ETV Bharat / state

వినూత్నంగా పాదరక్షల వ్యాపారం చేస్తున్న కౌశిక్‌ - అదే అతని బిజినెస్ ఫార్ములా అంట! - Moo Chuu India Footwear company

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 27, 2024, 4:22 PM IST

Updated : Apr 27, 2024, 5:49 PM IST

Special Story On Moo Chuu India Footwear Founder : పాదరక్షలు లేనిదే గడప దాటడం లేదు నేటి సమాజం. అడుగు తీసి అడుగేయాలంటే చెప్పులు తప్పనిసరి అంటున్నారు. అలాంటి పాదరక్షలనే తన వ్యాపారంగా మలచుకున్నాడు ఆ యువకుడు. వినూత్నగా ఆలోచించి హైదరాబాద్‌ నగరంలోని వీధి వీధీ తిరుగుతూ విక్రయాలు చేస్తున్నాడు. వినూత్నమైన రంగులల్లో కష్టమర్లు ఆకర్షించేలా అమ్మకాలు జరుపుతూ లక్షల్లో ఆదాయం పొందుతున్నాడు. మరి, ఎవరా యువకుడు? పాదరక్షల వ్యాపారం చేయడానికి గల కారణాలు ఏమిటి? కష్టమర్లకు ఏ విధంగా చేరువ అవుతున్నాడో ఈ కథనంలో చూద్దాం.

Special Story On Moo Chuu India Footwear Founder

వినూత్నంగా పాదరక్షల వ్యాపారం చేస్తున్న కౌశిక్‌ - అదే అతని బిజినెస్ ఫార్ములా అంట!

Special Story On Moo Chuu India Footwear Founder : ఇంటి ముందుకు కూరగాయలు, పండ్లు తెచ్చి అమ్మడం సర్వసాధారణం. అక్కడక్కడ తినుబండారాలు, వస్త్రాలు వంటివి విక్రయించడమూ చూస్తుంటాం. సరిగ్గా ఇలాంటి ఒక ఆలోచనే ఓ యువకుడి మదిలో మెదిలింది. చెప్పులను కూడా కష్టమర్ల చెంతకు చేర్చాలనకున్నాడు. తోటి స్నేహితులు, కుటుంబసభ్యుల సహకారంతో మూచూ ఇండియా కంపెనీ స్థాపించి యువ వ్యాపారవేత్తగా రాణిస్తున్నాడు.

Architect Turned Entrepreneur : పాదరక్షలు వ్యాపారం చేస్తున్నఇతని పేరు కౌశిక్‌ రెడ్డి. హైదరాబాద్‌ స్వస్థలం. బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఆర్కిటెక్చర్‌ కోర్సు చేశాడు. ఆ తర్వాత ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఎంబీఏ పూర్తి చేశాడు. ఒకానొక సందర్భంలో థాయ్‌లాండ్‌ వెళ్లినప్పుడు అక్కడున్న పాదరక్షలను కొనుగోలు చేశాడు. అవి ఎక్కువ కాలం మన్నిక రావడంతో భారత్‌లో కూడా అలాంటి కంపెనీ స్థాపించాలనే ఉద్దేశంతో 2018లో 'మూచూ ఇండియా' పేరుతో దుకాణాన్ని ప్రారంభించాడు.

"కస్టమైజేషన్ అనేది మా బ్రాండ్​లో ఉన్న ప్రత్యేకత. మాకు బ్రాండింగ్ అనేది ఎక్కడా లేదు. కొన్నవాళ్లు చెప్పడం ద్వారా మా వద్దకు వచ్చేవారు ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం డబుల్ కస్టమైజేషన్​ను ప్రవేశపెడుతున్నాం. వినియోగదారులకు నచ్చే చెప్పులను ఎంచుకునే సౌలభ్యం ఉంది"- కౌశిక్‌ రెడ్డి,

మూచూ ఇండియా కంపెనీ ఫౌండర్

Moo Chuu India Footwear company : అప్పటికే మార్కెట్లో కుప్పలు తెప్పలుగా చెప్పుల దుకాణాలు ఉన్నాయి. అందులో తన కంపెనీ నిలదొక్కుకోవడం ఎలాగని ఆలోచించాడు కౌశిక్‌. కూరగాయలు, పండ్ల మాదిరి నగరంలోని వీధుల్లో, కూడలీల్లో తిరుగుతూ పాదరక్షలు విక్రయించడం మొదలు పెట్టాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 3 వాహనాల ద్వారా అమ్మకాలు జరుపుతున్నామని 'మూచూ ఇండియా' కంపెనీ వ్యవస్థాపకుడు కౌశిక్‌ తెలిపారు.

దక్షిణాది రాష్ట్రాల్లో 50 స్టోర్​లు ప్రారంభించడమే లక్ష్యం : కంపెనీ ప్రారంభంలో కొన్ని రకాల పాదరక్షలు మాత్రమే లభించేవని కౌశిక్‌ అంటున్నారు. ప్రస్తుతం చాలా రకాల మోడల్స్‌ అందుబాటులో ఉన్నాయన్నారు. తక్కువ ధరలోనే స్టైలిష్‌ పాదరక్షలను కష్టమర్లు అందిస్తున్నామని చెబుతున్నారు. సింథటిక్‌ రబ్బర్‌తో వీటిని తయారు చేస్తున్నామని తెలిపారు. వాహనాలు, స్టోర్‌లతో పాటు వైబ్‌సైట్‌ ద్వారా అమ్మకాలు జరుపుతున్నట్లు ఈ వ్యాపారవేత్త చెబుతున్నారు.

ఆన్‌వీల్స్‌ కాన్సెప్ట్ మొదలు పెట్టిన తర్వాత హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయాని కౌశిక్‌ అంటున్నారు. ఫ్రాంచైజీల ద్వారా మూచూ ఇండియా కంపెనీని విస్తరించే యోచనలో ఉన్నామని చెబుతున్నాడు. ఈ ఏడాది చివరి కల్లా దక్షిణాది రాష్ట్రాలలో సుమారు 50 స్టోర్‌లను ప్రారంభించడమే లక్ష్యమని అంటున్నాడీ యువ వాపారవేత్త.

పెరిగిన కస్టమర్ల తాకిడి : ప్రస్తుతం హైదరాబాద్‌లో 2, విజయవాడలో 2 రెండు స్టోర్‌లతో పాటు వాహనాల ద్వారా నగరంలోని వీధులకు వెళ్లి విక్రయాలు జరుపుతున్నారు. దేశంలో తయారయ్యే అతితక్కువ బ్రాండ్స్‌లో మూచూ కంపెనీ ఒకటి కావడంతో కస్టమర్ల తాకిడి ఎక్కవగా ఉందంటున్నారు. ఒకసారి కొన్నవారు చూట్టుపక్కల వారికి చెప్పడం ద్వారా కంపెనీకి ఆదరణ పెరుగుతోందని నిర్వాహకుడు నవీన్ అంటున్నాడు.

'ఇంజినీర్లు, డాక్టర్లు చాలా ఉన్నారులే నాన్న - నేను కళారంగం వైపు అడుగేస్తా'

మూచూ ఇండియా కంపెనీలో తక్కువ ధరకే కావాల్సిన రంగుల్లో పాదరక్షలు లభిస్తాయని కస్టమర్లు అంటున్నారు. ఎక్కువకాలం మన్నిక రావడంతో కుటుంబ సభ్యులకు కూడా కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారు. సరదాగా థాయ్‌లాండ్‌ విహార యాత్రకు వెళ్లిన ఈ యువకుడు వస్తూ వస్తూ వ్యాపారం చేసే ఆలోచనను తనతో పాటు తెచ్చుకున్నాడు. అందరిలా కాకుండా వినియోగదారుల వద్దకే వెళ్లి కంపెనీ మార్కెటింగ్‌ని మరింత పెంచుకుంటున్నాడు.

23 ఏళ్లకే లస్సీ డే కేఫ్ వ్యాపారం- యశ్వంత్ సక్సెస్ జర్నీ సాగిందిలా

డిగ్రీలు పూర్తి చేసి - సహజ సిద్దమైన వంట నూనె తయారీ వ్యాపారంలో రాణిస్తున్న ముగ్గురు మిత్రులు

Last Updated : Apr 27, 2024, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.