Army Jawan From Bhadradri Was Killed in An Elephant Attack : ఏనుగుల దాడిలో ఖమ్మంనకు చెందిన ఆర్మీ జవాన్ మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన కొంగా సాయిచంద్ర రావు అస్సాం సోనిత్పూర్ జిల్లా రంగాపార ప్రాంతంలో ఠాకూర్ ఆర్మీ యూనిట్‌లో నాయబ్ సుబేదార్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
ఆదివారం ఆర్మీ సిబ్బందిపై అమ్రిబారిలో ఏనులు దాడికి దిగాయి. వాటి నుంచి తప్పించుకుని పారిపోయే క్రమంలో సాయిచంద్ర రావు కిందపడిపోయారు. ఒక ఏనుగు చంద్రరావును బలంగా తొక్కడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సాయిచంద్ర రావు మృతదేహాన్ని సోమవారం రాత్రి విమానంలో హైదరాబాద్‌కు తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం అక్కడి నుంచి ఖమ్మంనకు తీసుకెళ్లారు. ఆయన మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, మిత్రుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గన్ మిస్ ఫైర్ - సీఐఎస్‌ఎఫ్ జవాన్ దుర్మరణం
Army Jawan From Nalgonda Dies In Assam : గత జూన్‌లోనూ ఇలాంటి ఓ ఘటన జరిగింది. నల్గొండ జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ అసోంలో మృతి చెందారు. అనుముల మండలం మదారీ గూడెంనకు చెందిన ఈరాటి మహేశ్ అనే ఆర్మీ జవాన్ నాలుగేళ్ల క్రితం సైన్యంలో చేరారు. ప్రస్తుతం అసోం రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తున్నారు. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆయనను తోటి జవాన్లు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.
దీంతో అతడి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మహేశ్ కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆర్మీ అధికారుల నుంచి అతని కుటుంబసభ్యులకు సమాచారం అందడంతో వారు హైదరాబాద్‌కు వచ్చి, అక్కడి నుంచి ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఈరేటి మహేశ్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో పూర్తి చేశారు. ముందుగా హాలియ నుంచి జవాన్ స్వగ్రామం మదారీగూడెం వరకు ప్రత్యేక వాహనంలో అంతిమ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. మహేశ్ భౌతికకాయానికి నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్, మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్ నివాళులర్పించారు. అనంతరం ఆర్మీ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు.
అధికారిక లాంఛనాలతో జవాన్ మహేశ్ అంత్యక్రియలు - భారీగా తరలివచ్చిన స్థానికులు