దుకాణాల దరఖాస్తుల స్వీకరణ - Applications For New Liquor Shops

పలుచోట్ల దుకాణాలు బంద్: ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పని చేస్తున్న సిబ్బంది నేటి నుంచి దుకాణాలు బంద్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల్లోని సిబ్బంది తమ సమస్యలు పరిష్కరించాలంటూ షాపులు మూసివేసి నిరసన తెలిపారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మద్యం షాపులు మూతపడ్డాయి. అక్టోబర్ 1 నాటికి తమ ఐదేళ్ల కాంట్రాక్టు ముగిసిందని వారు దుకాణాలను మూసివేసి నిరసన తెలిపారు. తమకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కావాలని సిబ్బంది వారు కోరుతున్నారు. ఎక్సైజ్ పోలీసులు వారిని నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో నరసన్నపేటలోని మద్యం ప్రియులు ఒకింత ఇబ్బందులు పడుతున్నారు.

తమకు ఉద్యోగ భద్రత కల్పించి, కుటుంబాలను ఆదుకోవాలని తిరువూరులో ఏపీ బేవరేజ్‌ కార్పొరేషన్‌ కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ వెల్ఫేర్‌ ఆధ్వర్యంలోని మద్యం షాపుల సూపర్వైజర్స్, సేల్స్ మెన్స్, సెక్యూరిటీ కోరారు. మద్యం షాపుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని ఈ సందర్భంగా వేడుకుంటున్నారు. మద్యం షాపుల మూసివేతతో మందుబాబులు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం గాంధీ జయంతి సందర్భంగా మద్యం షాపులు క్లోజ్ చేసి ఉంటాయి. దీంతో హుటాహుటిన ఎక్కడెక్కడ దుకాణాలు తెరచి ఉన్నాయో కనుక్కొని మరీ అక్కడకి వెళ్తున్నారు.

మందుబాబుల ఆరోగ్యానికి గ్యారెంటీ! - జే బ్రాండ్‌కు బై బై - ఇక ప్రైవేటు మద్యం అమ్మకాలు - New Liquor Policy 2024 in AP

Last Updated : Oct 1, 2024, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.