Auto Driver Brutally Murdered in Hanamkonda : అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ ఆటో డ్రైవర్ మరో ఆటో డ్రైవర్‌ను విచక్షణా రహితంగా కత్తితో పొడిచి చంపిన ఘటన హనుమకొండలో కలకలం రేపింది. కాగా హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే హనుమకొండలో రాజ్‌కుమార్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడిపై మరో ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లు నడిరోడ్డుపై కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపాడు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
నడిరోడ్డుపై ఆటో డ్రైవర్ దారుణహత్య - AUTO DRIVER MURDERED IN HANAMKONDA
హనుమకొండలో ఆటో డ్రైవర్ దారుణహత్య - నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి చంపిన మరో ఆటో డ్రైవర్
Published : Jan 22, 2025, 1:52 PM IST