ETV Bharat / state

మరో 6 రోజుల్లో మేడారం మహా జాతర - గద్దెలపై కొలువుదీరేందుకు సిద్ధమవుతున్న పగిడిద్దరాజు

Arrangements Pagididda Raju Temple at Punugondla : సమ్మక్క-సారలమ్మ జాతరలో గద్దెలపై కొలువుదీరి భక్తుల కోర్కెలను నెరవేర్చడానికి పగిడిద్దరాజు సిద్ధమవుతున్నారు. పూనుగొండ్ల గ్రామంలో వారం రోజుల ముందు నుంచే పగిడిద్దరాజును పూజారులు ముస్తాబు చేస్తున్నారు. దీంతో గ్రామమంతా బంధువులతో నిండి, పండుగ వాతావరణం నెలకొంది.

Pagididda Raju Temple at Punugondla
Pagididda Raju Temple at Punugondla
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 16, 2024, 7:27 AM IST

మేడారం జాతర సందర్భంగా ముస్తాబవుతున్న పూనుగొండ్ల

Arrangements Pagididda Raju Temple at Punugondla : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఈ నెల 22 నుంచి 25 వరకు జరగనుంది. ఆదివాసీ సంప్రదాయబద్ధంగా ఈ మహా జాతరను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈ మహోత్సవానికి వన దేవతలను తమ తమ గ్రామాల నుంచి మేడారం తరలించడానికి పూజారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి గ్రామం నుంచి గోవిందరాజు వచ్చి గద్దెలపై కొలువుదీరనున్నారు. మరుసటి రోజు సమ్మక్కను చిలుకలగట్టు నుంచి అధికార లాంఛనాలతో తీసుకొచ్చి, గద్దెలపై ప్రతిష్ఠించనున్నారు. అందుకు గానూ ఆయా దేవాలయాల్లో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

మినీ మేడారం అగ్రంపాడు సమ్మక్క సారలమ్మ జాతర - ఈ విషయాలు తెలుసా?

Medaram Jatara 2024 : జాతరలో భాగంగా మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలోని పగిడిద్దరాజును మేడారానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామి వారిని పడగ రూపంలో తరలిస్తారు. ఈ నెల 20న పెనక వంశీయులు పగిడిద్దరాజును పెళ్లికొడుకుగా ముస్తాబు చేసి, అటవీ మార్గంలో కాలి నడకన బయలుదేరి కర్లపెల్లి, గుండ్లవాగు ప్రాజెక్టు మీదుగా గోవిందరావుపేట మండలం లక్ష్మిపురం చేరుకుంటారు. ఆ రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజున స్వామివారిని మేడారంలోని (Medaram Jatara 2024) గద్దెలపై ప్రతిష్ఠిస్తారు.

మేడారం వెళ్లడానికి వీలు కావడం లేదా? - ఇంట్లో నుంచే వనదేవతలకు బంగారం సమర్పించండిలా

జాతర అనంతరం స్వామి వారిని మేడారం నుంచి మళ్లీ పూనుగొండ్లకు తీసుకొచ్చి, ఈ నెల 26న దేవాలయంలో ప్రతిష్ఠిస్తామని ఆలయ పూజారులు తెలిపారు. అనంతరం ఈ నెల 28 నుంచి మార్చి 1 వరకు నాగవెళ్లి కార్యక్రమం జరుపుతామని పేర్కొన్నారు. ఆ తర్వాతనే తమ ఇండ్లలో వివాహాలు కానీ, వేరే ఏ శుభకార్యమైనా చేపడుతామని పూజారులు వివరించారు.

"సమక్క భర్త అయిన పగిడిద్దరాజును పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేసి మేడారానికి తరలిస్తాం. కాలి నడకన బయల్దేరి లక్ష్మీపురం చేరుకుంటాం. ఆ రాత్రి అక్కడే బస చేసి తిరిగి మరుసటి రోజున స్వామివారిని గద్దెలపై ప్రతిష్ఠిస్తాం. జాతర అనంతరం స్వామివారిని పూనుగొండ్లకు తీసుకువచ్చి మూడు రోజుల పాటు సమక్కకు పగిడిద్దరాజుకు నాగవెళ్లి కార్యక్రమం చేస్తాం. ఆ తర్వాతనే మా ఇళ్లల్లో ఏ శుభకార్యమైనా చేసుకుంటాం." - పెనుక కిరణ్‌, పగిడిద్దరాజు ఆలయ పూజారి

Sammakka Sarakka Jatara 2024 : మరోవైపు మేడారం జాతరకు కోట్లాది రూపాయల నిధులను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నా సమ్మక్క భర్త అయిన పగిడిద్దరాజు (Pagididda Raju) తిరుగువారం జాతరకు ప్రభుత్వం ఎలాంటి నిధులను కేటాయించడం లేదని పూజారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పూనుగొండ్లలో స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివస్తారని చెబుతున్నారు. భక్తుల కోసం నీటి వసతి, నీడకోసం టెంట్ల ఏర్పాటు కానీ, రోడ్ల మరమ్మతులు చేయకపోవడంతో వారు ఇబ్బంది పడుతున్నారని గ్రామస్థులు అంటున్నారు. ఈసారైనా ప్రభుత్వం కనీస వసతులు కల్పించాలని కోరుతున్నారు.

వన దేవతల దర్శనానికి వేళాయే - 'మండమెలిగే'తో మహా జాతరకు సిద్ధమైన మేడారం

వన దేవతలను దర్శించుకునేందుకు పోటెత్తిన భక్త జనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.