ETV Bharat / state

చినుకుపడితే ఇక సాహస యాత్రే! - ఆ గిరిపుత్రులకు నిత్యకృత్యమైన వంతెన కష్టాలు - river problems in asifabad district

Bridge Difficulties for Tribals : మారుమూల గిరిజన గ్రామాల పరిస్థితి రోజురోజుకూ అధ్వాన్నంగా మారుతుంది. అక్కడ చిన్నపాటి చినుకుపడినా, ఆ గ్రామస్థులకు వంతెన కష్టాలు తప్పడం లేదు. గ్రామం నుంచి మండల కేంద్రానికి వెళ్లాలన్నా, చేను పనులకు వెళ్లాలన్నా వాగు దాటాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వాగు ఏ క్షణంలో ఎలా ప్రవహిస్తుందో చెప్పడం కష్టంగా మారుతుంది. వాగు దాటే క్రమంలో చాలా మంది గల్లంతైన దృశ్యాలు ఎన్నో ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇంతకీ ఈ గ్రామాలు ఎక్కడున్నాయంటే?

Tribal Villages River Problems in Asifabad
Tribal Villages River Problems in Asifabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 17, 2024, 11:30 AM IST

Updated : Aug 17, 2024, 12:46 PM IST

Tribal Villages River Problems in Asifabad : రాష్ట్రంలోని మారుమూల గ్రామాల పరిస్థితి రోజురోజుకూ అధ్వాన్నంగా మారుతోంది. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో అయితే ఊహించడానికే ఆ పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటున్నాయి. అక్కడ చిన్న పనికి బయట ప్రపంచానికి వెళ్లాలన్నా వాగులు దాటాల్సిందే. ఆ వాగు పరిస్థితి ఏ క్షణంలో ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఎందుకంటే వర్షం పడకపోతే నీరు లేకుండా రాకపోకలకు అనువుగా ఉంటుంది. అదే చిన్నపాటి చినుకు పడినా వాగు ఉద్ధృతంగా ప్రవహించి అటువైపు వెళ్లడానికి భయంగా మారుతోంది. కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కెరమెరి మండలంలోని గ్రామాల్లో ఇప్పుడు అలాంటి పరిస్థితే కనిపిస్తుంది.

ఈ మండలంలో చిన్నపాటి చినుకుపడినా ఆ గ్రామస్థులకు వంతెన కష్టాలు తప్పడం లేదు. గ్రామం నుంచి కెరమెరి మండల కేంద్రానికి రావాలన్నా, వాగు అవతల వైపు చేను పనులకు వెళ్లాలన్నా వాగు దాటాల్సిందే. ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ ప్రకటించడంతో కెరమెరి మండలంలోని లక్మాపూర్​ గ్రామస్థులు వాగు మీదుగా మండల కేంద్రంలోని బ్యాంకు వద్దకు వెళ్లారు. ఉదయం వాగులో నీటి ప్రవాహం లేదు. సాయంత్రం ఇంటికి వెళ్లే క్రమంలో వర్షం కురవడంతో వాగు పొంగిపొర్లింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రమాదకరంగా మహిళలు సైతం వాగు దాటి ఇంటికి వెళ్లారు.

అనార్పల్లి, గోర్యగూడ వాగులు పొంగిపొర్లడంతో అవతల వైపు ఉన్న కరంజివాడ, బొరిలాల్గూడ, జన్కపూర్లకు ఇదే దుస్థితి నెలకొంది. వచ్చే వర్షాకాలంలోపు నిర్మాణంలో ఉన్న వంతెనలు పూర్తి చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వాగును దాటే క్రమంలో ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయని వాపోయారు. ప్రాణాలు పోయినా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వారికి చీమకుట్టినట్లు కూడా లేదని ఆందోళన చెందారు.

దశాబ్దాలుగా ఇదే పరిస్థితి : దశాబ్దాల కాలం నుంచి ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతంలో జీవిస్తున్న ఆదివాసీల బతుకులు మారడం లేదంటున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఏ చిన్న పనికైనా వాగులు దాటి పూర్తి చేసుకోవాల్సిన దుస్థితి ఉంటుందని అన్నారు. వాగులు ఉప్పొంగినట్లయితే విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారన్నారు. గర్భిణీల కష్టాలు చెప్పనక్కర్లేదని, కొన్ని సందర్భాల్లో గర్భిణిలు వాగు ఒడ్డునే ప్రసవించిన రోజులు కూడా ఉన్నాయని స్థానికులు తెలిపారు.

వాగు దాటలేక గర్భిణి 'నడక' యాతన - ఒడ్డునే ప్రసవం - ఒక పాప మృతి ఐసీయూలో మరో పసికందు - TRANSPORT PROBLEMS IN ASIFABAD

ఊరు దాటాలంటే సర్కస్ ఫీట్స్ చేయాల్సిందే - ఈ బ్రిడ్జిపై ప్రయాణం నరకం - MOTHE VAGU BRIDGE ISSUE IN RAMADUGU

Last Updated : Aug 17, 2024, 12:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.